గుడిపాటి వెంకట చలం
తెలుగు రచయిత / From Wikipedia, the free encyclopedia
చలంగా ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకట చలం సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి, సంఘసంస్కర్త. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకడు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక, మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానాలను చర్చించాడు. చలం రచనలలో ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ ఆయనకు ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి.
చలం పేజీ ఇక్కడికి దారితీస్తుంది. అదే పేరు కలిగి ఉన్న ఇతర వ్యాసాల కొరకు, చలం (అయోమయ నివృత్తి) చూడండి.
త్వరిత వాస్తవాలు గుడిపాటి వెంకటచలం, జననం ...
మూసివేయి