ప్రపంచంలోని కంప్యూటర్లను, ఎలాక్ట్రానిక్ వస్తువులను అనుసంధానం చేసే వ్యవస్థ From Wikipedia, the free encyclopedia
అంతర్జాలాన్ని ఆంగ్లంలో "ఇంటర్నెట్" (Internet) అని అంటారు. అంతర్జాలము అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను కలిపే ఒక వ్యవస్థ. మరింత వివరంగా చెప్పాలంటే ఇంటర్నెట్ నెట్వర్క్ లను కలిపే నెట్వర్క్. ఈ వ్యవస్థలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకొనేటందుకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనే నియమావళిని ఉపయోగిస్తారు.
ఇంటర్నెట్ అంటే ఏమిటో అర్ధం అవటానికి ఒక చిన్న ఉపమానం చెప్పుకోవచ్చు. ఒక పేటలో ఉన్న ఇళ్ళని కలుపుతూ ఒక వీధి ఉంటుంది. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళటానికి ఈ వీధి అవసరం. ఊళ్ళో ఉన్న పేటలన్నిటిని కలుపటానికి అల్లిబిల్లిగా అల్లుకుని ఊరు నిండా పెద్ద రహదారులు (రోడ్లు) ఉంటాయి. ఒక ఊరు నుండి మరొక ఊరికి వెళ్ళటానికి ప్రాంతీయ రహదారులు ఉంటాయి. ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళటానికి సముద్రంలోనూ, ఆకాశంలోనూ 'అంతర్జాతీయ రహదారులు' ఉంటాయి. ఒక మేపులో చూస్తే ఈ చిన్నవీధులు, రహదారులూ అన్ని ఒక జాలరివాడి వలలా కనిపిస్తాయి. ఇదే విధంగా ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లు అన్నీ కూడా చిన్న చిన్న ప్రాంతీయ వలల లాగా, పెద్ద పెద్ద అంతర్జాతీయంగా అల్లుకుపోయిన వలల లాగా కనిపిస్తాయి కనుక వీటిని అంతర్జాలం అంటారు.
ఇంటర్నెట్ ద్వారా ఎటువంటి సమాచారాన్ని అయినా క్షణాల్లో సేకరించుకోవచ్చు. ఇంటర్నెట్ కంప్యూటర్లకు సమాచారం చేరవేసే అద్భుతమైన సాధనం. అన్ని కంప్యూటర్లకు అందుబాటులో ఉండే కమ్యూనికేషన్ టెక్నాలజీ సాధనమే ఇంటర్నెట్. ప్రపంచంలోని అన్నిరకాల నెట్ వర్కులన్నింటి వల్ల కమ్యూనికేషన్ ప్రక్రియలో కోట్లాది మంది వ్యక్తులు అనుసంధానంలో ఉంటారు.
మెషిన్లు శాటిలైట్లు, సర్వర్లు, కంప్యూటర్లు ఒకదానితో మరొక్కటి అనుసంధానించిన అసంఖ్యాకమైన స్టాప్‌వేర్ ప్రొగ్రాంలు ప్రపంచ వ్యాప్తంగా ఆయా కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉన్న బహ్మండమైన నెట్వర్క్.. ఇవన్నీ ఇంటర్నెట్లో భాగాలే. ప్రతిరోజూ కోట్లాది మంది సమాచారాన్ని తీసుకునే ఆధునాతనమైన కమ్యూనికేషన్ మీడియా ఇంటర్నెట్. వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వ పరిపాలనా దాకా ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో మన దశ, దిశ గురించి తెలుసుకోవచ్చు.
ఇంటర్నెట్ మాతృకను అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. 1973లో ఇంగ్లాండు-నార్వే మధ్య ప్రపంచ మొట్టమొదటి కమర్షియల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ప్రారంభమైంది. 1982లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ అన్నమాట వాడ కం ప్రారంభమైంది. ప్రతి నిమిషం ఇంటర్నెట్ ద్వారా వేలకోట్ల రూపాయల వ్యాపా ర లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఏ రంగానికైనా కావలసిన సమాచారం ఇంటర్నెట్లో అవలీలగా లభ్యమవుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా వేలాది టీవీ చానళ్లు, వార్తాపత్రికలు అలాగే విద్యార్థుల చదువులు, ఫలితాలు, కౌన్సిలింగ్, రైతులు, మీ సేవా వంటి సేవలు ఇట్లా ఏ రంగాన్ని నెట్‌తో సంబంధం లేకుండా ఊహించుకోలేము.
