Map Graph

సోలాపూర్

సోలాపూర్ (सोलापूर) మహారాష్ట్రలో ఒక జిల్లా, అదే జిల్లాకు కేంద్రమైన పట్టణం. ఇది కర్ణాటక రాష్ట్రం సరిహద్దులలో ఉంది. ఇక్కడ మరాఠి, కన్నడ, తెలుగు భాషలు మాట్లాడుతారు. దేశం ఉత్తర, దక్షిణ రైలు మార్గంలో ఇది ఒక ముఖ్యమైన స్టేషను. ఇది ప్రత్తి మిల్లులకు, మరమగ్గాలకు పస్రసిద్ధి చెందిన పట్టణం. సోలాపూర్ దుప్పట్లు, ఛద్దర్‌లు దేశమంతటా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ సిద్ధేశ్వర మందిరం ఉంది. అక్కడ మకర సంక్రాంతికి పెద్దయెత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఈ జిల్లాలో అక్కల్ కోటలో అక్కల్‌కోట మహారాజు ఆశ్రమం ఉంది. జనవరిలో ఇక్కడ జరిగే "గడ్డ తిరుణాలకు" చాలామంది యాత్రికులు పొరుగు రాష్ట్రాలనుండి కూడా వస్తారు.

Read article
దస్త్రం:India-locator-map-blank.svg