![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/98/Konkani_written_in_Devanagari_script.png/640px-Konkani_written_in_Devanagari_script.png&w=640&q=50)
కొంకణి భాష
From Wikipedia, the free encyclopedia
కొంకణి[note 4][note 1] అన్నది ఇండో యూరోపియన్ వర్గానికి చెందిన ఇండో ఆర్యన్ భాష, దీన్ని భారతదేశపు నైఋతి తీరమంతా మాట్లాడతారు. భారత రాజ్యాంగపు 8వ షెడ్యూల్లో ప్రస్తావించిన 22 షెడ్యూల్డ్ భాషల్లో ఇది ఒకటి.[2] గోవా రాష్ట్రానికి ఇది అధికారిక భాష. ప్రస్తుతం లభిస్తున్న మొట్టమొదటి కొంకణీ శాసనం సా.శ. 1187 నాటిది.[3] కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర కేరళ (కాసర్ గోడ్ జిల్లా), దాద్రా నగరు హవేలీ, డామన్ డయ్యుల్లో ఇది మైనారిటీ భాష.[4]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/98/Konkani_written_in_Devanagari_script.png/640px-Konkani_written_in_Devanagari_script.png)
కొంకణీ దక్షిణ ఇండో-ఆర్యన్ భాషా కుటుంబంలోనిది. ఇది ప్రాచీన ఇండో-ఆర్యన్ భాషా నిర్మాణాలను నిలబెట్టుకుంది[మూలాలు తెలుపవలెను], తూర్పు, పశ్చిమ ఇండో-ఆర్యన్ భాషలు రెంటితోనూ సాపత్యం కలిగివుంది.[5]