Map Graph

బక్సర్

బీహార్ రాష్ట్రం లోని పట్టణం

బక్సర్ బీహార్ రాష్ట్రం, బక్సర్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. అలాగే బక్సర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్‌కు ప్రధాన కార్యాలయం. ఇందులో 132 గ్రామాలతో పాటు జనగణన పట్టణం సరింపూర్ కూడా భాగంగా ఉంది. ఈ పట్టణం మినీ కాశీగా ప్రాచుర్యం పొందింది. బక్సర్‌ను మహర్షి విశ్వమిత్ర నగరంగా, రాముడి విద్యా ప్రదేశంగా భావిస్తారు. ఈ పట్టణానికి ప్రాచీన కాలం నుండి గొప్ప మత, సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఆధునిక కాలంలో చారిత్రాత్మక చౌసా యుద్ధం, బక్సర్ యుద్ధం ఈ పట్టణానికి సమీపం లోనే జరిగాయి. బక్సర్ రైల్వే స్టేషన్ హౌరా-ఢిల్లీ ప్రధాన మార్గంలో పాట్నా-మొఘల్‌సరాయ్ విభాగంలో ఉంది. ఇది రాష్ట్ర రాజధాని పాట్నా నుండి సుమారు 125 కి.మీ. దూరంలో ఉంది. బక్సర్ స్థానిక భాష భోజ్‌పురి.

Read article
దస్త్రం:Buxar_Railway_Station.jpgదస్త్రం:Buxar_block_map.pngదస్త్రం:India_Bihar_location_map.svg