Remove ads
From Wikipedia, the free encyclopedia
చర్మ సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధి సోరియాసిస్ (ఆంగ్లం: Psoriasis). దీర్గకాలికమైన రోగనిరోధక శక్తిలో మార్పులు వలన ఇది సంభవిస్తుంది. ఈ వ్యాధిలో నొప్పి, చర్మము మందము అవడం, వాపు, దురద, చేపపొట్టులాంటి పొలుసులు ఊడడం జరుగుతుంటుంది. ఈ వ్యాధి ముఖ్యముగా ముంజేతి వెనకభాగము, మోకాలు ముందుభాగము, తల, వీపు, ముఖము, చేతులు, పాదాలలో వస్తుంది. సరియైన చికిత్స లేనట్లైతే ఈ వ్యాధి జీవితాంతముంటుంది. కొన్ని వాతావరణ పరిస్తితులలో వ్యాధి పెరగడము, తగ్గడమూ సర్వసాధారణము.దీర్ఘకాలం బాధించే మొండి చర్మ వ్యాధుల్లో సొరియాసిస్ ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల మంది సొరియాసిస్‌తో బాధపడుతున్నారని అంచనా. అంటే ప్రపంచ జనాభాలో మూడు శాతం మంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. సొరియాసిస్ బాధితులు శారీరకంగా ఇబ్బందిపడుతూ, మానసికంగా నలిగిపోతూ వుంటారు. అందుకే దీనిని మొండి వ్యాధిగా పరిగణిస్తారు.
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
సొరియాసిస్ అంటే దీర్ఘకాలం కొనసాగే చర్మవ్యాధి. ఈ వ్యాధి సోకిన వారిలో చర్మంపైన దురదతో కూడిన వెండిరంగు పొలుసులు కనిపిస్తాయి. ఈ పొడలు ఎరుపుదనాన్ని, వాపుని కలిగి ఉండవచ్చు. చర్మం మాత్రమే కాకుండా గోళ్లు, తల వంటి ఇతర శరీర భాగాలు కూడా ఈ వ్యాధి ప్రభావానికి లోనుకావచ్చు. చర్మంపై పొలుసులుగా వచ్చినప్పుడు గోకితే కొవ్వత్తి తాలికలను పోలిన పొట్టు రాలుతుంది. పొలుసులు తొలగిస్తే అడుగున రక్తపు చారికలు కనిపిస్తాయి. నిజానికి సొరియాసిస్ ప్రధాన లక్షణం దురద కాదు. అయితే వాతావరణం చల్లగా ఉంది, తేమ తగ్గిపోయినప్పుడుగానీ, ఇన్ఫెక్షన్ల వంటివి తోడైనప్పుడుకానీ దురద ఎక్కువ అవుతుంది. బాధితుల్లో 10-30శాతం మందికి అనుబంధ లక్షణంగా తీవ్రమైన కీళ్లనొప్పులు కూడా సంభవిస్తాయి. సొరియాసిస్ సాధారణంగా కుడి, ఎడమల సమానతను ప్రదర్శిస్తుంది. సొరియాసిస్ ఎక్కువకాలం బాధిస్తుంటే అది సొరియాటిక్ ఆర్థరైటిస్‌గా మారుతుంది. కారణాలు: సొరియాసిస్ వ్యాధి ఏర్పడటానికి మానసిక ఒత్తిడినుంచి ఇన్ఫెక్షన్ల వరకు ఎన్నో కారణాలు ఉంటాయి. వంశపారంపర్యంగా కూడా సొరియాసిస్ రావచ్చు. జీర్ణవ్యవస్థలో లోపాలవల్ల కూడా సొరియాసిస్ రావచ్చని తాజా ప7రిశోధనలు వెల్లడిస్తున్నాయి.
సాధారణంగా బ్యాక్టీరియా, వైరస్ల మూలంగా వచ్చే ఇన్ఫెక్షన్లు, జబ్బుల నుంచి రోగనిరోధకశక్తి మనల్ని కాపాడుతుంటుంది. అయితే సోరియాసిస్ బాధితుల్లో రోగనిరోధక వ్యవస్థలో భాగమైన టీ కణాలు పొరపాటున ఆరోగ్యంగా ఉన్న చర్మ కణాలపైనే దాడి చేస్తాయి. దీంతో శరీరం ఇతర రోగనిరోధక స్పందనలను పుట్టిస్తుంది. ఫలితంగా వాపు, చర్మకణాలు వేగంగా ఉత్పత్తి కావటం వంటి వాటికి దారితీస్తుంది. సోరియాసిస్ బాధితుల్లో కొంతకాలం పాటు దాని లక్షణాలు కనబడకుండా ఉండిపోవచ్చు. కొన్నిసార్లు ఉన్నట్టుండి ఉద్ధృతం కావొచ్చు. ఇలా పరిస్థితి తీవ్రం కావటానికి కొన్ని అంశాలు దోహదం చేస్తాయి.
ముప్పు కారకాలు సోరియాసిస్ దీర్ఘకాల సమస్య. కొందరిలో జీవితాంతమూ వేధిస్తుంటుంది కూడా. ఇది ఎవరికైనా రావొచ్చు. 10-45 ఏళ్ల వారిలో తరచుగా కనబడుతుంది. సోరియాసిస్ ముప్పును పెంచే కారకాలు ఇవీ..
