కె.వి.మహదేవన్
సంగీత దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (కె. వి. మహదేవన్) (జ. 1917 మార్చి 14 - 2001 జూన్ 21) దక్షిణ భారతీయ చలన చిత్ర సంగీత దర్శకుడు. తమిళ అయ్యర్ కుటుంబానికి చెందిన మహదేవన్ చిన్నతనం నుంచి సంగీతం వైపు ఆసక్తి చూపాడు. వీరి పూర్వీకులు కూడా సంగీత రంగంలో నిష్ణాతులే. ఏడవ తరగతి వరకు చదివి ఆపేసి నాటకాల్లో నటించాడు. తర్వాత చిత్రాల్లో పనిచేయడం కోసం మద్రాసు వెళ్ళాడు. మొదటగా కొన్ని చిత్రాల్లో జూనియర్ ఆర్టిస్టుగా నటించాడు. తర్వాత కొంతమంది మిత్రులు సంగీత రంగంవైపు మళ్ళమని సలహా ఇవ్వడంతో సంగీత దర్శకుడు ఎస్. వి. వెంకట్రామన్ దగ్గర సహాయకుడిగా చేరాడు. టి. ఎ. కల్యాణం దగ్గర కూడా పనిచేసి వృత్తి మెలకువలు నేర్చుకున్నాడు.1942 లో ఆనందన్ అనే చిత్రానికి మొదటగా సంగీత దర్శకత్వం వహించాడు. 1952 లో ఈయనకు మలయాళీ అయిన పుహళేంది తో పరిచయం ఏర్పడింది. పుహళేంది మహదేవన్ తో కలిసి చివరి దాకా పనిచేశాడు. 1962 లో విడుదలైన మంచి మనసులు సినిమాలో ఈయన స్వరపరిచిన మామ మామ అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది. ఈయనకు మామ అనే ముద్దు పేరు కూడా వచ్చింది. ఈయన ఎక్కువగా కవి పాట రాశాక స్వరపరిచేవాడు. చివరి దశలో నరాల బలహీనత వ్యాధితో బాధ పడ్డాడు. మాట పడిపోయి మతిస్థిమితం కూడా కోల్పోయాడు. శ్వాస తీసుకోవడం కష్టమై 2001 లో మరణించాడు. ఈయన సంగీతం కూర్చిన చివరి సినిమా కబీర్ దాస్ (2003).
కె. వి. మహదేవన్ | |
---|---|
![]() కె.వి.మహదేవన్ | |
జననం | కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహదేవన్ (1917-03-14)1917 మార్చి 14 నాగర్‌కోయిల్, తమిళనాడు |
మరణం | 2001 జూన్ 21(2001-06-21) (వయసు 84) |
ఇతర పేర్లు | మామ |
వృత్తి | సంగీత దర్శకుడు |
తల్లిదండ్రులు |
|