సరళ దేహాలు, పత్రహరితం గల విభిన్న నిమ్న జాతి మొక్కల సముదాయము - శైవలాలు (లాటిన్: Algae). శైవలాల అధ్యయన శాస్త్రాన్ని 'ఫైకాలజీ' (Phycology) అంటారు. శైవలాలలో సుమారు 18,000 ప్రజాతులు, 30,000 జాతులు ఉన్నాయి. ఇవి భౌగోళికంగా బహువైవిధ్యం కలిగి మంచి నీటిలో, ఉప్పునీటిలో, సముద్రాలలో, తడినేలలపై, రాళ్ళపై, మంచుతో కప్పబడిన ధృవప్రాంతాలలోను కొన్ని మొక్కల దేహభాగాలపై నివసిస్తాయి.

Thumb
లారెన్సియా, హవాయి సముద్రంలో నివసించే ఎరుపు శైవలము.

ఇవి ఏకకణ లేదా బహుకణ నిర్మితాలుగా ఉండవచ్చును. ఆహారంగా, పశుగ్రాసంగా ప్రాచీన కాలం నుండి శైవలాలు మానవులకు పరిచయం. శైవలాలు పత్రహరితం ఉండడం వల్ల స్వయం పోషకాలు. మొక్కలుత్పత్తి చేసే 90 శాతం ఆక్సిజన్ వీటి నుండే విడుదలై జీవావరణంలో సకల జీవుల మనుగడకు కారణభూతమై ఉంది.

వర్గీకరణ

  • ఎఫ్.ఇ.ఫ్రిట్చ్ శైవలాలను వర్ణద్రవ్యాల వైవిధ్యంపై ఆధారంగా 11 తగరగులుగా విభజించాడు.
    • క్లోరోఫైసీ (Chlorophyceae - Grass green algae) :క్లోరొపైసి (దీనిలో ఉండే వర్ణకం క్లోరోఫిల్)
    • జాంతోఫైసీ (Xanthophyceae - Yellow green algae) :
    • క్రైసోఫైసీ (Chrysophyceae) :
    • బాసిల్లారియోఫైసీ (Bacillariophyceae - Diatoms) :
    • క్రిప్టోఫైసీ (Cryptophyceae) :
    • డైనోఫైసీ (Dynophyceae) :
    • క్లోరోమొనాడినె (Chloromonadinae) :
    • యూగ్లినోఫైసీ (Euglenophyceae) :
    • ఫియోఫైసీ (Phaeophyceae - Brown algae) :
    • రోడోఫైసీ (Rhodophyceae - Red algae) :
    • సయనోఫైసీ (Cyanophyceae - Blue green algae or Cyanobacteria) :

శైవలాల ఉపయోగాలు

  • ప్రాథమిక ఉత్పత్తిదారులు:
  • మానవ ఆహారంగా శైవలాలు:
  • పశుగ్రాసంగా శైవలాలు:
  • ఎరువులుగా శైవలాలు : గోధుమ శైవలాలలో ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండడం వల్ల వీనిని చాలా సముద్రతీర దేశాలలో ఎరువులుగా వాడతారు. ఆకుపచ్చ ఎరువులుగా నీలి ఆకుపచ్చ శైవలాలు ప్రాచుర్యం పొందాయి. వీనిలో నత్రజని, ఫాస్ఫరస్ గాఢత అధికంగా ఉంటుంది. సుమారు 40 జాతుల శైవలాలు నత్రజని స్థాపకులుగా నిరూపించబడ్డాయి. నాస్టాక్, అనబినా, టొలిపోథ్రిక్సు, అలోసిరా, అనబినాప్సిస్, స్పైరులినా మొదలైనవి జీవ ఎరువులుగా వినియోగిస్తున్నారు. అధిక ఆహారోత్పత్తులకు వీటి వాడకం మంచి పద్ధతి.
  • చేపల పెంపకంలో శైవలాలు : ఉప్పునీటి, మంచినీటి శైవలాలు చేపలకు, తదితర జలచరాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆహారంగా పనికివస్తాయి. హరిత శైవలాలు, డయాటమ్ లు, కొన్ని నీలి ఆకుపచ్చ శైవలాలు చేపల పోషణలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. చేపల్లో లభ్యమయ్యే విటమిన్లు, వీటి నుండి గ్రహించినవే. అనేక ఇతర ఏకకణ, సామూహిక, తంతురూప శైవలాలు నీటిలోని కీటకాలకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ఈ కీటకాలను చేపలు తింటాయి. శైవలాలు కిరణజన్య సంయోగక్రియలో నీటిలోని C02 ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేయడం వలన నీటిని శుభ్రపరుస్తాయి.
  • క్షారభూముల్ని సారవంతం చేయడం:
  • పారిశ్రామిక రంగంలో శైవలాలు:
  • శైవలాల నుండి వాణిజ్య ఉత్పత్తులు:
  • శైవలాల నుండి మందులు:
  • మురికి నీటిని శుభ్రంచేసే శైవలాలు:

ఇవికూడా చూడండి

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.