From Wikipedia, the free encyclopedia
కేప్ వర్దె లేదా కేబో వెర్డే అధికారికంగా కాబో వెర్డే రిపబ్లిక్[1] కేంద్ర అట్లాంటిక్ మహాసముద్రంలో 10 అగ్నిపర్వత ద్వీపసమూహం విస్తరించి ఉన్న ఒక ద్వీప దేశం. ఇందులో అజోరెస్, కానరీ ఐలాండ్స్, మదీరా, సావేజ్ దీవులతో పాటు మాకారోనెసియా పర్యావరణ ప్రాంతంలో భాగంగా ఉన్నాయి. పురాతన కాలంలో ఈ ద్వీపాలు "బ్లెస్డ్ దీవులు" లేదా "అదృష్టకరమైన ద్వీపాలు"గా సూచించబడ్డాయి. పశ్చిమ ఆఫ్రికాలోని కేప్ వెర్డే ద్వీపకల్పం 570 కిలోమీటర్ల (350 మైళ్ళు) పశ్చిమాన ఉన్న ఈ ద్వీపసమూహాలు మొత్తం 4,000 చదరపు కిలో మీటర్లు (1,500 చదరపు మైళ్ళు) వైశాల్యంలో విస్తరించి ఉంటాయి.4,000 చదరపు కిలోమీటర్లు (1,500 చ. మై.).
República de Cabo Verde Republic of Cape Verde |
||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం Cântico da Liberdade |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | Praia 14°55′N 23°31′W | |||||
అధికార భాషలు | Portuguese | |||||
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు | Cape Verdean Creole | |||||
ప్రభుత్వం | Republic | |||||
- | President | Pedro Pires | ||||
- | Prime Minister | José Maria Neves | ||||
Independence | from Portugal | |||||
- | Recognized | July 5 1975 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 4,033 కి.మీ² (172nd) 1,557 చ.మై |
||||
- | జలాలు (%) | negligible | ||||
జనాభా | ||||||
- | July 2006 అంచనా | 420,979 (165th) | ||||
- | 2005 జన గణన | 507,000 | ||||
- | జన సాంద్రత | 126 /కి.మీ² (79th) 326 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2005 అంచనా | |||||
- | మొత్తం | $3.055 billion (158th) | ||||
- | తలసరి | $6,418 (92nd) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | 0.722 (medium) (106th) | |||||
కరెన్సీ | Cape Verdean escudo (CVE ) |
|||||
కాలాంశం | CVT (UTC-1) | |||||
- | వేసవి (DST) | not observed (UTC-1) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .cv | |||||
కాలింగ్ కోడ్ | +238 |
15 వ శతాబ్దం వరకు కేప్ వెర్డే ద్వీపసమూహం జనావాసరహితంగా ఉండేవి. పోర్చుగీసు అన్వేషకులు ఈ ద్వీపాలను గుర్తించి వచ్చి ఉష్ణమండలంలో మొట్టమొదటి ఐరోపా స్థావరాన్ని ఏర్పాటు చేశారు. అట్లాంటిక్ బానిస వాణిజ్యానికి కేంద్రంగా ఉన్న ఈ ద్వీపాలు 16 వ, 17 వ శతాబ్దాల్లో వ్యాపారులను, సముద్రపు బందిపోట్లను ఆకర్షిస్తూ సంపన్నంగా అభివృద్ధి చెందాయి. 19 వ శతాబ్దంలో బానిసత్వం ముగింపు ఆర్థిక తిరోగమనం, వలసలకు దారితీసింది. కేప్ వర్దే క్రమంగా తిరిగి ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా, నౌకామార్గాల్లో విశ్రాంతికేంద్రంగా మారింది.. 1951 లో పోర్చుగలు విదేశీ భూభాగంగా చేర్చబడింది. తరువాత ద్వీపవాసులు స్వాతంత్ర్యం పోరాటం కొనసాగించారు. 1975లో శాంతియుతంగా స్వాతంత్ర్యం సాధించబడింది.
1990 ల ప్రారంభం నుండి, కేప్ వెర్డే ఒక స్థిరమైన ప్రతినిధి ప్రజాస్వామ్యం, ఆఫ్రికాలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా మిగిలిపోయింది. సహజ వనరులు తగినంత లేని కారణంగా ఆర్థికాభివృద్ధికి సేవారంగం అధికంగా ప్రాధాన్యత వహిస్తుంది. పర్యాటక రంగం, విదేశీ పెట్టుబడుల మీద దృష్టిసారిస్తుంది. దాదాపు 5,40,000 జనాభాలో మిశ్రమ యూరోపియన్లు, మొరీషియన్లు, అరబ్బులు, ఆఫ్రికను వారసత్వం కలిగిన ప్రజలు అధికంగా ఉన్నారు. పోర్చుగీసు పాలన వారసత్వంగా సంఖ్యాపరంగా రోమను క్యాథలిక్కుల ఆధిక్యత కనిపిస్తుంది. ఈ ద్వీపాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ ఉపాధిదారులు అధికంగా కనిపిస్తున్నారు.
చారిత్రాత్మకంగా "కేప్ వర్దె" అనే పేరు ఆంగ్ల భాషలో ద్వీపసమూహం అనే పదానికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. 1975 లో స్వతంత్రం పొందిన తరువాత దేశానికి ఈ పేరు నిర్ణయించబడింది.
సెనెగలిస్ తీరంలో ఉన్న కాప్ - వర్టు అనేరు కేప్ వర్దే పేరుకు మూలంగా ఉందని భావిస్తున్నారు.[2] 1444 లో పోర్చుగీసు అన్వేషకులు ఈ ద్వీపాలను కనుగొన్న కొద్ది సంవత్సరాల ముందు ఈ దీవులను కాబో వెర్డే అని పేర్కొన్నారు (పోర్చుగీసు భాషలో వెర్డి అంటే "ఆకుపచ్చ" అని అర్ధం).
2013 అక్టోబరు 24 న దేశ ప్రతినిధి బృందం ఐక్యరాజ్యసమితిలో అధికారిక పేరును ఇతర భాషలలోకి అనువదించకూడదని ప్రకటించింది. "కేప్ వెర్డే"కు బదులుగా, "రిపబ్లిక్ ఆఫ్ కాబో వర్డ్" అనే పేరును ఉపయోగించారు.[1][3]
ఐరోపావాసులు రాకముందు కేప్ వర్దే ద్వీపాలలో జనావాసాలు లేవు.[4] పోర్చుగీసు అధికారిక రికార్డుల ఆధారంగా 1456 లో పోర్చుగీసు నావికుడు జెనోసెస్ ఈ ద్వీపసమూహాలను కనిపెట్టాడని భావిస్తున్నారు.[5] జెనోవా జన్మించిన ఆంటోనియో డి నోలిని పోర్చుగీసు రాజు కేప్ వెర్డే గవర్నర్‌గా నియమించాడు. అపోన్సో వి. కేప్ వర్దే ద్వీపసమూహంలోని ఇతర ద్వీపాలను కనుగొనిన ఇతర నావికులలో డియాగో గోమ్సు (ఆంటోనియోతో ఇక్కడకు వచ్చి డి నోలికి చెందిన శాంటియాగో ద్వీపానికి పేరు పెట్టారు.), డియాగో డయాస్, డియోగో అపోన్సో, ఇటాలియన్ ( వెనిస్ జన్మించారు) ఆల్విసు కాడమోస్టో.