ఇంటర్నెట్ చరిత్ర చాల పెద్దది. అమెరికా భద్రతా విభాగమయిన "ఎడ్వాన్సెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ ఆర్పా(ARPA)" వారి నిధులతో సృష్టించబడింది.
చాలా మందికి ఇంటర్నెట్ కి వరల్డ్ వైడ్ వెబ్ కి మధ్య ఉన్న తేడా తెలియదు. ఈ రెండింటిని ప్రత్యామ్నాయ పదబంధాలుగా వాడెస్తూ ఉంటారు. అలా చెయ్యడం వల్ల కొంప మునిగిపోయేఅంత నష్టం ఏమీ లేదు కాని ఈ రెండింటికి మధ్య తేడా ఉండడం ఉంది.
సాంకేతిక ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. అందుకని వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు కంపెనీలు పోటీ పడడం సహజం. పీ.సీ లకు మొబైల్ ఫోన్ లకు ఇంటర్నెట్ వేగం రకరకలా విధాలుగా 100 యంబీపీయస్ నుండి శక్తివంతమైన 4జీ (జెనరేషన్), కొన్ని ఏరియాల్లో 5జీ (జెనరేషన్) ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నది. మే 2019లో ఆస్ట్రేలియా 'అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని నమోదు చేసింది' సెకనుకు 44.2 టెరాబైట్స్ (టిబిపిఎస్).[1]
2021 జూలైలో జపాన్‌కు చెందిన ఎన్ఐసీటీ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ప్రపంచంలోనే వేగవంతమైన ఇంటర్నెట్ను విజయవంతంగా పరీక్షించి రికార్డు నెలకొల్పారు. దీని ద్వారా సెకనుకు 319 టెరాబైట్స్ స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలను అందిచవచ్చని తేల్చారు. 2020లో ఇది 178 టెరాబైట్/సెకన్ గా నమోదు అయింది.
ఈ ప్రయోగంలో అత్యాధునిక ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీతోపాటు స్టాండర్డ్ అవుటర్ డయామీటర్, 4-కోర్ ఆప్టికల్ ఫైబర్‌ను ఉపయోగించారు. అలానే ఎర్బియం, థులియం కలయికతో రూపొందించిన ఫైబర్ యాంప్లిఫయర్, రామన్ యాంప్లిఫికేషన్ ద్వారా 3,001 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ఇంటర్నెట్ను ట్రాన్స్మిట్ చేసారు.[2]
1896లో స్థాపించబడిన జపాన్ కమ్యూనికేషన్స్ రీసెర్చ్ లాబొరేటరీ, టెలికమ్యూనికేషన్స్ అడ్వాన్స్మెంట్ ఆర్గనైజేషన్‌తో 2004లో విలీనం అయినప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (NICT) స్వతంత్ర పరిపాలనా సంస్థగా స్థాపించబడింది.[3] NICT ప్రధాన లక్ష్యం సమాచారం, సమాచార సాంకేతిక రంగంలో పరిశోధన చేయడం తద్వారా అభివృద్ధి పరచడం.
జపాన్ రేడియో చట్టం ఆధారంగా గ్లోబల్ మారిటైమ్ డిస్ట్రెస్ సేఫ్టీ సిస్టమ్ (GMDSS), మెరైన్ రాడార్ కోసం రేడియో పరికరాల రకం ఆమోద పరీక్షలను నిర్వహించడం; అయానోస్పియర్, అంతరిక్ష వాతావరణంపై సాధారణ పరిశీలనలను అందించడం. అలాగే జపాన్‌లో ఉన్న తక్కువ ఫ్రీక్వెన్సీ టైమ్ సిగ్నల్ రేడియో స్టేషన్ JJYని కూడా నిర్వహిస్తుంది. ఆగష్టు 2015 చివరలో, సంస్థ అభివృద్ధి చేసిన టెరాహెర్ట్జ్ రేడియేషన్ స్కానర్ ESA జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్ ద్వారా తీసుకువెళ్ళే పరికరాలలో ఒకటిగా ఉంటుందని ప్రకటించబడింది. ఇది 2022లో ప్రారంభించబడుతుంది.[4]
ఇంటర్నెట్ కనెక్టివిటీతో మొట్టమొదటి ఫోన్ నోకియా 9000 కమ్యూనికేటర్ 1996లో ఫిన్లాండ్లో విడుదలైంది. ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఫోన్ ఆలోచన ఈ నమూనా నుండి ధరలు పడిపోయే వరకు జనాదరణ పొందలేదు, ఫోన్లలో ఇంటర్నెట్ను అనుమతించడానికి నెట్వర్క్ ప్రొవైడర్లు సిస్టమ్‌లు, సేవల అభివృద్ధిని ప్రారంభించారు.
