కరాచీ
పాకిస్తాన్ లోని నగరం / From Wikipedia, the free encyclopedia
కరాచీ పాకిస్తాన్ దేశంలో అతిపెద్ద నగరం,[1][2] ప్రపంచంలో 12వ అతిపెద్ద నగరం.[3] ఇది పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్సుకు రాజధాని నగరం. ప్రపంచ స్థాయి నగరంగా గుర్తించబడిన కరాచీ పాకిస్తాన్ ముఖ్యమైన ఆర్థిక, పారిశ్రామిక కేంద్రం. అరేబియా సముద్రము పక్కనే ఉండటం వల్ల ఇక్కడ ప్రపంచ వాణిజ్యానికి అవసరమైన కరాచీ ఓడరేవు, బిన్ ఖాసిం ఓడరేవులు ఉన్నాయి. పాకిస్తాన్ లోనే అతి పెద్దదైన జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.