1462 లో పోర్చుగీసు వాసులు శాంటియాగో ద్వీపంలో మొదటి స్థావరం స్థాపించారు. వారు రిబీరా గ్రాండే (ప్రస్తుతం సిడెడే వేల ("ఓల్డ్ సిటీ") అని పేరుతో ఒక స్థావరాన్ని స్థాపించారు. రిపిరా గ్రాండే ఉష్ణమండలంలో మొట్టమొదటి శాశ్వత యూరోపియన్ స్థావరంగా గుర్తించబడుతుంది.[6]
16 వ శతాబ్దంలో ద్వీపసమూహం అట్లాంటిక్ బానిస వాణిజ్యం ద్వారా సుసంపన్నం అయింది.[6] పోర్చుగీసు స్థావరాల మీద సముద్రపు బందిపోటు దొంగలు అప్పుడప్పుడూ దాడి చేశాయి. 1585 లో ఇంగ్లీషు పైరేట్ ఫ్రాన్సిస్ డ్రేక్ ఐబిరియన్ యూనియన్‌లో భాగంగా ఉన్న అప్పటి రాజధాని రిబీరా గ్రాండే మీద రెండుసార్లు దాడి చేసారు.[6] 1770 లో రాజధాని అయిన ఈ పట్టణం 1712 లో ఫ్రెంచి దాడి తరువాత ప్రాముఖ్యతను కోల్పోయింది. సమీపాన ఉన్న ప్రయ్యానికి ప్రాముఖ్యత అధికరించింది.[6] 19 వ శతాబ్దంలో బానిస వాణిజ్యం తగ్గిపోవడంతో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. కేప్ వెర్డే ప్రారంభ సంపద నెమ్మదిగా అదృశ్యమయ్యింది. అయినప్పటికీ అట్లాంటిక్ నౌకాశ్రయాల మధ్యలో ఉన్న ద్వీపాల భౌగోళీక ప్రాముఖ్యత కారణంగా కేప్ వెర్డే పునః సరఫరా చేసే కేంద్రంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అద్భుతమైన నౌకాశ్రయం కారణంగా సావో విసెంటే ద్వీపంలో ఉన్న మిండేలో నగరం 19 వ శతాబ్దంలో ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా మారింది.[6] 1832 లో దౌత్యవేత్త ఎడ్మండ్ రాబర్ట్స్ కేప్ వెర్డేను సందర్శించారు.[7]
స్వల్పంగా ఉన్న సహజవనరులు, పోర్చుగీసు నుండి వస్తున్న చాలీచాలని పెట్టుబడుల కారణంగా పౌరులకు ప్రాంతీయ అధికారులకు స్వయం ప్రతిపత్తి కలిగించని కాలనియల్ మాస్టర్లపట్ల అసంతృప్తి అధికరించింది. 1951 లో పోర్చుగీసు కేప్ వర్డేను కాలనీ స్థాయి నుండి ఓవర్సీసు ప్రాంతంగా మార్చడం పౌరుల జాతీయతాభిలాషను మరింత అధికరించింది. 1956 లో అమిల్కార్ కాబ్రల్, కేప్ వర్డే అనుయాయులు, గినీస్ (పోర్చుగీసు గినియాలోని ప్రజలు) కలిసి ఒకటిగా " క్లాండెస్టైన్ " పేరుతో గినియా, కేప్ వర్డేల స్వతంత్రం కొరకు పోరాడే ఆఫ్రికన్ పార్టీని స్థాపించారు.[6] ఇది కేప్ వెర్డే, పోర్చుగీసు గినియాలో ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు మెరుగుపడాలని నిర్భంధం చేసి రెండు దేశాల స్వాతంత్ర్య ఉద్యమానికి పునాది వేసింది. 1960 లో గినియా లోని కానరీ నగరంలో పార్టీ ప్రధాన కార్యాలయం తరలించడింది. ఇది 1961 లో పోర్చుగలుకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు ప్రారంభించింది. విద్రోహ చర్యలు చివరికి పోర్చుగీసు గినియాలో 10,000 సైనికులను సమకూర్చుకొని 35,000 పోర్చుగీసు, ఆఫ్రికను సైనికులకు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధం చేసింది. [6]
1972 నాటికి పోర్చుగీసు దళాల ఉనికి ఉన్నప్పటికీ పి.ఎ.ఐ.గి.సి. పోర్చుగీసు గినియాలో అధిక భాగాన్ని నియంత్రించింది. కానీ ఈ సంస్థ కేప్ వర్దెలో పోర్చుగీసు నియంత్రణను ఆటంకం చేయటానికి ప్రయత్నించలేదు. 1973 లో పోర్చుగీసు గినియా స్వాతంత్ర్యం ప్రకటించింది. 1974 లో డీ జ్యూ స్వాతంత్ర్యాన్ని మంజూరు చేసింది. 1973 లో అమిల్కర్ కాబ్రాల్ హత్య చేయబడిన తరువాత ఆయన హాఫ్ బ్రదరు లూయిస్ కాబ్రల్ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించాడు. 1975 లో ద్వీపసమూహాలకు స్వతంత్రం లభించింది.
ఏప్రిల్ 1974 ఏప్రెలులో పోర్చుగల్‌లో జరిగిన విప్లవం తరువాత పి.ఎ.ఐ.గి.సి. కేప్ వెర్డేలో చురుకైన రాజకీయ ఉద్యమంగా మారింది. 1974 డిసెంబరులో పోర్చుగీసు, కేప్ వెర్డియన్ల మధ్యంతర ప్రభుత్వానికి ఏర్పాటు ఒప్పందం మీద సంతకం చేసాయి. 1975 జూను 30 న కేప్ వెర్డెయన్లు జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1975 జూలై 5 న పోర్చుగలున కేప్ వర్డేకు స్వాతంత్ర్యం లభించింది.[6] 1970, 1980 ల చివరలో చాలా ఆఫ్రికన్ దేశాలు దక్షిణాఫ్రికా ఎయిర్వేసును నిషేధించినప్పటికీ కేప్ వర్దే ఎయిర్ లైనుకు అనుమతి ఇచ్చింది. అందువలన కేప్ వర్డే ఐరోపా, యునైటెడ్ స్టేట్ల వైమానిక విమానాల కార్యకలాపాలకు కేంద్రంగా మారింది.
1980 నవంబరులో గినియా-బిస్సాలో జరిగిన తిరుగుబాటు తరువాత కేప్ వెర్డే, గినియా-బిస్సాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కేప్ వర్డే గినియా-బిసుయోతో ఐక్యత కావడానికి నిరాకరించింది. కేప్ వెర్డే స్వతంత్రం కోసం పి.ఎ.ఐ.సి.వి. ఆఫ్రికన్ పార్టీని స్థాపించింది. తరువాత ఇబ్బందులు పరిష్కరించబడి దేశాల మధ్య సంబంధాలు చక్కబడ్డాయి. పి.ఎ.ఐ.సి.వి. దాని పూర్వీకులు ఏక-పార్టీ వ్యవస్థను స్థాపించి స్వాతంత్ర్యం నుండి 1990 వరకు కేప్ వెర్డేని పాలించారు.[6]
బహుళజాతి ప్రజాస్వామ్యం ఏర్పాటు చేయాలన్న ఒత్తిడి అధికరిస్తున్న కారణంగా పి.ఎ.ఐ.సి.వి. 1990 ఫిబ్రవరిలో ఏక పార్టీ పాలన ముగింపుకు తీసుకురావాలన్న ప్రతిపాదనకు అనుకూలంగా రాజ్యాంగ సవరణ గురించి చర్చించడానికి అత్యవసర సమావేశం జరపాలని నిర్ణయించబడింది. 1990 ఏప్రెలులో ప్రతిపక్ష సమూహాలు కలిసి ప్రైయాలో " కేప్ వర్డే ప్రజాస్వామ్యం కొరకు ఉద్యమం " రూపొందించాయి. 1990 డిసెంబరులో నిర్వహించబడుతున్న అధ్యక్ష ఎన్నికల పోటీలో పాల్గొనే హక్కు కోసం వారు పోరాటం చేశారు.