అంతర్జాలం అంటే ఏమిటో చిన్న ఉదాహరణతో చెప్పడం తేలిక. మన దేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ఊళ్లని ఎన్నింటినో కలుపుతూ రైలు మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలన్నీ గుర్తించిన దేశపటాన్ని చూస్తే అంతా గజిబిజిగా అల్లిక అల్లిన గుడ్డలా గీతలు కనిపిస్తాయి. దీనిని మనం ఇంగ్లీషులో అయితే “రైల్వే నెట్వర్క్” (railway network) అంటాం. తెలుగులో కావలిస్తే “వలలా అల్లుకుపోయిన రైలు మార్గాలు” అని అనవచ్చు, లేదా టూకీగా “రైలు మార్గాల వలయం” అనో మరీ టూకిగా “రైలు వలయం” అనో అనొచ్చు.
ఇప్పుడు ఒక్క సారి చరిత్రలో వెనక్కి వెళదాం. మనకి స్వతంత్రం రాక పూర్వం దేశంలో ఉన్న రైలు మార్గాలని బ్రిటిష్ ప్రభుత్వం నడిపేది కాదు; ప్రెవేటు రంగంలో కంపెనీలు నడిపేవి. మద్రాస్ సదరన్ మరాటా రైల్వే వారి మార్గం ఒకటి మద్రాసు నుండి వాల్తేరు వరకు వెళ్లేది. ఇలాంటి మార్గాలు ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఎం. ఎస్ .ఎం. రైలు వలయం (MSM rail network) అనేవారు. బెంగాల్ నాగపూర్ రైల్వే వారి మార్గం ఒకటి వాల్తేరు నుండి హౌరా వరకు వెళ్లేది. ఇలాంటి మార్గాలు వారికీ చాలా ఉండేవి. వీటన్నిటిని కలిపి బి. ఎన్. ఆర్. రైలు వలయం (BNR rail network) అనేవారు. ఇలాగే “నైజాం రైలు వలయం,” “మైసూర్ రైలు వలయం” వగైరాలు ఉండేవి. ఇవన్నీ వేర్వేరు రైలు వలయాలు. అయినప్పటికీ ఒకరి రైలు బళ్లు మరొకరి పట్టాల మీద ఇబ్బంది లేకుండా నడిచేవి. ఈ రకం ఏర్పాటుని “అంతర్‌వలయం” అనొచ్చు (అంతర్జాతీయం లా). అనేక దేశాల ఉమ్మడి సంస్థలకి పేర్లు పెట్టవలసి వచ్చినప్పుడు ఇంగ్లీషులో “ఇంటర్” (inter) అనే విశేషణం వాడతాం. అదే విధంగా అనేక వలయాలని ఉమ్మడిగా ఉపయోగించినప్పుడు ఆ ఉమ్మడి వలయాన్ని “ఇంటర్నెట్” అనొచ్చు; లేదా తెలుగులో “అంతర్‌వలయం” అనో “ఉమ్మడి వలయం” అనో పిలవచ్చు. చేపలని పట్టే వలని జాలం అనిన్నీ, పట్టేవాడిని జాలరి అనీ అన్నట్లే, పైన చెప్పిన రైలు మార్గాల అమరికని అంతర్జాలం అనిన్నీ ఈ అంతర్జాలాన్ని వాడే వారిని అంతర్‌జాలరులు అనిన్నీ కూడా అనొచ్చు.
