కొంగర జగ్గయ్య
సినీ నటుడు / From Wikipedia, the free encyclopedia
కొంగర జగ్గయ్య (డిసెంబర్ 31, 1928 - మార్చి 5, 2004) తెలుగు సినిమా, రంగస్థల నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు. మేఘ గంభీరమైన అతను కంఠం కారణంగా అతను "కంచు కంఠం" జగ్గయ్యగా, "కళా వాచస్పతి"గా పేరుగాంచాడు. భారత ప్రభుత్వం 1992 లో ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్ అవార్డ్ ను ఇచ్చి సత్కరించింది.
త్వరిత వాస్తవాలు కొంగర జగ్గయ్య, జననం ...
కొంగర జగ్గయ్య | |
---|---|
![]() కళా వాచస్పతి కొంగర జగ్గయ్య | |
జననం | డిసెంబర్ 31, 1928 మోరంపూడి ఆంధ్రప్రదేశ్ |
మరణం | మార్చి 5, 2004 చెన్నై |
ఇతర పేర్లు | కళా వాచస్పతి, "కంచు కంఠం" జగ్గయ్య |
వృత్తి | నాటకం, సినిమా, రాజకీయం |
పదవి పేరు | నాలుగవ లోక్సభ సభ్యులు |
పదవీ కాలం | 1967- 1972 |
రాజకీయ పార్టీ | జాతీయ కాంగ్రెస్ పార్టీ |
మతం | హిందువు |
పురస్కారాలు | 1992 లో పద్మభూషణ్ అవార్డ్ |
మూసివేయి