1990 సెప్టెంబరు 28 న ఏక పార్టీ పాలన రద్దు చేయబడింది. 1991 జనవరిలో మొట్టమొదటి బహుళ-పార్టీ ఎన్నికలు జరిగాయి. జాతీయ అసెంబ్లీలో ఎం.పి.డి. మెజారిటీ సీట్లను గెలుచుకుంది. ఎం.పి.డి. అధ్యక్ష అభ్యర్థి " ఆంటోనియో మస్కరెన్హాస్ మోంటెరో " పి.ఎ.ఐ.సి.వి. అభ్యర్థిని 73.5 % ఓట్లతో ఓడించాడు. 1995 డిసెంబరులో శాసనసభ ఎన్నికలు జాతీయ అసెంబ్లీలో ఎం.పి.డి. ఆధిక్యతను అధికరించాయి. ఈ పార్టీ జాతీయ అసెంబ్లీలో 72 స్థానాలను గెలుచుకుంది.
1996 ఫిబ్రవరి అధ్యక్ష ఎన్నికలలో అధ్యక్షుడు మొన్టేరో కార్యాలయానికి తిరిగి ఎన్నిక చేయబడ్డాడు. 2001 జనవరిలో శాసనసభ ఎన్నికలలో పి.ఎ.ఐ.వి. అధికారంలోకి వచ్చింది. పి.ఎ.ఐ.వి. జాతీయ అసెంబ్లీ సీట్లలో 40, ఎం.పి.డి. 30, పార్టీ ఫర్ డెమొక్రటిక్ కన్వర్జెన్స్ (పి.సి.డి)1, కార్మిక సాలిడారిటీ పార్టీ (పి.టి.ఎస్) 1 స్థానాలు సాధించాయి. 2001 ఫిబ్రవరిలో పి.ఎ.ఐ.వి. మద్దతు ఉన్న అధ్యక్ష అభ్యర్థి పెడ్రో పియర్స్ మాజీ ఎం.పి.డి. నాయకుడు కార్లోస్ వీగాను 13 ఓట్ల తేడాతో ఓడించాడు.[6]
కేప్ వెర్డే ద్వీపసమూహం ఆఫ్రికన్ ఖండం పశ్చిమ తీరానిక్ దాదాపుగా 570 కిలోమీటర్లు (350 మైళ్ళు) దూరంలో సెనెగల్, ది గాంబియా, మౌరిటానియాల సమీపంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. ఇది మాకోరోనెసియా పర్యావరణ ప్రాంతంలో భాగంగా ఉంది. ఇది 14 ° నుండి 18 ° డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, 22 ° 26 ° పశ్చిమ రేఖాంశంలో ఉంటుంది.
ఈ దేశంలో గుర్రపు నాడా ఆకారంలో పది ద్వీపాలను (తొమ్మిది నివాసితులు) ఉన్నాయి. ఎనిమిది లఘుద్వీపాలు The country is a horseshoe-shaped cluster of ten islands (nine inhabited) and eight islets, [8] 4033 కిలోమీటర్ల విస్తీర్ణంలోవిస్తరించి ఉన్నాయి.[8]
ద్వీపాలు ప్రాదేశికంగా రెండు సమూహాలుగా విభజించబడ్డాయి:
పరిమాణం, జనాభా రెండింటిలో అతిపెద్ద ద్వీపం శాంటియాగో. ఇది దేశం రాజధాని అయిన ప్రయా నగరంతో ద్వీపసమూహంలోని ఇతర ప్రధాన పట్టణ సముదాయం ఉంది.[8]
కేప్ వెర్డే ద్వీపాలలో సాల్, బోవా విస్టా, మాయో చాలా చదునుగా, ఇసుక భూములు, పొడిగా ఉంటాయి. ఇతర ద్వీపాలు సాధారణంగా వృక్షాలతో శిలాసదృశ్యంగా ఉంటాయి.
భౌగోళికంగా ద్వీపాలు 4,033 చదరపు కిలోమీటర్లు (1,557 చదరపు మైళ్ళు) విస్తరించి ఉన్నాయి. ఈ ద్వీపాలు ప్రధానంగా అగ్నిపర్వత శిలలలు, పైరోక్లాస్టిక్ శిథిలాలు అధికంగా ఉంటాయి. అగ్నిపర్వత, ప్లుటోనిక్ శిలలు అధికంగా ఉంటాయి. ఇతర మాకారియోనియన్ ద్వీపాలలో కనిపించే పెట్రోలాజిక్ ద్వీపసమూహం సోడా-ఆల్కలీన్ పెట్రోగ్రఫిక్ ప్రావిన్సులో కనిపిస్తుంటాయి.
ద్వీపసమూహం సమీపంలో గుర్తించిన అయస్కాంతక్షేత్రాలు దీవులు నిర్మాణాలు 125-150 మిలియన్ సంవత్సరాలకు చెందినట్లు సూచిస్తున్నాయి: ఈ ద్వీపాలు 8 మిలియన్లు (పశ్చిమంలో), 20 మిలియన్ సంవత్సరాల (తూర్పులో) పూర్వం ఏర్పడి ఉంటాయని విశ్వసిస్తున్నారు.[9] మైయో శాంటియాగో ఉత్తర ద్వీపకల్పంలో పురాతన శిలలు బహిర్గతమైయ్యాయి. ఇవి 128-131 మిలియన్ సంవత్సరాల కాలం నాటి పురాతన పిల్లో లావాస్ శిలలని భావిస్తున్నారు. ద్వీపాలలో అగ్నిపర్వతపు మొదటి దశ మయోసెన్లో మొదలై, ఈ కాలం ముగిసే సమయానికి ద్వీపాలు తమ గరిష్ఠ పరిమాణాలకు చేరుకున్నాయి.
ద్వీపాలు అగ్నిపర్వతావాదం హాట్ స్పాట్ వర్గానికి చెందినవిగా భావించబడుతుంది. బాడీమెట్రిక్ వ్యాకోచంతో కేప్ వర్దే రైజును ఏర్పరచింది. కలిగి ఉంది.[10] ప్రపంచ మహాసముద్రాలలో అతి పెద్ద ప్రొప్యూబలలో కేప్ వర్డే రైజు ఒకటి. ఇది 1200 కి.మీ.ల అర్ధవృత్తాకారంగా 2.2 కిలోమీటర్లు (1.4 మైళ్ళు) పెరుగింది. ఇది భౌగోళికంగా కృత్రిమ ఉపరితల ఉష్ణ ప్రవాహంతో సంబంధం కలిగి ఉంటుంది.[9]
ఈ ప్రాంతంలో ఉన్న అతి పెద్ద అగ్నిపర్వతం పికో 2014 లో విస్పోటనం చెందింది. కాల్డెరా వ్యాసం 8 కిలోమీటర్ల (5 మైళ్ళు). అంతర్ఘతంగా శంఖాకారంగా ఉండే దీని అంచు పొడవు 1,600 మీటర్లు (5,249 అడుగులు), ఎత్తు సముద్ర మట్టం నుండి 2,829 మీటర్లు (9,281 అడుగులు). మాగ్మా గదిలో పాక్షిక తరలింపు (విస్ఫోటనం) మాగ్మా చాంబర్ (స్థలంలో 8 కి.మీ. లోతులో) నుండి ఒక స్థూపాకార కాలం ఏర్పడిన తరువాత కల్డెరా ఉపశమనం పొందింది.
