From Wikipedia, the free encyclopedia
మధురం లేదా తీయదనం అనగా తీపి రుచి. ఇది ఆరు ప్రాథమిక రుచులైన షడ్రుచులలో ఒకటి.
మనం భుజించే ఆహారపదార్ధాలలో ముఖ్యంగా పిండిపదార్ధాలు తియ్యగా ఉంటాయి. మన శరీరంలో ఎక్కువగా ఉండేది ఈ రసమే. ఇది శరీర నిర్మాణానికి, శక్తి, ప్రుగుదలకి ఉపయోగపడుతుంది. శరీరానికి, మనసుకి చక్కటి సమన్వయాన్ని ఇది కలుగ జేస్తుంది. ఇది ఒక సంతృప్తినిచ్చే రసం. మన శరీరంలోని ద్రవాల్ని ముఖ్యంగా ప్రత్యుత్పత్తి చేసే రసాలను ఇది తయరు చేస్తుంది. శరీరానికి చల్లదనాన్నిస్తుంది. ఈ రసం సాధారణంగా ఆహార పదార్థాలన్నిటిలోనూ ముఖ్యంగా ఉంటుంది. దీని నిర్మాణానికి వస్తే ఇది ముఖ్యంగా భూమి, నీరు అనే మూలకాలతో నిర్మితమై ఉంటుంది. ఇది తీసుకున్నపుడు మన శరీరంలోని వాతం తగ్గుతుంది. కఫం పెరుగుతుంది.పిత్తం కూడా తగ్గుతుంది. దీనిని ఎక్కువగా తీసుకున్నప్పుడు అధిక బరువు, శరీరంలో విషపదార్థాల యొక్క పెరుగుదల, క్రిములు పెరగడం, షుగర్ వ్యాధి, గ్యాస్ పెరగడం, అజీర్ణం ఒక్కోసారి బద్దకం కూడా పెరిగే అవకాశం ఉంది.
పేరు | పదార్థం | తీయదనం |
---|---|---|
లాక్టోజ్ | డై శాకరైడ్లు | 0.16 |
మాల్టోజ్ | డై శాకరైడ్లు | 0.33 – 0.45 |
గ్లూకోజ్ | మోనో శాకరైడ్లు | 0.74 – 0.8 |
సుక్రోజ్ | డై శాకరైడ్లు | 1.00 (reference) |
ఫ్రక్టోజ్ | మోనో శాకరైడ్లు | 1.17 – 1.75 |
సోడియం సైక్లమేట్ | సల్ఫొనేట్ | 26 |
స్టెవియోల్ గ్లైకోసైడ్ | గ్లైకోసైడ్ | 40 – 300 |
ఆస్పర్టేమ్ | డైపెప్టైడ్ మిథైల్ ఎస్టర్ | 180 – 250 |
సోడియం సాకరిన్ | సల్ఫోనైన్ సమ్మేళనం. | 300 – 675 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.