ప్లేక్ సొరియాసిస్: ఈ రకమైన సొరియాసిస్‌తో బాధపడే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. సొరియాసిస్ రోగులలో 10-15 శాతం మంది ఈ రకమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధిగ్రస్తులలో చర్మం ఎర్రగా మారుతుంటుంది. ఆ ప్రాంతంలో తెల్లని పెళుసులు కడుతుంది. దురదను లేదా మంటను కలిగిస్తాయి. ఈ మచ్చలు ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, పొట్టపై భాగం, మాడుపై, చర్మం మీద ఏర్పడతాయి. ఇన్వటరేట్ సొరియాసిస్: ఇది ఎక్కువగా లోపలి శరీరభాగాల్లో ఏర్పడుతుంది. అంటే చంకలు, రొమ్ములు, వృషణాల వద్ద ఈ మచ్చలు ఏర్పడతాయి. ఈ రకమైన సొరియాసిస్‌కి చికిత్స కూడా చాలా కష్టంగానే ఉంటుంది.
సెబోరిక్ సొరియాసిస్: మాడుపైన, చెవుల వెనక, భుజాలపైన, చంకలు, ముఖంపైన ఎర్రని మచ్చలు ఏర్పడతాయి. నెయిల్ సొరియాసిస్: చేతివేళ్లు, కాలివేళ్ల గోళ్లపైన తెల్లని మచ్చలు, గుంటల రూపంలో ఏర్పడతాయి. కొన్నిసార్లు మచ్చలు పసుపు రంగులో వుంటాయి. గోళ్ల కింద చర్మం నుంచి గోరు వేరు పడిపోయి అక్కడ మృతచర్మం ఏర్పడుతుంది. సొరియాసిస్‌తో బాధపడే రోగులలో దాదాపు సగం మందికి గోళ్లలో అసాధరణ మార్పులు కనిపిస్తాయి.
పస్ట్యులర్ సొరియాసిస్: చర్మంపైన ఏర్పడే మచ్చలలో చీములాంటి ద్రవం ఏర్పడుతుంది. సాధారణంగా ఇవి చేతులు, కాళ్లపైన ఏర్పడతాయి. చీముతో కూడిన ఈ మచ్చలు అరచేతులు, అరిపాదాలలో ఏర్పడినప్పుడు పామార్, ప్లాంటార్ ఫస్టులోసిస్గా వ్యవహరిస్తారు.
సోరియాసిన్ వ్యాధి ఉధ్రుతమైనది, దీర్ఘకాలికమైనది. కావున ఒక రోగికి , మరో రోగికి వ్యాధి తీవ్రతలో తేడా ఉంటుంది. జబ్బు తీవ్రతను బట్టి చికిత్స చేయవలసిన అవరముంటుంది. తగినంత శరీరకశ్రమ , విశ్రాంతి, సమతుల్య ఆహారము, మంచి అలవాట్లు, మెడిటేషన్, చర్మరక్షణకు సంబంధించిన జాగ్రత్తలూ, ఇతర ఇన్ఫెక్షన్ రాకుండా సుచి-శుబ్రత పాటించడం, పొడి చర్మానికి తేమకోసం ఆయిల్ పూయడం మంచిది.
పరీక్షలు-నిర్ధరణ చి సోరియాసిస్‌ను చాలావరకు లక్షణాలను బట్టే గుర్తిస్తారు. చర్మం, మాడు, గోళ్ల వంటి వాటిని పరీక్షించి సమస్యను నిర్ధరిస్తారు. అరుదుగా కొందరిలో చర్మం ముక్కను తీసి మైక్రోస్కోప్ ద్వారా పరీక్షిస్తారు. ఇందులో సోరియాసిస్ ఏ రకానికి చెందిందో గుర్తిస్తారు.
చికిత్స మూడు రకాలు సోరియాసిస్ కేసుల్లో చాలావరకు పైపూత మందులను వాడుకుంటే సరిపోతుంది. తీవ్రతను బట్టి మాత్రలు, ఇంజెక్షన్లు.. అలాగే అతినీలలోహిత కిరణాలతోనూ చికిత్స చేస్తారు.
సొరియాసిస్ వ్యాధి కేవలం ఒకే సమస్య ఆధారంగా ఏర్పడదు. కాబట్టి వివిధ సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి శరీరంలోని జన్యువుల స్థాయిలో వ్యాధిని అరికట్టేందుకు చికిత్స అందజేయవలసి ఉంటుంది. కణాల ఉత్పత్తి వేగాన్ని నియంత్రించడం, మృతకణాల స్థానంలో కొత్త కణాల పునరుజ్జీవానికి చర్యలు తీసుకోవటం, అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించటం వంటి చర్యలకు హోమియో వైద్యంతో సమర్ధంగా నిర్వర్తించడం సాధ్యమవుతుంది. గ్రాఫైటిస్, లైకోపోడియా, నెట్రమ్మూర్, సల్ఫర్, సెపియా, స్టాఫ్సాగ్రియా, ఫాస్పరస్, ఒలైటాకార్బ్, పల్సటిల్లా వంటి హోమియో మందులు సొరియాసిస్‌ను నిర్మూలించడంలో సత్ఫలితాలు ఇస్తాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.