సాల్, మాయోలో విస్తారమైన ఉప్పు ఫ్లాట్లు కనిపిస్తాయి.[8] శాంటియాగో, శాంటో అంటోయో, సావో నికోలౌ న క్షేత్రాలలో చెరకు క్షేత్రాలు లేదా అరటి తోటల ప్రాంతంగా మారాయి.[8] కేటాస్ట్రోపిక్ డెబ్రిస్ కొండచరియలు విరగండం క్లిఫ్టులు రూపుదిద్దుకున్నాయి.[11]
నౌరు అధ్యక్షుడు మాటల ఆధారంగా " కేప్ వెర్డే వాతావరణ మార్పులు, వరదలు కారణంగా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశాలలో 8 వ స్థానంలో ఉంది " భావిస్తున్నారు.[12]
కేప్ వెర్డే వాతావరణం ఆఫ్రికన్ ప్రధాన భూభాగం కంటే తేలికగా ఉంటుంది. ఎందుకంటే ద్వీపాలలో చుట్టుపక్కల ఉన్న సముద్రం ద్వీపం మీద ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. చల్లని అట్లాంటిక్ ప్రవాహాలు ద్వీపసమూహ చుట్టూ పొడి వాతావరణాన్ని సృష్టిస్తాయి. దీనికి విరుద్దంగా దీవులు పశ్చిమ ఆఫ్రికా తీరాన్ని ప్రభావితం చేసే అప్ వెల్లింగ్సును (చల్లని ప్రవాహాలు) అందుకోలేవు, కాబట్టి సెనెగల్ కన్నా ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది. కానీ సముద్రం వేడిగా ఉంటుంది. నిటారుగా ఉన్న పర్వతాలతో కూడిన శాంటియాగో చెట్లు, రాళ్ళు, మట్టి, లాగ్‌లు, నాచు మొదలైన వాటితో నిండిన సుసంపన్నమైన అరణ్యాలు, నిగూఢమైన వృక్షాలతో కప్పుతూ తేమతో కూడిన గాలిని అడ్డుకుంటాయి. ఎత్తైన ద్వీపాలు, కొంతవరకు తడిగా ఉన్న దీవులు, ప్రత్యేకంగా పర్వతప్రాంతాలతో నిండి ఉన్న శాంటో అంటోయో ద్వీపం వాతావరణం పొడి వర్షారణ్యాలు అడవుల అభివృద్ధికి, వృక్షసంపద అభివృద్ధికీ అనుకూలమైనదిగా ఉంటుంది.[8] సగటున రోజువారీ అధిక ఉష్ణోగ్రతలు ఫిబ్రవరిలో 31 ° సెంటీ గ్రేడ్ (87.8 ° ఫారెన్ హీట్) నుండి సెప్టెంబరులో 26 ° సెంటీ గ్రేడ్ (79 ° ఫారెన్ హీట్) వరకు ఉంటాయి.[13] సహెలియన్ వెచ్చటి బెల్టులో భాగంగా ఉన్న కేప్ వర్డేలో సమీపంలోని పశ్చిమ ఆఫ్రికాలో ఉండే వర్షపాతం లేదు.[8] ఆగస్టు, అక్టోబరు మధ్య క్రమరహిత స్వల్పమైన, ఘనమైన వర్షాలు మారి మారి కురుస్తాయి.[8] ఎడారి సాధారణంగా వార్షిక వర్షపాతం కంటే 250 మి.మీ (9.8 అం) కంటే తక్కువగా ఉంటుంది. సాల్లో మొత్తం (145 మి.మీ (5.7 అం) ) వర్షపాతం ఉంటుంది. ఇక్కడ వార్షికంగా సెప్టెంబరులో అధిక వర్షపాతం ఉంటుంది.[14]
శీతోష్ణస్థితి డేటా - Cape Verde: Sal and Praia | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 33.0 (91.4) |
36.7 (98.1) |
35.2 (95.4) |
36.0 (96.8) |
36.4 (97.5) |
40.0 (104.0) |
40.0 (104.0) |
34.9 (94.8) |
35.0 (95.0) |
37.0 (98.6) |
36.9 (98.4) |
33.2 (91.8) |
40.0 (104.0) |
సగటు అధిక °C (°F) | 26.1 (79.0) |
26.2 (79.2) |
27.4 (81.3) |
27.7 (81.9) |
28.9 (84.0) |
29.4 (84.9) |
29.7 (85.5) |
30.6 (87.1) |
30.5 (86.9) |
30.7 (87.3) |
29.4 (84.9) |
27.6 (81.7) |
28.7 (83.6) |
రోజువారీ సగటు °C (°F) | 22 (72) |
22 (72) |
22 (72) |
23 (73) |
24 (75) |
24 (75) |
25 (77) |
26 (79) |
26 (79) |
26 (79) |
25 (77) |
23 (73) |
24 (75) |
సగటు అల్ప °C (°F) | 19.7 (67.5) |
19.2 (66.6) |
19.4 (66.9) |
20.2 (68.4) |
21.1 (70.0) |
21.9 (71.4) |
23.3 (73.9) |
24.3 (75.7) |
24.4 (75.9) |
24.1 (75.4) |
22.8 (73.0) |
21.4 (70.5) |
21.8 (71.3) |
అత్యల్ప రికార్డు °C (°F) | 10.0 (50.0) |
10.2 (50.4) |
10.0 (50.0) |
14.0 (57.2) |
10.7 (51.3) |
14.1 (57.4) |
11.0 (51.8) |
16.0 (60.8) |
18.0 (64.4) |
19.4 (66.9) |
16.4 (61.5) |
16.0 (60.8) |
10.0 (50.0) |
సగటు అవపాతం mm (inches) | 3 (0.1) |
7 (0.3) |
5 (0.2) |
5 (0.2) |
0 (0) |
3 (0.1) |
5 (0.2) |
15 (0.6) |
14 (0.6) |
16 (0.6) |
7 (0.3) |
10 (0.4) |
90 (3.6) |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) | 61 | 58 | 57 | 56 | 57 | 61 | 67 | 50 | 47 | 67 | 64 | 63 | 59 |
నెలవారీ సరాసరి ఎండ పడే గంటలు | 310.0 | 214.5 | 280.0 | 330.0 | 341.0 | 300.0 | 279.0 | 250.0 | 295.0 | 279.0 | 300.0 | 279.0 | 3,457.5 |
Source 1: Weatherbase.com (humidity, sun and mean temperature),[15] Met Office for precipitation[14] | |||||||||||||
Source 2: Voodoo Skies for the rest [13] |
సాల్, బోవా విస్టా, మాయో ఒక చదరమైన మైదాన ప్రాంతంగా శుష్క వాతావరణం కలిగి ఉంటాయి. మిగిలినవి సాధారణంగా శిలామయంగా, అధిక వృక్షసంపద కలిగి ఉంటాయి. వర్షపాతం అరుదుగా సంభవించిన కారణంగా శుష్కప్రకృతి ఉంటుంది. ద్వీపసమూహం నాలుగు పర్యావరణ ప్రాంతాలుగా విభజించబడి ఉంటుంది. శుష్క, అర్ధ శుష్క, తేమ, సబ్ హ్యూమిడ్ ప్రాంతాలుగా విభజించబడుతుంది. తేమ కలిగిన పర్వతప్రాంతాలలో 200 మిల్లీమీటర్ల (7.9 అంగుళాలు) నుండి 1,000 మిల్లీమీటర్ల (39 అంగుళాలు) వర్షపాతం ఉంటుంది.
