From Wikipedia, the free encyclopedia
క అనేది తెలుగు అక్షరమాలలోని హల్లులలో ప్రథమాక్షరము. హల్లులలో కంఠ్య శ్వాస అల్పప్రాణ (Unaspirated voiceless velar plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [k]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [k].
ఇది వ్యంజనవర్ణములలోని మొదటి యక్షరము. ఇది "క" వర్గంలో మొదటి అక్షరం.
"క" ను వివిధ భాషలలో ప్రత్యయంగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు చదువు'క'రా; ఎత్తు'క'రా, తీసు'క'పో మొదలగు పదాలున్నాయి. ఇవే పదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కోస్తా ప్రాంతంలో "కు" ప్రత్యయంగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు చదువు'కు'రా; ఎత్తు'కు'రా, తీసు'కు'పో మొదలగునవి.
సుమతీ శతకంలోని పద్యాలలో ఈ ప్రత్యయం కనిపిస్తుంది. ఉదాహరణకు
భాస్కర రామాయణం లోని పద్యాలలో ఈ ప్రత్యయం కనిపిస్తుంది. ఉదాహరణకు
మల్హణ చరిత్ర లో పద్య పాదమైన "చెలియా పిలుచుకరమ్మా" లో "క" ప్రత్యయాన్ని ఉపయోగించారు.
అనర్ఘరాఘవం లో "త్రవ్వుక తినెడు భూదారవరుని" అనే పాదంలో, హంసవింశతి లో "నవమేషముఁ బట్టుకపోవ" పాదంలో, కాళహస్తిమాహాత్మ్యం లోని "నూఱుక త్రావ నీతఁడు కనుంగొనునంతటిలో మనుష్యులన్" పాదంలో కూడా "క" ప్రత్యయాన్ని ఉపయోగించడం గమనించవచ్చు.
పలుకడానికి కొంత శ్రమ అవుసరమైన అక్షరాలు పరుషములు. వీటికి "శ్వాసములు" అన్న పేరు కూడా ఉంది. "క,చ,ట,త,ప"లు పరుషములు అంటారు.
క, కా, కి, కీ, కు, కూ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః
క+అ | క+ఆ | క+ఇ | క+ఈ | క+ఉ | క+ఊ | క+ఎ | క+ఏ | క+ఐ | క+ఒ | క+ఓ | క+ఔ | క+అం | క+అః |
క | కా | కి | కీ | కు | కూ | కె | కే | కై | కొ | కో | కౌ | కం | కః |
ఒక హల్లు (వర్ణము) మరల మరల వచ్చుటను వృత్యనుప్రాసమందురు. [1]
ఉదా: కాకీక కాకికి కాక కేకికా?
కాకి ఈక కాకికి కాక కేకి (నెమలి) కి ఉంటుందా? అని అర్థం.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.