రైలు స్టేషన్ లో “సామానులని నిల్వ చేసే గిడ్డంగి” (గొడౌను) ఉంది. దీనినే గోదాం అని కాని, మండీ అని కాని అంటారు. దాదాపుగా చాలా ఊళ్లన్నిటిలోను ఇలాటి గిడ్డంగులు ఉంటాయి. ఊరు నుండి ఎగుమతి చేసే ఖద్దరు బట్టలు, బెల్లం, చింతపండు, అడ్డాకులు, తమలపాకులు, మామిడి పళ్లు, వగైరాలు ఈ గిడ్డంగిలో ఉన్న గదులలో పేర్చేవారు - బండి వచ్చి బరువులు ఎక్కించుకుని మోసుకుపోయేవరకు. ఇలా ప్రతి ఊళ్లోను ఎగుమతులు, దిగుమతులు చెయ్యవలసిన సరకులని దాచడానికి గిడ్డంగి గదులు ఉంటాయి కదా. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అల్లుకుపోయిన గిడ్డంగులని “విశ్వ వ్యాప్త గిడ్డంగుల అల్లిక” అందాం. దీనినే ఇంగ్లీషులో అంటే “వరల్డ్ వైడ్ వెబ్” (World Wide Web) అవుతుంది. ఇక్కడ “వెబ్” అన్న పదం “స్పైడర్ వెబ్” (spider web) లాంటి ప్రయోగం కనుకనున్నూ, “స్పైడర్ వెబ్”ని తెలుగులో “సాలె గూడు” అని కాని, “సాలె పట్టు” అని కాని అంటాం కనుకన్నూ, “వరల్డ్ వైడ్ వెబ్” (world wide web లేదా WWW) ని “ప్రపంచ పరివ్యాప్తమైన పట్టు” లేదా “పపప” అనొచ్చు.
రైలు పట్టాలు లేకుండా కేవలం గిడ్డంగులు, ఆ గిడ్డంగులలో సామానులు ఉండి మాత్రం ఏమి లాభం? అలాగే రైలు మార్గాలు ఉండి, వాటి మీద రవాణా చెయ్యడానికి సరుకులు లేకపోతే ఏమి ప్రయోజనం? కనుక రైలు మార్గం లాంటి ఇంటర్నెట్టూ, అల్లుకుపోయిన గిడ్డంగులు లాంటి వర్లడ్ వైడ్ వెబ్బూ, రెండూ ఉంటేనే ప్రయోజనం. ఇంటర్నెట్ రవాణాకి కావాలి. వెబ్ సరుకులు దాచుకునేందుకు కావాలి. ఈ ఉపమానం ఇంతటితో సమాప్తం.
ఇప్పుడు రైలు మార్గాలకి బదులు సమాచార ప్రసార మార్గాలు – అంటే టెలిఫోను సౌకర్యాలలాంటివి – చూద్దాం. రైలు మార్గాలలాగే ఈ సమాచార ప్రసార మార్గాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ సమాచార వలయానికి (అంతర్జాలానికి, ఇంటర్నెట్కి) మన కంప్యూటరుని (మన గిడ్డంగిని లేదా మన వెబ్ పేజిని) తగిలించేమనుకొండి. మనం ఇతరులతో పంచుకోవాలనుకున్న వ్యాసాలు, కథలు, ఛాయాచిత్రాలు, పాటలు, వగైరాలని మన కంప్యూటర్లో ఉన్న మన “గిడ్డంగి”లో పెడితే అప్పుడు అవన్నీ ఆ సమాచార వలయంతో లంకించుకున్న వారందరి అందుబాటులోకి వస్తాయి. టూకీగా ఇదీ కథ.
ఇతరులతో పంచుకోదలచిన సమాచారాన్ని కంప్యూటర్లో ఎక్కడ దాచుకుంటామో ఆ స్థలం “మన వెబ్సైట్” లేదా తెలుగులో “మన గిడ్డంగి” అనో “మన ఆటపట్టు” అనో అందాం. ఈ ఆటపట్టులో ఉండేవి చింతపండు, బెల్లం కాదు - సమాచారం. కనుక ఈ “వెబ్ సైట్” (ఆటపట్టు) ని పుస్తకంలో పేజీలలా అమర్చుకుంటే చదివేవారికి సదుపాయంగా ఉంటుంది. అప్పుడు ప్రతి పేజీని “వెబ్ పేజ్” (web page) లేదా “పట్టు పుట” అని కాని “పట్టు పత్రం” అని కాని అనొచ్చు. పుస్తకానికి ముఖపత్రం ఎలాంటిదో అలాగే ఆటపట్టు (“వెబ్ సైట్”) కి ముఖపత్రం (“హోం పేజి”) అలాంటిది. పుస్తకం కొనేవాడు అట్ట మీద బొమ్మ చూసి కొంటాడు. ఇంట్లోకి వచ్చేవాడు వీధి వాకిలి ఎలా ఉందో చూస్తాడు. కనుక ప్రతి వెబ్ సైట్ కి అందంగా ఉన్న ముఖపత్రం ఒక ముఖ్యమైన అంగం.