వర్షపాతం అధికంగా సముద్రజల బాష్పీకరణ కారణంగా సంభవిస్తుంటుంది.
శాంటియాగో వంటి కొన్ని ద్వీపాలలోని లోతట్టు తూర్పు తీరప్రాంతాలలో తడి శీతోష్ణస్థితి, దక్షిణ, నైరుతీ తీరంలో పొడి వాతావరణం ఉంటుంది. దేశంలోని అతిపెద్ద నగరం, రాజధాని ఆగ్నేయ తీరంలో ఉంది.
సహారాకు సమీపంలో ఉన్న కారణంగా కేప్ వెర్డే ద్వీపాలలో అధికభాగం వాతావరణం పొడిగా ఉంటాయి. ద్వీపాలలో తీరప్రాంతాల నుండి దూరంగా ఉన్న పర్వతప్రాంతాలలో తేమ ఎక్కువగా ఉండి వర్షాధార నివాస ప్రాంతాన్ని అందిస్తుంది. అయితే మానవ ఉనికికి ఇది ఆటకం కలిగిస్తుంది. నైరుతి వాలుప్రాంతాలలో అధిక వర్షాలు కురుస్తాయి. ఈ ఉంబ్రియాప్రాంతాలలో చలి, తేమ ఉంటుంది.
పశ్చిమార్ధగోళంలో తుఫానులు తరచూ కేప్ వర్దే దీవులకు దగ్గరలో ప్రారంభమవుతాయి. వీటిని కేప్ వెర్డే-రకం తుఫానులుగా సూచిస్తారు. కేప్ వెర్డే నుండి వెచ్చని అట్లాంటిక్ జలాలను దాటినప్పుడు ఈ తుఫానులు చాలా తీవ్రంగా మారతాయి. సగటు హరికేన్ సీజన్ రెండు కేప్ వర్దె-రకం హరికేన్లను కలిగి ఉంది. ఇవి సీజనులో అతిపెద్ద అత్యంత తీవ్రమైన తుఫానులుగా ఉంటాయి. రికార్డైన ఐదు అతి పెద్ద అట్లాంటిక్ ఉష్ణ మండలీయ తుఫానులు కేప్ వెర్డే-రకం తుఫానులుగా ఉన్నాయి. అట్లాంటిక్ హరివాణంలో అత్యధిక కాలం కొనసాగిన ఉష్ణ మండలీయ తుఫానులు అధికంగా కేప్ వెర్డే తుఫానులుగా ఉన్నాయి.
1892 లో మరోసారి 2015 లో హరికేన్ ఫ్రెడ్, అట్లాంటికులో ఏర్పడిన తూర్పు హరికేన్ ద్వారా ఈ ద్వీపాలు రెండుసార్లు తుఫానులచే రికార్డ్ చేయబడ్డాయి.
కేప్ వర్డే ఏకాంతం అనేక ద్వీప జాతులకు ప్రత్యేకంగా పక్షులు, సరీసృపాలు ఉన్నాయి. మానవ అభివృద్ధి వలన వీటిలో చాలావరకు అంతరించిపోతాయి. అలెగ్జాండరు స్విఫ్ట్, బోర్ను హెరాన్, రసో లార్కు (అలౌడా రాజా), కేప్ వెర్డే వార్బ్లర్ (అక్రోయస్ఫాలస్ బ్రీవిప్నస్), ఐగో స్పారో (పాసెర్ ఐగోఎన్సిస్).[16] కేప్ వర్డే షీర్ వాటర్ సహా సముద్ర తీరాలలో ఈ ద్వీపాలు పక్షులు పిల్లలను పొదగడానికి ఒక ముఖ్యమైన ప్రాంతంగా ఉంది. కేప్ వెర్డే దిగ్గజం గెక్కో (టారేరోలా గిగాస్) సరీసృపాలు ఉన్నాయి.
కేప్ వర్డే 22 ముంసిపాలిటీలుగా (కాంసెల్హోసు) గా విభజించబడ్డాయి. ఇవి 32 పరిషెసు అనే ఉప విభాగాలుగా (ఫ్రీక్విసియాస్) గా విభజించబడ్డాయి. ఇవి వలస పాలనలో ఉన్నట్లు మతప్రాతిపదికన విభజించబడ్డాయి.
ద్వీపాలు | మునిసిపాలిటీలు | 2013 గణాంకాలు [17] | పరిషు |
శాన్ ఆంటయో | రిబియేరా గ్రాండే | 18,890 | నొస్సా సెంహోరా డో రొసరియో |
నోసా సెంహోరా డు లివ్రమెంటో | |||
శాంటో క్రూసిఫిక్సో | |||
సాయో పెర్డో అపొస్టోలో | |||
పౌల్ | 6,997 | శాన్ ఆంటానియో డాస్ పొంబాస్ | |
పోర్టో నోవో | 18,028 | శాన్ జోయో బాప్టిస్టా | |
శాంటో ఆండ్రే | |||
సాయో విసెంటే | సాయో విసెంటో | 79,374 | నొస్సా సెంహోరా డా లజ్ |
సెంటా లజియా | |||
సాయో నికోలౌ | రిబెరియా బ్రేవా | 7,580 | నొస్సా సెంహోరా డా లాపా |
నొస్సా సెంహోరా డో రొసారియో | |||
టెర్రా డీ సాయో నికోలౌ | 5,237 | సాయో ఫ్రాంసిస్కో | |
సాల్ | సాల్ | 30,879 | నొస్సా సెంహోరా డాస్ డోరెస్ |
బొయా విస్టా | బొయా విస్టా | 9,162 | శాంటా ఇస్బెల్ |
సాయో జోయా బాప్టిస్టా |
ద్వీపం | ముంసిపాలిటీ | గణాంకాలు 2010 [17] | పరిష్ |
మాయో | మాయో | 6,952 | నొస్సా సెంహోరా డా లజ్ |
శాంటియాగో | ప్రయా | 131,719 | నొస్సా సెంహోరా డా గ్రాకా |
సాయో డోమింగోస్ | 13,808 | నొస్సా నికొలౌ డా లజ్ | |
సాయో నికోలౌ టోలెంటినో | |||
శాంటో కటారియా | 44,388 | శాంటా కటారినా | |
సాయో సల్వాడోర్ ముండో | 8,677 | సాయో సల్వడార్ డో ముండో | |
శాంటా క్రజ్ | 26,617 | శాంటియాగో మయార్ | |
సాయో ల్యురెంకో డాస్ అర్గడోస్ | 7,388 | సాయో ల్యురెంకో గ్రాండే డాస్ అర్గయోస్ | |
రిబెరియా గ్రాండే డీ శాంటియాగో | 8,325 | శాంటిస్సిమొ నొం డీ జెసస్ | |
సాయో జాయో బాప్టిస్సా | |||
సాయో మైక్వెల్ | 15,648 | సాయో మైక్వెల్ అర్కాంజొ | |
టర్రఫాల్ | 18,565 | శాంటో అంరొ అబాడే | |
ఫొగో | సాయో ఫిలిపే | 22,248 | సాయో సెంహోరా డా కాంసెయికావొ |
నొస్సా సెంహోరా డా కాంసెయికావొ | |||
శాంటా కాఋఅరినా డో ఫొగొ | 5,299 | శాంటా కాటరినా డో ఫొగొ | |
మొస్టెయిరొస్ | 9,524 | నొస్సా సెంహోరా డా అజుడా | |
బ్రవా | బ్రవా | 6,952 | సావొ జొయావొ బాప్టిస్టా |
నొస్సా సెంహోరా డో మొంటే |
కేప్ వర్డేలో సహజ వనరుల లేకపోవడం వలన జీవన పరిస్థితులలో మెరుగుదల, ఆర్థికాభివృద్ధి సాధ్యం కాలేదని అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అందువలన ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థలు తరచూ కేప్ వర్డేకు ఆర్థిక సహాయాన్ని అందించాయి. 2007 నుండి ఐక్యరాజ్యసమితి దీనిని తక్కువ అభివృద్ధి చెందిన దేశానికి బదులుగా అభివృద్ధి చెందిన దేశంగా వర్గీకరించింది.
