అంజు బాబీ జార్జ్
From Wikipedia, the free encyclopedia
అంజు బాబీ జార్జ్ (Anju Bobby George) (మళయాలం :അഞ്ജു ബോബി ജോര്ജ്ജ്)భారతదేశానికి చెందిన ప్రముఖ అథ్లెటిక్ క్రీడాకారిణి. ఈమె 1977 ఏప్రిల్ 19న జన్మించింది. 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్ పోటీలలో కాంస్య పతకం సాధించి భారత అథ్లెటిక్స్‌లోనే చరిత్ర సృష్టించింది. లాంగ్‌జంప్‌లో 6.70 మీటర్లు దూరం దాటి ప్రపంచ ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్ పోటీలలో పతకం సాధించిన తొలి భారతీయ వ్యక్తిగా రికార్డు స్థాపించింది. 2005లో ఐ.ఎ.ఎ.ఎఫ్. ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలలో రజత పతకం సాధించింది. ఆమె ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భారతదేశంలో అత్యున్నతమైన క్రీడా పురస్కారాలలో ఒకటైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కూడా ఆమెకు బహుకరించారు.
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, జననం ...
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జననం | (1977-04-19) 1977 ఏప్రిల్ 19 (వయసు 47) Changanassery, కేరళ, India | |||||||||||||||||||||||||||||||||||||
క్రీడ | ||||||||||||||||||||||||||||||||||||||
దేశం | భారతదేశం | |||||||||||||||||||||||||||||||||||||
క్రీడ | Athletics | |||||||||||||||||||||||||||||||||||||
పోటీ(లు) | Long jump Triple jump | |||||||||||||||||||||||||||||||||||||
సాధించినవి, పతకాలు | ||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన(లు) | Long jump: 6.83 m NR (Athens 2004) Triple jump: 13.67 (Hyderabad 2002) | |||||||||||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
| ||||||||||||||||||||||||||||||||||||||
Updated on 10 July 2013. |
మూసివేయి