ఇళ్లకి చిరునామాలు లేదా విలాసాలు ఉన్నట్లే ఈ వెబ్ సైట్లకి (ఆటపట్లకి) కూడా చిరునామాలు ఉంటాయి. చిరునామాలో వ్యక్తి పేరో, సంస్థ పేరో ఉండడమే కాకుండా, ఊరు పేరు దేశం పేరు ఉంటాయి అన్న విషయం మరచిపోకండి. వెబ్ సైట్ల చిరునామాని ఇంగ్లీషులో URL (Universal Resource Locator) అంటారు. ఉదాహరణకి https://web.archive.org/web/20170926174924/http://friendsoftelugu.org/ అనే చిరునామానే తీసుకుందాం. ఇందులో http అనేది ఇది ఏ రకం వెబ్ సైటో చెబుతుంది. అంటే వెబ్ సైట్లలో రకాలు ఉంటాయన్నమాట. తరువాత ://ని[permanent dead link] చూడగానే కంప్యూటర్ (బ్రౌజర్) రాబోయేది "ఒకానొక రకం" వెబ్ సైటు విలాసం అని తెలుసుకుంటుంది. ఈ విలాసంలో “మాటకీ మాటకీ మధ్య” చుక్కలు మాత్రమే ఉండొచ్చు (కామాలు, కోలన్లు, వగైరా విరామ చిహ్నాలు నిషిద్ధం). తరువాత Friendsoftelugu అనేది వెబ్ సైటు పేరు. తరువాత చుక్క, ఆ చుక్క తరువాత “ఆర్గ్” (org) - అంటే ఇది ఏ రకం సంస్థో చెబుతోందన్న మాట. దీనిని ఇంగ్లీషులో “డొమైన్ నేం” (domain name) అంటారు; తెలుగులో “ఇలాకా పేరు” అందాం. ఇలాకా అంటే అధికార పరిధి అని అర్థం.
ఎక్కువ తరచుగా తారసపడే ఇలాకా పేరు (domain name) “డాట్ కాం” (.com) ; దీనిని వ్యాపార సంస్థలకి కేటాయించేరు. విద్యాసంస్థలు వాడే ఇలాకాని “డాట్ ఇడియు” (.edu) అంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకి బయట ఇలాకా పేరు తరువాత ఆయా దేశాల పేర్లు, రెండక్షరాల సంక్షిప్తం రూపంలో, వాడతారు. ఇండియాలో ఉన్న సంస్థల పేర్ల చివర “డాట్ ఇన్” (.in) అని ఉండడం గమనించే ఉంటారు. సాధారణంగా పైన ఉదహరించిన URL చివర /index.html అని మరొక అంశం ఉండొచ్చు. ఒక వెబ్ సైట్ లో ఎన్నో పుటలు పుస్తకరూపంలో అమర్చి ఉన్నాయని అనుకుందాం. అపుడు https://web.archive.org/web/20170926174924/http://friendsoftelugu.org/ అనే విలాసం మాత్రమే వాడితే ఆ పుస్తకంలో ఏ పేజీకి వెళ్లాలి? మనం ఏ పేజీకి వెళ్లాలో నిర్ద్వందంగా చెప్పలేదు కనుక కంప్యూటరు మనని “విషయసూచిక” ఉన్న పేజీకి తీసుకెళుతుంది. ఈ విషయసూచిక ఉన్న పేజీ పేరే index.html.
మన ఇంటికి వచ్చేవారంతా వీధి గుమ్మంలోకి వచ్చి తలుపు తడితే బాగుంటుంది కాని పాలవాడు పెరటి గుమ్మంలోకి వచ్చి పెళ్లాంతో సరసాలాడతానంటే ఏమి బాగుంటుంది? అందుకని పట్టు పుటని index.html పేజిగా నిర్మిస్తే మన వెబ్ సైట్‌కి వచ్చేవారందరికీ ముందుగా ముఖపత్రం కనిపిస్తుంది.
