గంగా నది
భారతదేశంలో ప్రవహించే ముఖ్యమైన జీవనది / From Wikipedia, the free encyclopedia
గంగానది భారతదేశంలోను, బంగ్లాదేశ్లోను ప్రధానమైన నదులలో ఒకటి. భారతదేశం ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడివడి ఉన్నాయి. హిందూమతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది. "గంగమ్మ తల్లి" అనీ, "పావన గంగ" అనీ, "గంగ భవాని" అనీ ఈ నదిని హిందువులు స్మరిస్తారు. "నీరు" అన్న పదానికి సంస్కృతంలో "గంగా" అన్న పదాన్ని వాడుతారు.
త్వరిత వాస్తవాలు గంగా నది, భౌతిక లక్షణాలు ...
గంగా నది | |
---|---|
భౌతిక లక్షణాలు | |
సముద్రాన్ని చేరే ప్రదేశం | బంగాళాఖాతము |
పొడవు | 2,525 కి.మీ. |
మూసివేయి
గంగా నది మొత్తం పొడవు సుమారు 2,525 కి.మీ. (1,557 మైళ్ళు). గంగా, దాని ఉపనదియైన యమున కలిసి విశాలమైన మైదానప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. సారవంతమైన ఈ "గంగా-యమునా మైదానం" ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్లలో విస్తరించి ఉంది. మొత్తం ప్రపంచ జనాభాలో 8.5 % ప్రజలకు (ప్రతి 12 మందిలో ఒకరికి) ఈ మైదానం నివాసస్థానం. ఈ కారణంగా ఈ ప్రాంతంలో తీవ్రమైన ఆర్థిక, పర్యావరణ, సాంఘిక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.