From Wikipedia, the free encyclopedia
ఎండుగడ్డిని చొప్ప అని కూడా అంటారు. ఇది ఒక వ్యవసాయ ఉత్పత్తి, వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న వంటి మొక్కల నుండి ధాన్యాన్ని సేకరించిన తరువాత ఎండిన కాండాలను ఎండుగడ్డి అంటారు. ఎండుగడ్డిని ఆంగ్లంలో స్ట్రా (Straw) అంటారు. ఎండుగడ్డి ధాన్యజాతి పంటలైనటు వంటి బార్లీ, వోట్స్, వరి, రై, గోధుమల నుండి సగం పైనే దిగుబడి వస్తుంది. ఇది అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఇంధనంగా, ఇంటి పైకప్పుగా, బుట్టలు తయారీకి, ఉపయోగపడుతుంది. వీటిని దగ్గరగా చుట్టి నిల్వ చేస్తారు. వీటిని ఒక తీగతో చుట్టి బేల్స్ గా తయారుచేస్తారు. వీటిని దీర్ఘచతురస్రాకారంగా గానీ, గుండ్రంగా గానీ వాటి ఉపయోగానికి తగినట్లు తయారుచేసి భద్రపరుస్తారు.
ఎందు గడ్డిని పశువులకు లేదా గుర్రాలకు పశుగ్రాసంగా వినియోగిస్తారు. దీనివలన వాటికి అవసరమైన శక్తిని తగిన రీతిగా అందించబడుతుంది. ఇది వేగంగా జీర్ణంచెసుకోగల ఆహారం. ఈ ఆహారం వల్ల సూక్ష్మ వ్యవస్థల కారణంగా ఉష్ణం వెలువడి అది శీతల ప్రాంతంలో గల పశువులకు శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉండేటట్లు చేస్తుంది. దీనిలో అతి తక్కువ పోషక పదార్థాలు ఉన్నందువల్ల దీనిని ఆహారంగా నిషేధించారు. కానీ దీనిని చిన్న ముక్కలుగా చేసి ఆహారంగా పెడతారు. దీనిని తవుడు అనవచ్చును.
ఎండు గడ్డిని కార్బన్-న్యూట్రల్ శక్తి వనరుగా ఉపయోగించవచ్చు. ఇది "బయో బ్యుటనోల్"ను వేగంగా ఉత్పత్తి చేస్తుంది. ఎండుగడ్డితో చుట్టిన దిమ్మలు బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.