ప్రపంచంలోని ముఖ్యమైన డొమైన్ల జాబితాని ఇక్కడ చూడవచ్చు.
ఇక నుంచి తెలుగులోనూ వెబ్సైట్ డొమైన్ పేరు రాసుకోవచ్చు. విదేశీ డొమైన్లపై లాభాపేక్షలేని సంస్థ 'ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ ఆసియాన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్' (ఐసీఏఎన్ఎన్) భారత్‌కు చెందిన ఏడు భాషలకు ఆమోదం తెలిపింది. ఆంగ్లేతర భాషల్లోనూ డొమైన్ల పేర్లకు ఆహ్వానం పలికిన ఆ సంస్థ తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, ఉర్దూ, గుజరాతీ, పంజాబీ భాషలనూ అనుమతించింది. (ఈనాడు3.11.2009)
డొమెయిన్ నేమ్ (ఇలాకా పేరు) కీ ఇంటర్నెట్ ప్రోటోకోల్ (IP) అడ్రస్ (అంతర్జాల విలాసం) కీ మధ్య తేడా ఉంది. టూకీగా చెప్పాలంటే ఇలాకా పేరు మనుష్యులకి అర్థం అయే రీతిలో ఉండాలనే ఉద్దేశంతో సృష్టించింది. IP అడ్రస్ యంత్రాలకి అర్థం అయే రీతిలో సృష్టించింది. ఐపి అడ్రసుకు ఉదాహరణలు:
ఈ సంఖ్యలు మానవులకి అర్థం అవాలని సృష్టించినవి కావు. కాని ప్రతి కంప్యూటరుకి ఈ రకం సంఖ్యలు కేటాయించబడి ఉంటాయి. ఉదాహరణకి మాత్రమే - పైన్ ఇచ్చిన మొదటి ఐపి అడ్రసుకి ఈ దిగువ ఊహించిన విధంగా అర్థం చెప్పుకోవచ్చు: 192 అనేది ఇండియాకి సంకేతం అనుకుందాం. 168 ఉభయ గోదావరి జిల్లాలకి సంకేతం అనుకుందాం. తరువాత వచ్చే 0 మొగల్తుర్రు ఊరికి సంకేతం అనుకుందాం. చివరన ఉన్న 167 వేమూరి పార్వతీశం గారి ఇంటికి సంకేతం అనుకుందాం. అప్పుడు 192.168.0.167 అనేది బారిష్టరు పార్వతీశం గారి ఇంట్లో కంప్యూటరు అని తెలుస్తుంది. కాని ఈ సంఖ్యలని ఎవరు గుర్తు పెట్టుకోగలరు. అందుకని బారిష్టరు పార్వతీశం తన స్నేహితులకి https://web.archive.org/web/20170926174924/http://friendsoftelugu.org/ అనే చిరునామాని ఇస్తారు. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవలసినది Friendsoftelugu.org అన్న భాగం. ఇది URLకి IP అడ్రెస్ కి ఉన్న అవినాభావ సంబంధం.
ముందు బ్రౌజర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. కంప్యూటర్ యుగానికి ముందే ఈ మాట ఇంగ్లీషు భాషలో వాడుకలో ఉంది. గ్రంథాలయానికి వెళ్లినప్పుడు కాని, పుస్తకాల దుకాణానికి వెళ్లినప్పుడు కాని మనం సాధారణంగా అట్ట మీద బొమ్మ చూసో, పేరు చూసో ఒక పుస్తకాన్ని ఎన్నుకుని విప్పి చూస్తాం. ఒక నిమిషం పోయిన తరువాత ఆ పుస్తకాన్ని తిరిగి బీరువాలో పెట్టెస్తాం. మరొక పుస్తకం తీస్తాం, చూస్తాం, పెట్టెస్తాం. ఈ రకం పనిని “బ్రౌజింగ్” అంటారు. ఈ పని చేసే వ్యక్తిని "బ్రౌజర్" అంటారు. అంటే తెలుగులో “చూడ్డం, పరిశీలించడం, వీక్షించడం,” వగైరా పనులని "వీక్షించడం" అనిన్నీ, ఆ పని చేసే వ్యక్తిని "వీక్షకి" అనిన్నీ అందాం. చీరల కొట్లోకి వెళ్లి మన ఆడవాళ్లు చేసే పనిని కూడా “బ్రౌజింగ్” అనొచ్చు. అంతర్జాలంలో విహరించడానికి ఉపయోగపడే సాధనం కనుక దీనిని తెలుగులో విహరిణి అంటున్నారు.
