From Wikipedia, the free encyclopedia
గోకర్ణ గ్రామం కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. బెంగళూరుకి 545 కి.మి., ఉత్తర కన్నడ జిల్లా రాజధాని కార్వార్ కి 55 కి.మి దూరంలో ఉంది. గోకర్ణ శైవ క్షేత్రంగా చాలా ప్రసిద్ధి చెందినది. ఈ గ్రామములో అత్యంత సుందరమైన బీచ్ లు కూడా ఉన్నాయి. ఈ గ్రామం గోవా దగ్గరగా ఉండడం బీచ్లు సుందరంగా ఉండడంతో అంతర్జాతీయ పర్యాటకులను సహితం ఆకర్షిస్తోంది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఇతిహాసం త్రేతాయుగం వరకు ఉంది. రావణాసురుడు, శివుని గురించి అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కాని శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమిమీద ఆలింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అయి, అక్కడ నుండి తిరిగి ఎత్త శక్యం కాదని శివుడు చెబుతాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువు తనమాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్య వార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు.
ఈ విషయం తెలుపుకొన్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు. అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్యవార్చుకొనే సమయానికి బ్రాహ్మణ వేషంలో వెడతాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్యవార్చుకొనవలసిన కారణమున ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకొనవలసిందిగా కోరుతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువ సేపు మోయలేనని, మోయలేకపోయే సమయం వచ్చినప్పుడు మూడు సార్లు పిలుస్తానని రావణాసురుడు రాకపోతే ఆలింగాన్ని భూమి పైన పెడతానని చెబుతాడు.
రావణాసురుడు అందుకు అంగీకరించగా, వినాయకుడు లింగాన్ని తన చేతులలోకి తీసుకొంటాడు. రావణాసురుడు సంధ్యవార్చు కోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేక పోతున్నట్లు మూడు సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపతి నెత్తిమీద మొట్టుతాడు, గణపటి నెత్తికి గుంట పడుతుంది. వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ, మురుడేశ్వర లింగం పడిన భాగాలలో ఒక ప్రదేశం.
విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళి కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించ ప్రయత్నం చేస్తాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకు 23 కి.మి. దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. లింగంపై నున్న మూత తొలగించి విసిరి వేస్తే అది గోకర్ణకు 27 కి.మి దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతంపై నున్న మృదేశ్వరలో పడుతుంది. ఆపేరు కాలక్రమంలో మురుడేశ్వరగా మారింది.
మహాబలేశ్వరుడు ఆలయానికి ప్రక్కగా గణపతి ఆలయం ఉంటుంది. రావణాసురుడు తల మొట్టాడు అనడానికి గుర్తుగా గణపతి మాడు మీద ఒక గుంట ఉంటుది.గణపతిని అందరు సృశించవచ్చు, గణపతి అభిషేకం చేయవచ్చు.
మహాబలేశ్వరుడి దేవాలయానికి దగ్గరలొనే భద్రకాళి దేవాలయం ఉంది. భద్రకాళిని అన్నపూర్ణమ్మ తల్లితో సమానంగా భావిస్తారు. ఆవిడ చేతిలో తక్కెడ సరిసమానంగా ఉండకుండా ఒక వైపు ఒరిగి ఉంటుంది, దానికి కారణంగా కాశిలో గంగ మాత్రమే ఉన్నది, కాని గోకర్ణలో కోటి తీర్థం, సముద్రం (ఇక్కడి అరేబియా సముద్రం పుణ్య తీర్థంగా భావిస్తారు.) ప్రాంతీయులు చెబుతారు.
గ్రామములోని తటాకం లేదా కోనేరు. ఈ కోటీ తీర్థాన్ని గంగతో సమానంగా ప్రాంతీయులు భావిస్తారు. పితృ తర్పణాలు ఇక్కడ సమర్పిస్తారు.
గోకర్ణ గ్రామానికి 10 కి.మి. దూరంలో మంగళూరు-ముంబాయి కొంకణ్ రైల్వే లైనులో గోకర్ణ రోడ్ రైల్వే స్టేషను ఉంది. కాని ఈ గోకర్ణ రైల్వే స్టేషనులో ప్యాసింజర్ బళ్ళు మాత్రమే నిలుస్తాయి. ఎక్స్ప్రెస్ బళ్ళు గోకర్ణకు 23 కి.మి. దూరంలో ఉన్న కుంటా, 25 కి.మి. దూరంలో ఉన్న అంకోలా, ఉత్తర కన్నడ రాజధాని కార్వార్లో నిలుస్తాయి.
కార్వార్ నుండి ప్రొద్దున్న 7,8 గంటలకు, మధ్యాహ్నం 4 గంటలకు గోకర్ణకు సరాసరి బస్సులు నడుస్తాయి. మిగతా సమయంలో కార్వార్ నుండి ఆంకోలా వరకు బస్సులు నడుస్తాయి. హొబ్లీ నుండి, హంపినుండి కూడా గోకర్ణకు తరచు బస్సులు ఉన్నాయి. గోవా నుండి ప్రొద్దున్న 8 గంటలకు సరాసరి గోకర్ణకు చేర్చే బస్సు ఉన్నది (5 గంటల ప్రయాణం). మంగళూరు (252 కి.మి. దూరంలో ఉన్నది) నుండి ఉదయం 7 గంటలకు బస్సు ఉంది. బెంగళూరు నుండి పగలు 9 గంటలకు, మైసూర్ నుండి పగలు 6 గంటలకు గోకర్ణకు సరాసరి బస్సులు నడుస్తాయి.
కుంటా నుండి తెల్లవారు జామున 6 గంటల నుండి తరచు టెంపో బస్సులు నడుస్తాయి.
మంగళూరు లేదా పనాజిలోని విమానశ్రయం దగ్గరలోని విమానశ్రయాలు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.