అంబరీష్
From Wikipedia, the free encyclopedia
అంబరీష్ ( 1952 మే 29 - 2018 నవంబర్ 24 ) ఒక కన్నడ సినిమా నటుడు, రాజకీయనాయకుడు. అప్పటి మైసూరు రాష్ట్రంలో మండ్య జిల్లాలో జన్మించిన ఈయన మైసూరులో ఉన్నత విద్యాభ్యాసం చేశాడు. సినిమాల్లో మొదటగా ప్రతినాయక పాత్రలు పోషించి తర్వాత కథానాయకుడిగా మారి సుమారు 200కి పైగా సినిమాల్లో నటించాడు.
ఎం. హెచ్. అంబరీష్ - ಎಂ.ಹೆಚ್.ಅಂಬರೀಶ್ | |||
![]() 2006లో అంబరీష్ | |||
పదవీ కాలం 24 October 2006 - 15 February 2007 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
---|---|---|---|
తరువాత | చౌదురి మోహన్ జతువ & ఎస్. జగత్ రక్షకణ్ | ||
పదవీ కాలం 1998-2009 | |||
ముందు | ఎస్. ఎం. కృష్ణ | ||
తరువాత | చెలువరాయ స్వామి | ||
నియోజకవర్గం | మాండ్య | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1952-05-29)1952 మే 29 మండ్య (ಮಂಡ್ಯ), కర్ణాటక (ಕರ್ನಾಟಕ) | ||
మరణం | 2018 నవంబరు 24(2018-11-24) (వయసు 66) బెంగుళూరు, కర్ణాటక (ಕರ್ನಾಟಕ) | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | సుమలత | ||
సంతానం | ఒక కుమారుడు - అభిషేక్ గౌడ | ||
నివాసం | బెంగుళూరు (ಬೆಂಗಳೂರು) | ||
వృత్తి | నటుడు | ||
మతం | హిందూ |
1994 లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 1996 ఎన్నికల్లో పార్టీ టెకెట్ దక్కకపోవడంతో జనతాదళ్ పార్టీలో చేరి 1998 నుంచి మండ్య నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు పర్యాయాలు మండ్య పార్లమెంటరీ నియోజక వర్గం నుంచి ఎం. పిగా ఎన్నికయ్యాడు. 14 వ లోక్ సభలో ప్రసార్ శాఖ మంత్రి (స్టేట్) గా పనిచేశాడు. 2009 ఎన్నిల్లో పరాజయం పాలయ్యాడు.
ఇతను ప్రముఖ తెలుగు నటి సుమలతను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు అభిషేక్. ఇతను సినీ నటుడు. కన్నడ రెబెల్ స్టార్ గా పిలవబడే ఈయన్ను అభిమానులు ఆయన్ను ముద్దుగా అంబి అని కూడా పిలుచుకుంటారు.