దిస్పూర్
అస్సాం రాష్ట్ర రాజధాని, గౌహతిలోని ఒక శివారు ప్రాంతం. From Wikipedia, the free encyclopedia
అస్సాం రాష్ట్ర రాజధాని, గౌహతిలోని ఒక శివారు ప్రాంతం. From Wikipedia, the free encyclopedia
దిస్పూర్, అస్సాం రాష్ట్ర రాజధాని, గౌహతిలోని ఒక శివారు ప్రాంతం. 1973లో దిస్పూర్ ను రాజధానిగా చేశారు. దీని పూర్వపు రాజధాని షిల్లాంగ్ అస్సాం నుండి వేరు చేయబడిన మేఘాలయ రాష్ట్రానికి రాజధానిగా మారింది. డిస్పూర్ అస్సాం ప్రభుత్వ పరిపాలన స్థానం. అస్సాం సెక్రటేరియట్ (జనతా భవన్) భవనం, అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ హౌస్, ఎమ్మెల్యే భవనం, స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్‌తోపాటు ఈ నగరంలోనే ఉన్నాయి. అస్సాం ట్రంక్ రోడ్డు, జిఎస్ రోడ్డు ఈ నగరం గుండా వెళుతుంది. దిస్పూర్కు దక్షిణంగా 1990లలో సృష్టించబడిన ఒక సాంస్కృతిక కేంద్రమైన బసిష్ట ఆశ్రమం,శంకర్‌దేవ్ కళాక్షేత్రం వేదాంతపరంగా ముఖ్యమైన ప్రదేశం ఉంది.
దిస్పూర్ | |
---|---|
నివాస ప్రాంతం | |
Coordinates: 26°8′23″N 91°47′33″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
ప్రాంతం | పశ్చిమ అస్సాం |
జిల్లా | కామరూప్ మెట్రో |
Government | |
• Type | మేయర్-కౌన్సిల్ |
• Body | గౌహతి నగరపాలక సంస్థ |
• గవర్నర్/ఛాన్సలర్ | జగదీష్ ముఖి |
Elevation | 55–290 మీ (180−955 అ.) |
జనాభా (2011) | |
• Total | 9,57,352[1] |
భాష | |
• అధికారిక | అస్సామీ[2] |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 781005 |
టెలిఫోన్ కోడ్ | 91 - (0) 361 - XX XX XXX |
ISO 3166 code | IN-AS |
Vehicle registration | AS - 01 |
కొప్పెన్ వాతావరణ వర్గీకరణ | తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం |
పట్టణం నడిబొడ్డున భోరోలు నది (భోల్లోబ్రి) ప్రవహిస్తుంది.
గౌహతిలో భాగమైన ఈ దిస్పూర్ నటరం వేసవి, శీతాకాలాలను కలిగి ఉంటుంది. దిస్పూర్లో వర్షాకాలం జూన్ నెల నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడ రుతుపవనాలు సాధారణంగా తీవ్రమైన ఉరుములతో పాటు భారీ వర్షాలతో కూడి ఉంటాయి.
దిస్పూర్ పట్టణం గౌహతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.[3] బిజెపికి చెందిన అతుల్ బోరా దిస్పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
దిస్పూర్ నగరంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి -
గౌహతి న్యూరోలాజికల్ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్స్, డిస్పూర్ హాస్పిటల్, క్యాపిటల్ స్టేట్ డిస్పెన్సరీ వంటి అనేక ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల ఇక్కడ ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.