![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/31/Flag_of_Equatorial_Guinea.svg/langte-640px-Flag_of_Equatorial_Guinea.svg.png&w=640&q=50)
ఈక్వటోరియల్ గ్వినియా
ఆఫ్రికాలో ఒక దేశం / From Wikipedia, the free encyclopedia
ఈక్వెటోరియల్ గినియా అధికారికంగా ఈక్వెటోరియల్ గినియా రిపబ్లిక్ మధ్య ఆఫ్రికాలో ఉన్న ఒక దేశం. దేశవైశాల్యం 28,000 చదరపు కిలో మీటర్లు. ముందుగా స్పానిష్ గినియా కాలనీగా ఉండి స్వాతంత్ర్యం తరువాత భూమధ్యరేఖకు సమీపంలో గినియా గల్ఫు మద్య ఉన్నందున ఈక్వెటోరియల్ గినియా అయింది. ఈక్వెటోరియల్ గినియా స్పానిషు అధికారభాషగా కలిగిన ఏకైక సార్వభౌమ ఆఫ్రికన్ దేశంగా గుర్తించబడుతుంది. 2015 నాటికి దేశంలో 12,22,245 మంది ప్రజలు ఉన్నారు.[12]
Republic of Equatorial Guinea
| |
---|---|
నినాదం:
| |
గీతం: Caminemos pisando las sendas de nuestra inmensa felicidad (Spanish) Let us walk stepping the paths of our immense happiness | |
![]() Location of ఈక్వటోరియల్ గ్వినియా (dark blue) – in Africa (light blue & dark grey) | |
రాజధాని | Malabo 3°45′N 8°47′E |
అతిపెద్ద నగరం | Bata |
అధికార భాషలు | Spanish (national language) French Portuguese[1][2][3] |
గుర్తించిన ప్రాంతీయ భాషలు | Fang Bube Combe Pidgin English Annobonese, Igbo[4][5] |
జాతులు (1994[6]) |
|
పిలుచువిధం |
|
ప్రభుత్వం | Unitary dominant-party presidential republic (de jure) under an authoritarian dictatorship (de facto)[7] |
• President | Teodoro Obiang Nguema Mbasogo |
• Prime Minister | Francisco Pascual Obama Asue |
• First Vice President | Teodoro Nguema Obiang Mangue |
శాసనవ్యవస్థ | Parliament |
• ఎగువ సభ | Senate |
• దిగువ సభ | Chamber of Deputies |
Independence | |
• from Spain | 12 October 1968 |
విస్తీర్ణం | |
• మొత్తం | 28,050 కి.మీ2 (10,830 చ. మై.) (141st) |
• నీరు (%) | negligible |
జనాభా | |
• 2016 estimate | 1,221,490[8] |
• 2015 census | 1,222,442[9] |
GDP (PPP) | 2018 estimate |
• Total | $28 billion[10] |
• Per capita | $32,855[10] |
GDP (nominal) | 2018 estimate |
• Total | $12 billion[10] |
• Per capita | $13,350[10] |
హెచ్డిఐ (2017) | ![]() medium · 141th |
ద్రవ్యం | Central African CFA franc (XAF) |
కాల విభాగం | UTC+1 (WAT) |
వాహనాలు నడుపు వైపు | right |
ఫోన్ కోడ్ | +240 |
ISO 3166 code | GQ |
Internet TLD | .gq |
|