“వెబ్ బ్రౌజింగ్” అంటే జాల విహారం. అంటే, పైన చెప్పిన పనినే పుస్తకాల దుకాణంలోనో, గ్రంథాలయంలోనో, చీరల కొట్లోనో కాకుండా “పపప” మీద చెయ్యడం. వరల్డ్ వైడ్ వెబ్ (పపప) అంటే ప్రపంచవ్యాప్త పట్టు పుటల సమాహారం అనుకున్నాం కదా. మనం మన ఇంట్లో మన కంప్యూటర్ దగ్గర కూర్చున్నప్పుడు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ పేజీలన్నీటిని ఎలా చూడడం? ఈ పని చెయ్యడానికి ప్రత్యేకంగా రాసిన ఒక క్రమణిక (program) కావాలి. ఈ క్రమణికనే “వెబ్ బ్రౌజర్” అంటారు. వెబ్ బ్రౌజర్ అంటే నిరవాకి (operating system) కాదు, అన్వేషణ యంత్రం (search engine) కాదు. ఈ వెబ్ బ్రౌజర్ అనే క్రమణికకి మనం ఒక "వెబ్ సైటు" చిరునామా ఇస్తే ఆ చిరునామా గల పట్టుపుటలో ఏముందో వెబ్ బ్రౌజర్ తెర మీద చూపిస్తుంది. కనుక దీనిని "పట్టు దర్శని" అనొచ్చు.
మనకి బజారులో రకరకాలైన పట్టు దర్శనులు దొరుకుతున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ వారు ఎక్స్‌ప్లోరర్ (Explorer) కి మద్దత్తు ఇస్తే, ఏపిల్ కంపెనీ వారు సఫారీ (Safari) కి మద్దత్తు ఇస్తున్నారు. గూగుల్ కంపెనీ వారు క్రోం (Chrome) ని వెనకేసుకొస్తున్నారు. ఏ కంపెనీకి చెందని జనతా దర్శని పేరు ఫైర్ఫాక్స్ (Firefox). ఒకరి గణాంకాల ప్రకారం వీటన్నిటిలోను ఎక్కువ జనాదరణ పొందినవి, ఆ క్రమంలో, క్రోం, ఫైర్ఫాక్స్, ఎక్స్‌ప్లోరర్, సఫారీ. తమాషా ఏమిటంటే అన్ని దేశాలలోనూ ఈ జనాదరణ ఒకేలా లేదు. ఇక్కడ చెప్పిన గణాంకాలు బల్ల మీద పెట్టుకుని వాడుకునే కంప్యూటర్ల విషయంలోనే. అరచేతిలో ఇమిడే కంప్యూటర్ల విషయానికి వస్తే సఫారీ ఎక్కువ ఆదరణలో ఉన్నట్లు కనిపిస్తోంది. కనుక గణాంకాలని గభీమని గుడ్డిగా నమ్మడానికి వీలు లేదు.
రహదారులు ఉండబట్టి మనకి రవాణా సౌకర్యాలు లభించినట్లే, ఇంటర్నెటు ఉండటం వల్ల మనకి అనేకమైన సౌకర్యాలు, సేవలు (services) లభిస్తున్నాయి. రహదారురహదారులు వెంబడి టపాలు బట్వాడా చేసినట్లే అంతర్జాలం మీద బట్వాడా అయే టపాలని ఈ-టపా లేక ఈ-మెయిలు అంటారు. ఇక్కడ ఈ అనే అక్షరం ఇంగ్లీషులో Electronic అనే మాటకి సంక్షిప్తం. కావలిస్తే దీనిని తెలుగులో విద్యుత్-టపా లేదా వి-టపా అనొచ్చు.
internet is on smart phone in india from year 2008 so the net usage increses inindia india is one of the hiegest net userfs in the world net is usefull for education and online servies and communicaiton రహదారులు ఉండబట్టే మనం ఇరుగు పొరుగులకి వెళ్ళి బాతాఖానీ కొట్టి రాటానికి వీలయింది. అలాగే ఈ విద్యుత్ రహదారిని ఉపయోగించి, ఇల్లు వదలి బయటకి వెళ్ళకుండా బాతాఖానీ కొట్టొచ్చు. ఈ బాతాఖానీనే ఇంగ్లీషులో చాటింగ్ (Chatting) అంటారు.
