![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/fb/Blausen_0463_HeartAttack.png/640px-Blausen_0463_HeartAttack.png&w=640&q=50)
గుండెపోటు
గుండె లోని ఒక భాగానికి రక్త సరఫరాలో అంతరాయం / From Wikipedia, the free encyclopedia
గుండెపోటు ప్రాణాపాయకరమైన గుండెకు సంబంధించిన వ్యాధి.
![]() | ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
గుండెపోటు | |
---|---|
పర్యాయపదాలు | Acute myocardial infarction (AMI), heart attack |
![]() | |
అథెరోస్క్లెరోటిక్ ప్లేక్ నెమ్మదిగా కరోనరీ ఆర్టరీ లోపలి పొరలో పేరుకుపోయినప్పుడు మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ సంభవిస్తుంది. ఆకస్మికంగా చీలిపోయి విపత్తు త్రంబస్ ఏర్పడుతుంది. ధమనిని మూసేయడం, రక్త ప్రవాహాన్ని దిగువకు అడ్డుకోవడం. | |
ప్రత్యేకత | కార్డియాలజీ, అత్యవసర వైద్యం |
లక్షణాలు | ఛాతీ నొప్పి, ఊపిరి ఆడకపోవడం, వికారం, మూర్ఛగా అనిపించడం, చల్లని చెమట, అలసట, చేయి, మెడ, వీపు, దవడ, కడుపుల్లో నొప్పి[1][2] |
ఉపద్రవాలు | గుండె ఆగిపోవడం, కార్డియాక్ అరిథ్మియా, కార్డియోజెనిక్ షాక్, కార్డియాక్ అరెస్ట్[3][4] |
కారణాలు | సాధారణంగా కరోనరీ ఆర్టరీ వ్యాధి[3] |
ప్రమాద కారకాలు | అధిక రక్తపోటు, ధూమపానం, డయాబెటిస్, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, అధిక రక్త కొలెస్ట్రాల్[5][6] |
రోగనిర్ధారణ పద్ధతి | ఎలక్ట్రో కార్డియోగ్రామ్(ECG), రక్త పరీక్షలు, కరోనరీ యాంజియోగ్రఫీ[7] |
చికిత్స | పెర్క్యుటేనియస్ కరోనరీ ఇంటర్వెన్షన్, థ్రాంబోలిసిస్[8] |
ఔషధ ప్రయోగం | ఆస్పిరిన్, నైట్రోగ్లిజరిన్, హెపారిన్[8][9] |
రోగ నిరూపణ | STEMI 10% మరణ ప్రమాదం (అభివృద్ధి చెందిన దేశాలలో)[8] |
తరచుదనం | 15.9 మిలియన్ (2015)[10] |
ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. పొగత్రాగడం, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, వంశానుగతంగా వచ్చే జన్యువులు, వ్యాయామ లోపం, మానసిక ఒత్తిడి హృద్ధమనుల వ్యాధులకు కారణమవుతున్నాయి. గుండెకు రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉన్నపుడు ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెనొప్పి, గుండె పట్టినట్లు ఉండడం కలుగుతుంది (ఏంజైనా). ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగవచ్చు. విరామంతో కాని నాలుక క్రింద నైట్రోగ్లిసరిన్ తీసుకోవడంతో కాని గుండెనొప్పి తగ్గిపోతుంది. ఆకస్మికంగా ఒక హృద్ధమని లేక దాని శాఖ మూసుకుపోతే రక్తప్రసరణ అందని హృదయకండర కణజాలం మరణిస్తుంది (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్). దానిని గుండెపోటుగా వ్యవహరిస్తారు. గుండెపోటు వచ్చినపుడా గుండెనొప్పి తీవ్రంగా ఉంటుంది. కొందరిలో హృద్ధమని పాక్షికంగా మూసుకొని, రక్తప్రసరణ తీవ్రంగా తగ్గినపుడు కండరకణజాలం మరణించకపోయినా తీవ్రమైన అసాధారణ గుండెనొప్పి విశ్రాంతి సమయాల్లో కలగడం, ఎక్కువసమయం ఉండడం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ గుండెనొప్పి అస్థిరమైన గుండెనొప్పి (అన్స్టేబిల్ ఏంజైనా) గా పరిగణించబడుతుంది. గుండెపోటులను, అస్థిరమైన గుండెనొప్పులను కలిపి సత్వరహృద్ధమని వ్యాధులుగా పరిగణిస్తారు. ఈ వ్యక్తులకు అవసరాలను బట్టి అధిగమన శస్త్రచికిత్స (బైపాస్ సర్జరీ) లేదా హృద్ధమని వ్యాకోచ చికిత్సలు (కరోనరీ యాంజియోప్లాస్టీ) వంటి అత్యవసర చికిత్సలు అందించాలి. మళ్లీ బైపాస్ సర్జరీ చేయడం రోగికి ప్రమాదకరం. దీనికి ప్రత్యామ్నాయమే ఇఇసిపి.