కేప్ వెర్డికి కొన్ని సహజ వనరులు ఉన్నాయి. పది ప్రధాన ద్వీపాలలో ఐదు (శాంటియాగో, శాంటో ఆంటోయా, సావో నికోలౌ, ఫోగో, బ్రావా) సాధారణంగా కేవలం వ్యవసాయ ఉత్పత్తికి[18] మద్దతు ఇస్తాయి. కేప్ వర్దెలో వినియోగించే ఆహారంలో 90% పైగా దిగుమతి చేయబడుతుంది. ఖనిజ వనరులలో ఉప్పు, పోజోలనా (సిమెంట్ ఉత్పత్తిలో ఉపయోగించే ఒక అగ్నిపర్వత రాయి), సున్నపురాయి ప్రాధాన్యత వహిస్తున్నాయి.[6] చిన్న సంఖ్యలో వైన్ తయారీదారులు పోర్చుగీస్-శైలి వైన్లు తయారు చేస్తున్నారు. సాంప్రదాయకంగా దేశీయ మార్కెట్టు మీద దృష్టి పెట్టి ఇటీవల కొన్ని అంతర్జాతీయ ప్రశంసలను అందుకున్నారు. 2010 లో కేప్ వెర్డెలో అనేక వైన్ పర్యటనలు ప్రారంభించబడ్డాయి. పర్యటనలను పర్యాటక కార్యాలయం ద్వారా ఏర్పాటు చేయవచ్చు.
కేప్ వర్దే ఆర్థికవ్యవస్థ వాణిజ్యం, రవాణా, ప్రభుత్వ సేవలు జి.డి.పి.లో 70% కంటే అధికంగా భాగస్వామ్యం వహిస్తూ ఉన్నాయి. [ఆధారం చూపాలి] జనాభాలో దాదాపు 35% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వ్యవసాయం, చేపల పెంపకం జి.డి.పి.లో 9%కు భాగస్వామ్యం వహిస్తున్నాయి. మిగతా మిగిలిన భాగంలో లైట్ తయారీ భాస్వామ్యం వహిస్తుంది. చేపలు, షెల్ఫిష్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి చిన్న పరిమాణంలో ఎగుమతి చేయబడతాయి. కేప్ వెర్డెలోని మిండిలో, ప్రైయా, సాల్ లో చేపల ప్రాసెసింగ్ ప్లాంట్లు, శీతల, గడ్డకట్టే గిడ్డంగి సౌకర్యాలు ఉన్నాయి. కేప్ వర్డియన్లు దేశీయ ఆర్థికవ్యవస్థకు జీడీపీలో సుమారు 20% చెల్లింపులకు కేటాయిస్తారు.[6] కొన్ని మాత్ర్మే సహజ వనరులు, పాక్షికంగా ఎడారి ఉన్నప్పటికీ, దేశంలో ఈ ప్రాంతంలలో ఉన్నతమైన జీవన ప్రమాణాలతో పలు దేశాలకు చెందిన వేలకొలది వలసదారులను ఆకర్షిస్తున్నారు.
1991 నుండి కేప్ వర్డే ప్రభుత్వం మార్కెట్టు ఆధారిత ఆర్థిక విధానాలను అనుసరించింది. విదేశీ పెట్టుబడిదారులకు, ప్రైవేటీకరణ కార్యక్రమానికి బహిరంగ స్వాగతం పలుకుతుంది. ఇది మార్కెట్టు ఆర్థిక వ్యవస్థ, ప్రైవేటు రంగాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చింది. పర్యాటక రంగం, విద్యుద్దీపాల తయారీ పరిశ్రమలు, చేపల పెంపకం రవాణా, సమాచార, విద్యుత్తు శక్తి సౌకర్యాల అభివృద్ధి పట్ల దృష్టి కేంద్రీకరించబడింది. 1994 నుండి 2000 వరకు $ 407 మిలియన్లు విదేశీ పెట్టుబడులలో తయారు చేయడానికి ప్రణాళిక చేయబడ్డాయి. పెట్టుబడులలో 58% పర్యాటక రంగాలలో ఉన్నాయి.[19] పరిశ్రమలో 17%, మౌలికనిర్మాణాలకు 4%, చేపల పెంపకం, సేవలలో 21%.[6]
2011 లో నాలుగు దీవుల్లో ఒక విండ్ ఫామ్‌ను నిర్మించారు. అది దేశ అవసరాలలో 30% విద్యుత్ సరఫరాచేసే సామర్ధ్యం కలిగి ఉంది. పునరుత్పాదక శక్తి కోసం ఇది అగ్ర దేశాలలో ఒకటి.[20]
2000 - 2009 మధ్యకాలంలో జి.డి.పి. సగటున సంవత్సరానికి 7% కంటే అధికంగా అభివృద్ధి చెందింది. ఉప-సహారా దేశాల సగటు కంటే ఇది అధికంగా ఉంది. అలాగే ఈ ప్రాంతంలో చాలా చిన్న ద్వీప ఆర్థిక వ్యవస్థల కంటే వేగంగా ఉంది. ప్రపంచంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక పరిశ్రమలలో ఒకటై బలమైన ఆర్థిక పనితీరుతో ఆర్థికంగా బలోపేతం అయ్యింది. అదేవిధంగా గణనీయమైన మూలధన పెట్టుబడుల ద్వారా కేప్ వెర్డి ప్రస్తుత 3.5 నెలల దిగుమతికి జాతీయ కరెన్సీ నిల్వలను నిర్మించటానికి అనుమతించింది. నిరుద్యోగం వేగంగా పతనం ఔతుంది. దేశం ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ధ అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా పయనిస్తుంది. 1990 లో దారిద్ర్య స్థాయిని తగ్గించింది.