రహదారులు ఉండబట్టే ఆ రహదారురహదారులు వెంబడి గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు, పత్రికలు చదవటానికి సానుకూలం అయింది. అదే విధంగా ఈ అంతర్జాలపు రహదారి వెంబడి మనం ప్రపంచం అంతా "తిరిగి" బహిరంగంగా ఉన్న గ్రంథాలయాలే కాకుండా ఇంటింటా ఉన్న సొంత గ్రంథాలయాలని కూడా దర్శించి విషయ సేకరణ చెయ్యవచ్చు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జ్ఞాన సంపదనే 'వరల్డ్ వైడ్ వెబ్' అంటారు.
వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెటులో అత్యధికంగా లభించే సేవ. ఇందులో వెబ్ సైట్సు, బ్లాగులు, మొదలయిన ఎన్నో పేజీలు మనకు అందుబాటులో ఉంటాయి. ఈ సమాచారాన్ని మనం వాడుకనేందుకు వాడే సాఫ్టువేర్ అనువర్తనాన్ని బ్రౌజర్ లేదా విహరిణి అంటారు. అంతెందుకు మీరు ఇప్పుడు చదువుతున్న వికీపిడియా కూడా వరల్డ్ వైడ్ వెబ్ లో భాగమే. వరల్డ్ వైడ్ వెబ్ ను పలకటానికి సులువుగా ఉంటుందని వెబ్ అని పిలుస్తుంటారు.
వెబ్ తరువాత ఇంటర్నెటులో ఈ-మెయిల్ అత్యధికంగా ఉపయోగించబడే సేవ. మన పోస్టలు సేవకు మల్లేనే ఇందులో మనము ఉత్తరాలు వాటికి ప్రత్యుత్తరాలు పంపించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు కాగితం అవసరంలేదు. కేవలం సమాచారం ఉంటే చాలు. చాటింగ్ లేదా ఇన్స్టెంట్ మెసేజింగ్ కూడా ఈ-మెయిల్ వంటిదే, కానీ సమాచారమును మరింత తొందరగా చేరవేస్తుంది, కాకపోతే కొద్ది సమాచారమును మాత్రమే పంపించగలము.
సినిమాలంటే ఇష్టం ఉన్న వారు "మూవీ డేటాబేస్" (IMDB) కి వెళ్లి కావలసిన సమాచారం తెలుసుకోవచ్చు.
Type of site | చిత్రాలు, టెలివిజన్, , వీడియో గేమ్స్ కోసం ఆన్లైన్ డేటాబేస్ |
---|---|
Available in | English |
Owner | Amazon.com |
Created by | Col Needham (CEO) |
URL | imdb.com |
Commercial | Yes |
Registration | సభ్యులు చర్చలు, వ్యాఖ్యలు, రేటింగ్, ఓటింగ్లలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ఐచ్ఛికం. |
రకరకాలసేవలను అందించే ప్రత్యేక వెబ్సైటులను వెబ్ పోర్టల్ అంటారు. పోర్టల్ ని తెలుగులో గవాక్షం అంటున్నారు. ఇవి తెలుగు భాషలో లభ్యమవుతున్నాయి
అయితే కొన్ని దేశాలలో ప్రభుత్వాలు ఇంటర్నెటు ఒక్క చెడ్డ వ్యవస్థ అనే అభిప్రాయం కలిగి ఉన్నాయి. అవి ఇంటర్నెటులోని కొన్ని భాగాలను తమ దేశాలలో ప్రజలు వాడుకోకుండా అడ్డుకుంటున్నాయి. ఉదాహరణకు, చైనాలో ప్రజలు ఎవరు కూడా మీరు చదువుతున్న ఈ వికీపిడియాను చదవలేరు, మార్పులు కూడా చేయలేరు. అంతేకాదు కొంతమంది తల్లితండ్రులు తమ పిల్లలకు ఇంటర్నెటు చాలా కీడు చేస్తుందని భావిస్తుంటారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.