From Wikipedia, the free encyclopedia
సంవత్సరము అనేది ఒక కాలమానము. భూమి సూర్యుని చుట్టూ తిరిగే భ్రమణ క్రమంలో ఒక స్థానానికి భూమి తిరిగి రావడానికి పట్టే కాలాన్ని (సమయాన్ని) సంవత్సరం అంటారు. ఇదే నిర్వచనాన్ని ఇతర గ్రహాలకూ విస్తరించవచ్చును. ఉదాహరణకు సూర్యుని చుట్టూ అంగారక గ్రహం ఒకమారు తిరగడానికి పట్టే కాలాన్ని "అంగారక సంవత్సరం" అనవచ్చును. ఒక సంవత్సరంలో 365 రోజులు (12 నెలలుగా విభజించబడి) ఉన్నాయి. తెలుగు కేలండర్ ప్రకారం అరవై సంవత్సరాలు ఉన్నాయి. ఇవి చక్రంలాగా మారుతూ ఉంటాయి.
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కేలెండర్లో రెండు ఒకే తేదీల మధ్య కాలాన్ని "కేలెండర్ సంవత్సరం" అంటారు. గ్రిగేరియన్ కేలెండర్ ప్రకారం vernal equinox మార్చి 21న గాని, అంతకు కొంచెం ముందుగాని వస్తుంది. కనుక గ్రిగేరియన్ కేలెండర్ "tropical year" లేదా "vernal equinox year"ను అనుసరిస్తాయి. ఒక కేలెండర్ సంవత్సరం సగటు పరిమాణం 365.2425 "సగటు సౌర దినాలు" (mean solar days). అంటే ప్రతి 400 సంవత్సరాలకు 97 సంవత్సరాలు లీప్ సంవత్సరాలు అవుతాయి. vernal equinox year సంవత్సరం పరిమాణం 365.2424 రోజులు.
ప్రస్తుతం ఉన్న సౌర కాలమానాలలో పర్షియన్ కేలెండర్ చాలా కచ్చితమైనవాటిలో ఒకటి. అంకెల లెక్కలో కాకుండా ఈ విధానంలో క్రొత్త సంవత్సరం టెహరాన్ నగరంలో టైమ్ జోన్ ప్రకారం vernal equinox సంభవించిన రోజున మొదలవుతుందని విపులమైన ఖగోళశాస్త్రపు లెక్కలద్వారా నిరూపించారు.ఖగోళ కొలమాన సంవత్సరం (సౌరమానం గాని, చాంద్రమానం గాని) దేనిలోనైనా సరైన పూర్ణసంఖ్యలో రోజులు గాని నెలలు గాని ఉండవు. కనుక లీప్ సంవత్సరం విధానం వంటివాటితోలో ఈ కొలతను సరిచేస్తుంటారు. (system of intercalation such as leap years). జూలియన్ కేలెండర్ ప్రకారం సగటు సంవత్సరం పొడవు 365.25 రోజులు. లీప్ సంవత్సరంలో 366 రోజుఉ, మిగిలిన సంవత్సరాలలో 365 రోజులు ఉంటాయి.
ఒక సగటు గ్రెగోరియన్ సంవత్సరం = 365.2425 రోజులు = 52.1775 వారములు, 8,765.82 గంటలు = 525,949.2 నిమిషములు = 31,556,952 సెకండులు . ఇది సగటు సౌరమాన సంవత్సరం - mean solar year - (SI సంవత్సరం కాదు).
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.