2007 లో కేప్ వెర్డే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషనులో సభ్యదేశం అయింది. 2008 లో దేశం తక్కువ అభివృద్ధి చెందిన దేశం నుండి మధ్య ఆదాయం కలిగిన దేశంగా హోదా పొందింది.[21][22] కేప్ వర్దే ఆర్థిక వ్యవస్థ అన్ని స్థాయిలో పోర్చుగలుతో సహకారంగా పనిచేస్తూ ఉంది. ఇది తన కరెన్సీను మొదట పోర్చుగీస్ ఎస్కుడోకు 1999 లో యూరోతో కలిపేందుకు దారితీసింది. 2008 జూన్ 23 న కేప్ వర్దే వరల్డు ట్రేడు ఆర్గనైజేషనులో 153 వ సభ్యదేశంగా మారింది.[23]
2018 జనవరి మధ్యకాలంలో కనీస వేతనం 11,000 సి.వి.ఇ. నుండి నెలకు 13,000 లకు పెంచబడింది.[24][25]
పేదరికాన్ని తగ్గించడానికి యురేపియన్ కమిషను 2008-2013 మద్య కాలంలో ప్రత్యేకించి గ్రామీణ పెరియాబర్న్ ప్రాంతాల్లో మహిళల గృహణ, అలాగే మంచి పాలన కొరకు 54.1 మిలియన్లు కేటాయించింది.[26]
మధ్య-అట్లాంటిక్ గాలి, సముద్ర దారుల కూడలి వద్ద కేప్ వర్డే వ్యూహాత్మక ఉనికి, మిండిలో నౌకాశ్రయం (పోర్టో గ్రాండే), సాల్, ప్రేయసులలో అంతర్జాతీయ విమానాశ్రయాలు గణనీయంగా అభివృద్ధి చేయబడ్డాయి. డిసెంబరు 2007 లో బోవా విస్టాలో ఒక కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించబడింది, 2009 లో కేప్ వర్దెలోని నూతన అంతర్జాతీయ విమానాశ్రయం (సెయారియా ఎవొరా విమానాశ్రయం) ద్వీపంలో ప్రారంభించబడింది. 1983 లో మిండేలో వద్ద ఓడ మరమ్మతు సదుపాయాలను 1983 లో ప్రారంభించారు.[6]
మిండే, ప్రయాలలో ప్రధాన నౌకాశ్రయాలు ఉన్నాయి. ఇతర ద్వీపాలన్నింటిలో చిన్న ఓడరేవు సౌకర్యాలు కలిగి ఉన్నాయి. సాల్ లో అంతర్జాతీయ విమానాశ్రయముతో పాటుగా, నివాసితులున్న అన్ని ద్వీపములలో విమానాశ్రయాలు నిర్మించబడ్డాయి. బ్రావా, శాంటో ఆంటోలో విమానాశ్రయాలన్నీ షెడ్యూల్ చేయబడిన విమాన సేవలను కలిగి ఉంటాయి. ద్వీపసమూహంలో 3,050 కిలోమీటర్లు (1,895 మైళ్ళు) రహదారి ఉంది. వాటిలో 1,010 కిమీ (628 మైళ్ళు) కోబ్లే రాళ్ళు ఉపయోగించి పేవుమెంటు చేయబడ్డాయి.[6]
దేశం భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలు విదేశీ సహాయం నిర్వహణ, పర్యాటక ప్రోత్సాహం, చెల్లింపులు, పొరుగు ఆఫ్రికన్ దేశాలలో పనిచేసే కార్మికులు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల మద్దతుగా ఉన్నాయి.[6]
2013 అధికారిక గణాంకాల ఆధారంగా కేప్ వర్డే జనసంఖ్య 5,12,096.[27] కేప్ వర్డే ప్రధాన భూభాగం శాంటియాగోలో అత్యధిక సంఖ్యలో (2,36,000) నివసిస్తున్నారు.[28]
1456 లో పోర్చుగీసు కేప్ వర్డేను కనుగొన్నప్పుడు కేప్ వెర్డే ద్వీప సమూహం జనావాసరహితంగా ఉన్నాయి. ప్రస్తుతం కేప్ వెర్డే ఆధునిక జనాభాలో ఐరోపా స్థిరనివాసులు, పోర్చుగీసు తోటల మీద పని చేయడానికి ద్వీపాలకు తీసుకువచ్చిన ఆఫ్రికన్ బానిసల మిశ్రమజనాభా ఈ దీవులలో నివసిస్తున్నారు. చాలామంది కేప్ వర్డెయన్లను ములాట్టాస్, పోర్చుగీసులో మేస్టికోసు అని కూడా పిలుస్తారు. మరొక పదం క్రియోల్, మిశ్రమ స్థానిక-జన్మించిన ఆఫ్రికన్ సంతతి ప్రజలు, స్థానిక-జన్మించిన యూరోపియన్ సంతతికి చెందిన ప్రజలు అని అర్థం.
ప్రజలలోని యురేపియన్లలో పోర్చుగీసు అన్and మతిత భూములు మంజూరు చేయబడిన స్పెయిను దేశీయులు, ఇటలీ దేశీయులు, పోర్చుగీసు సామ్రాజ్యం స్థావరాలు ఏర్పరుచుకున్న పోర్చుగీసు ప్రజలు, బహిష్కృత పోర్చుగీసు ప్రజలు, అలాగే పోర్చుగీసు ముస్లింలు (జాతి మూర్సు), పోర్చుగీసు యూదులు (జాతి సేఫర్డిం) (ఈ మతసంబంధ సమూహాలు రెండూ కూడా విచారణను ఎదుర్కొంటున్న ప్రజలు ) ఉన్నారు. ఇతర వలసదారులు నెదర్లాండ్స్, ఫ్రాన్స్, బ్రిటన్, అరబ్బు దేశాలు (ముఖ్యంగా లెబనాన్, మొరాకో), చైనా (ముఖ్యంగా మాకా నుండి), భారతదేశం, ఇండోనేషియా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా (పోర్చుగీసు, ఆఫ్రికన్ వంశీయులు సహా) మెస్టికో జనాభాలో వీలీనం చేయబడిన వారు) దేశాలకు చెందిన ప్రజలు ఉన్నారు.
21 వ శతాబ్దంలో కేప్ వర్డే జనాభాలో క్రియోల్ ప్రజలు అధికంగా ఉన్నారు. దేశం జనాభాలో నాలుగోవంతు రాజధాని నగరమైన ప్రయాలో నివసిస్తున్నారు. ద్వీపసమూహంలో జనాభాలో 65% మంది పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. 2017 గణాంకాలలో నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో డేటా ఆధారంగా అక్షరాస్యత రేటు 89% (అనగా 15 కంటే అధిక వయస్సు ఉన్న వారిలో పురుషుల్లో 93,3%, స్త్రీలలో 84.7% మంది అక్షరాస్యులు) ఉన్నారు. ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్, ఐరోపాలకు వలస వచ్చిన ప్రజలలో చాలామంది చాలామంది కేప్ వెర్డియన్లు తిరిగి ఆయాదేశాలకు వలస వెళ్ళారు.
కేప్ వెర్డే జనాభా పూర్వీకత గురించి సాగించిన జన్యు అధ్యయనంలో ప్రధానంగా పురుషులు ఐరోపా సంతతికి చెందిన వారు ఉన్నారని, స్త్రీలు అధికంగా పశ్చిమ ఆఫ్రికా సంతతికి చెందిన వారున్నారని వెల్లడైంది; 56% ఆఫ్రికన్లు, 44% యూరోపియన్లు ఉన్నారని గణించబడింది.[29] శతాబ్దాల కాలం కొనసాగిన అధికస్థాయి వలసల ఫలితంగా జన్యు, జాతి మిశ్రమం ప్రజలు అధికం అయ్యారని భావిస్తున్నారు.
