గ్వాలియర్
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని నగరంగ్వాలియర్ మధ్యప్రదేశ్‌లో ఒక ప్రధాన నగరం. గ్వాలియర్ జిల్లా ముఖ్యపట్టణం. ఇది ఢిల్లీకి దక్షిణంగా 343 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఆగ్రా నుండి 120 కి.మీ., రాష్ట్ర రాజధాని భోపాల్ నుండి 414 కి.మీ. దూరంలో ఉంది. ఢిల్లీ నగరంపై వలస వచ్చేవారి వత్తిడిని తగ్గించేందుకు ఉద్దేశించిన కౌంటర్-మాగ్నెట్ నగరాల్లో ఇది ఒకటి. గ్వాలియర్ భారతదేశంలోని గిర్డ్ ప్రాంతంలో ఒక వ్యూహాత్మక స్థానంలో ఉంది.. ఈ చారిత్రిక నగరాన్ని, దాని కోటనూ అనేక ఉత్తర భారత రాజ్యాలు పాలించాయి. 10 వ శతాబ్దంలో కచ్ఛపగతులు, 13 వ శతాబ్దంలో తోమర్‌లు, ఆ తరువాత మొఘలులు, 1754 లో మరాఠాలు, తరువాత 18 వ శతాబ్దంలో సింధియాలూ పాలించారు. 2016 లో పట్టణ కాలుష్యంపై జరిపిన అధ్యయనంలో ఈ నగరం భారతదేశంలో అత్యధిక స్థాయిలో వాయు కాలుష్యం ఉన్న నగరమని, ప్రపంచంలో రెండవ స్థానంలో ఉందనీ తేలింది.
Read article
Nearby Places
మధ్య భారత్