Map Graph

గుమ్మడిదల మండలం

తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలం

గుమ్మడిదల మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం. ఇది పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన మండలం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని కొత్తగా ఏర్పరచారు. దానికి ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం సంగారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. గుమ్మడిదల, ఈ మండలానికి కేంద్రం.

Read article
దస్త్రం:Telangana-mandal-Sangareddy_Gummadidala-2022.svg