కామశాస్త్రం
From Wikipedia, the free encyclopedia
కామశాస్త్రం : భారతీయ సాహిత్యంలో "కామం" గురించి, శాస్త్రీయ దృక్ఫదంతో రచించబడిన సాహిత్యం. చాణక్యుడు ఆర్థికశాస్త్రం గురించి రచించిన అర్థశాస్త్రం లాగానే, కామశాస్త్రంకూడా ఒక శాస్త్రీయ గ్రంథము. కామశాస్త్రం, నాగరికుల కొరకు సశాస్త్రీయ జ్ఞానంతో, శారీరక ఇచ్ఛను పొందే మార్గాలను సూచించే సాహిత్యం.
ఈ వ్యాసం 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే. లైంగికత గురించి చర్చించటం మూలాన ఈ వ్యాసం చదవటం అందరికీ అమోదయోగ్యం కాకపోవచ్చును . ఇది మీకు సౌకర్యవంతం కాకపోతే దయచేసి తక్షణమే ఈ పుట నుండి నిష్క్రమించ ప్రార్థన. |
ప్రాచీన సాహిత్యాలలో ఇప్పటికీ లభ్యమవుతున్న గ్రంథం కామసూత్ర. దీనిని వాత్స్యాయనుడు రచించాడు. వాత్స్యాయనుడి తరువాత, అనేకులు అనేక గ్రంథాలు వ్రాశారు, వాటిలో లభ్యమవుతున్నవి, ముఖ్యమైనవి;
- కొక్కాకుడు రచించిన రతి రహస్యం (13వ శతాబ్దం)
- కళ్యాణమల్లుడు రచించిన అనంగరంగ (16వ శతాబ్దం).
- జయమంగలుడి వ్యాఖ్యానాలు వాత్స్యానుడిపై (13వ శతాబ్దం).