మొదాసా
భారతదేశం, గుజరాత్ రాష్ట్రం, ఆరావళి జిల్లాలోని ఒక పట్టణంమోదాసా,భారతదేశం,గుజరాత్ రాష్ట్రం,ఆరావళి జిల్లాలోని ఒక పట్టణం.ఇది పురపాలక సంఘం.1466లో మోదాసాలోపాలించిన భిల్ అధిపతిమలాజీ భిల్ పేరుమీద మోదాసా పేరు పెట్టబడింది.మోదాసా సబర్‌కాంత నుండి ఏర్పడిన కొత్త ఆరావళి జిల్లాకు ప్రధానకార్యాలయంగా మారింది.కొత్త జిల్లాప్రకటన 2013 జనవరి 26న వెలువడింది.ఆతరువాత 2013 ఆగస్టున 15న ఏర్పడింది ఇది ప్రాంతీయ,జాతీయ స్థాయిలలో వ్యవసాయ ఎగుమతులకు ఆర్థిక కేంద్రం. చుట్టుపక్కల గ్రామాలకు చిన్నపట్టణాలకు వ్యాపార కేంద్రం.మోడసా నివాసితులు, పర్యాటకులకు రవాణా కేంద్రంగా పనిచేస్తుంది.నగరం రెండు పెద్ద ఆసుపత్రులను కలిగి ఉంది.ఈ నగరంఉత్తర గుజరాత్ ప్రజలకు,దక్షిణ రాజస్థాన్ నుండివలసవచ్చిన కొంతమందికి వైద్యుల కేంద్రంగాసౌకర్యాలు అందిస్తుంది.ఇంజినీరింగ్ కళాశాలలు,కేంద్ర పాఠ్య ప్రణాళిక అమలు పాఠశాలలు, సాంప్రదాయ విద్యా అధ్యాపకులకు అనుబంధంగాఉండటంతో,మోడసా ఈ ప్రాంతానికి విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందింది.నగరంలో ఇప్పుడున్యాయ,విజ్ఞాన, ఆర్ట్స్,కామర్స్,వైద్య కళాశాలలు ఉన్నాయి.అలాగే ఎంబిఎ.,బిబిఎ, బిసిఎ,కోర్సులు చదవటానికితగిన విద్యాసంస్థలు ఉన్నాయి.మెకానికల్,కంప్యూటర్,ఎలక్ట్రానిక్స్,కమ్యూనికేషన్,సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఆటోమోటివ్ ఇంజినీరింగ్ వంటి ప్రభుత్వఇంజినీరింగ్ కళాశాలలు నిర్వహిస్తున్న అధ్యయన కోర్సులుఉన్నాయి.