ఈక్వటోరియల్ గినియాలో రెండు భాగాలు ఉన్నాయి. ఒక ద్వీపభూభాగం, ఒక ప్రధాన భూభాగం ఉంటుంది. ద్వీపభాగంలో గినియా గల్ఫులో ఉన్న బికాకో ద్వీపాలు (గతంలో ఫెర్నాండో పో) గినియాలోని గల్నీ, అన్నాబన్ ద్వీపాలు (భూమధ్యరేఖకు దక్షిణాన దక్షిణాన ఉన్న ఒక చిన్న అగ్నిపర్వత ద్వీపం) ఉన్నాయి. బికోక్ ద్వీపము ఈక్వటోరియల్ గినియా ఉత్తర భాగంలో ఉంది. ఇక్కడ దేశ రాజధాని అయిన మలాబో ఉంది. బయోకో, అన్నాబొన్ల మధ్య సావో టోం, ప్రిన్సిపి ద్వీప దేశం ఉంది. ప్రధాన భూభాగం రియో మున దక్షిణ, తూర్పు సరిహద్దులలో గాబన్ ఉత్తరసరిహద్దులో కామెరూన్ సరిహద్దులుగా ఉన్నాయి. ఇక్కడ ఈక్వెటోరియల్ గినియా అతిపెద్ద నగరం, దేశం భవిష్యత్తు రాజధాని అయిన ఓయాల నగరాలు ఉన్నాయి. రియో ముని ప్రాంతంలో అనేక చిన్న తీరప్రాంత దీవులు ఉన్నాయి. వీటిలో కరిస్కో, ఎలోబే గ్రాండే, ఎలోబే చికో వంటివి ఉన్నాయి. దేశం ఆఫ్రికన్ యూనియన్, ఫ్రాంకోఫొనీ, ఒపెక్, ఐ.పి.ఎల్.పి.లో సభ్యదేశంగా ఉంది.
1990 ల మధ్యకాలం నుండి ఈక్వాటోరియల్ గినియా సబ్ సహారన్ ఆఫ్రికాలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులలో ఒకటిగా మారింది. ఇది ఆఫ్రికాలోని సంపన్న దేశంగా ఉంది.[13] దాని స్థూల దేశీయ ఉత్పత్తి (జి.డి.పి) తలసరి కొనుగోలు (పి.పి.పి) ప్రపంచంలో 43 వ స్థానంలో ఉంది.[14] సంపద పంపిణీ చాలా అసమానంగా ఉంటుంది. కొంతమంది చమురు సంపద నుండి ప్రయోజనం పొందారు. 2016 ఐక్యరాజ్య సమితి మానవ అభివృద్ధి సూచికలో దేశం 135 వ స్థానంలో ఉంది.[11] ఐక్యరాజ్య సమితి నివేదిక ఆధారంగా జనాభాలో సగం కంటే తక్కువ మందికి త్రాగునీరు అందుబాటులో ఉంటుందని, ఐదు సంవత్సరాల లోపు వయస్సులో 20% పిల్లలు చనిపోతున్నారని భావిస్తున్నారు.
సార్వభౌమదేశ నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రపంచంలోని అతి భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘన రికార్డులలో ఒకటిగా పేర్కొనబడింది. ఫ్రీడమ్ హౌస్ రాజకీయ, పౌర హక్కుల వార్షిక సర్వేలో స్థిరంగా హీనమైన స్థానం సంపాదించింది.[15] రిపోర్టర్సు వితౌట్ బోర్టర్సు ఆధారంగా అధ్యక్షుడు తెడోరో ఒబియాంగ్ నగ్మామా మబాసోగోను " ప్రిడేటర్ ఆఫ్ ప్రెస్ "గా వర్ణించింది.[16] మానవ అక్రమ రవాణా ఒక ముఖ్యమైన సమస్యగా ఉంది. 2012 లో యు.ఎస్. ట్రాఫికింగ్ పర్సన్స్ రిపోర్టులో ఈక్వాటోరియల్ గినియా "స్త్రీలు, పిల్లలను నిర్బంధిత కార్మికులుగా, లైంగిక అక్రమ రవాణాకు బలవంతం చేయడానికి గమ్యస్థానం." ఒక నివేదికగా అందించింది. ఈ నివేదిక ఈక్వెటోరియల్ ప్రభుత్వాన్ని "కనీస ప్రమాణాలను పూర్తిగా పాటించదు. అలా చేయటానికి గణనీయమైన ప్రయత్నాలు చేయలేదు." తెలియజేసిందు.[17]