కేప్ వెర్డే అధికారిక భాష పోర్చుగీసు.[30] ఇది బోధన, ప్రభుత్వ భాషగా ఉంది. ఇది వార్తాపత్రికలు, టెలివిజన్, రేడియోలలో కూడా ఉపయోగించబడుతుంది.
కేప్ వెర్డియన్ క్రియోల్ భాష సాధారణ వాడుకభాషగా ఉంది. వాస్తవంగా ఇది కేప్ వెర్డియన్ల మాతృభాషగా ఉంది. జాతీయ రాజ్యాంగం దీనికి పోర్చుగీసుతో సమానంగా హోదా ఇవ్వడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుంది.[30] పోర్చుగీసు ఆధారిత క్రియోలు మాండలికాన్ని కేప్ వెర్డియన్ క్రియోల్ లేదా క్రియోలౌ అంటారు. క్రియోలు భాషలో గణనీయమైన సాహిత్య రూపం ఉంది. ముఖ్యంగా శాంటియాగో క్రియోలు, సావో విసినే క్రియోలు భాషలో ఉంది. పోర్చుగల్ నుండి దేశం స్వతంత్రం పొందిన తరువాత క్రియోలు భాషకు గౌరవం అధికరించింది.
ద్వీపాలలో భాషల రూపాల మధ్య తేడాలు భాష ప్రామాణీకరణకు ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి. కొందరు వ్యక్తులు రెండు ప్రమాణాల అభివృద్ధిని ప్రతిపాదించారు: శావో విసెంటే క్రియోలు మీద కేంద్రీకృతమై ఉన్న ఉత్తర (బార్లవెంటో), శాంటియాగో క్రియోలు మీద కేద్రీకృతమైన దక్షిణ (సోటావెంతో). రచయిత మాన్యుయల్ వీగా (పీహెచ్డీ చేసి) కేప్ వెర్డే సంస్కృతి, భాషాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఈయన క్రియోలౌ అధికారిక, ప్రామాణీకరణకు ప్రధాన మద్దతుదారుగా ఉన్నాడు.[31]
2007 లో జనాభాలో 95% కంటే ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. వీరిలో 85% రోమన్ క్యాథలిక్కులు ఉన్నారు.[33] ఆఫ్రికన్ ప్రభావాలతులైన కాథలిక్కులు అల్పసంఖ్యాక ప్రజలుగా ఉన్నారు.[34]
అతిపెద్ద ప్రొటెస్టంటు నజరేన్ చర్చికి చెందినవారై ఉన్నారు. మిగిలిన వారు సెవెన్త్-డే అడ్వెంటిస్ట్ చర్చి, ది చర్చి ఆఫ్ జీసస్ క్రైస్టు ఆఫ్ లేటర్-డే సెయింట్స్, ది అసెంబ్లిస్ ఆఫ్ గాడ్, ది యూనివర్సల్ చర్చ్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇతర పెంటెకోస్టల్, ఇవాంజెలికలు బృందాలకు చెందినవారై ఉన్నారు.[33] కేప్ వర్డేలో స్వల్పమైన ముస్లిం సమాజం ఉంది.[33] అనేక దీవులలో యూదు స్థావరాలు ఉన్నాయి.[35] నాస్తికుల సంఖ్య జనాభాలో 1% కంటే తక్కువగా ఉందని అంచనా వేయబడింది.[33]
ప్రస్తుతం కేప్ వెర్డిలో కాకుండా విదేశాలలో నివసిస్తున్న ప్రజలలో [36] అమెరికా సమ్యుక్తరాష్ట్రాలలో నివసిస్తున్న కేప్ వెర్డియన్ల సమూహాలలో మొత్తం 500,000 మంది ఉన్నారు. కేప్ వెర్డియన్ సంతతికి చెందిన ప్రజలలో న్యూ ఇంగ్లాండ్ తీరంలో న్యూ ఇంగ్లాండ్ సముద్ర తీరంలో ప్రొవిడెన్సు రోడ్ ఐలాండ్ నుండి న్యూ బెడ్ఫోర్డ్, మసాచుసెట్సు అధికంగా కేంద్రీకృతమై ఉన్నారు.
ప్రస్తుతం కేప్ వర్డే వెలుపల నివసిస్తున్న కేప్ వర్డియన్లలో పోర్చుగీసు నివసిస్తున్న వారు (15,000), అంగోలా నివసిస్తున్న వారు (45,000), సాయో టోమే ప్రింసిపే నివసిస్తున్న వారు (25,000), సెనెగల్ నివసిస్తున్న వారు (25,000), నెదర్లాండ్స్ 20,000 (వీరిలో 15,000 రోటర్డ్యాంలో కేంద్రీకృతమై ఉన్నారు), స్పెయిన్ (65,500), యునైటెడ్ కింగ్డమ్ (35,500), ఫ్రాన్స్ (25,000), ఇటలీ (10,000) లక్సెంబర్గ్ (7,000), స్కాండినేవియా (7,000) ఉన్నారు. అర్జెంటీనాలో కేప్ వెర్డిన్ కమ్యూనిటీ 8,000 మంది ఉన్నారు. 1975 కు ముందు వలస వచ్చిన కేప్ వెర్డియన్ సంతతికి చెందిన ప్రజలు ఈ గణాంకాలలో చేర్చబడలేదు. ఎందుకంటే కేప్ వెర్డెయన్లు 1975 కి ముందు వారు పోర్చుగీసు పాస్ పోర్టులు కలిగి ఉన్నారు.
కేప్ వర్దెలోని వలస జనాభాలో చైనీయుల గణనీయమైన సంఖ్యలో ముఖ్యమైన విభాగంగా ఉన్నారు. వెస్టు ఆఫ్రికన్ తీరప్రాంతానికి చెందిన వలసదారులు ఎక్కువమంది ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని వేల ఐరోపియన్లు, లాటిన్ అమెరికన్లు దేశంలో స్థిరపడ్డారు. ఈ ద్వీపాలలో 90 దేశాల చెందిన 22,000 మంది విదేశీయులు ఉన్నారు.
సంవత్సరాలుగా కేప్ వెర్డ తలసరి ఆదాయం, రాజకీయ, సామాజిక స్థిరత్వం, స్వేచ్ఛ కారణంగా స్థిరమైన స్వదేశీవలసలకు అనుకూలమైన దేశంగా మారింది.[ఆధారం చూపాలి]
కేప్ వర్దే ద్వీపాల నుండి ఉత్తర అమెరికాకు వచ్చిన వలసదారులు సైనిక దళాలతో కలిసి పనిచేసిన సుదీర్ఘ చరిత్ర ఉంది. కేప్ వర్డియన్లు రివల్యూషనరీ వార్, పౌర యుద్ధం, మొదటి, రెండవ ప్రపంచయుద్ధాలు, కొరియన్ యుద్ధం, వియత్నాం యుద్ధం అమెరికన్ సైనికులతో కలిసి పనిచేసారు.[37] కేప్ వెర్డియన్లు ప్రపంచవ్యాప్తంగా మకావ్ నుండి హైతీ, అర్జెంటీనా, ఉత్తర ఐరోపాకు తరలివెళ్ళారు.[38]
నేషనల్ గణాంకాల బ్యూరో తాజా (2017) డేటా ప్రకారం, కేప్ వర్డెయన్ పిల్లల మధ్య 5 సంవత్సరముల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు 1000 మందిలో 15 శిశు మరణాలు సంభవిస్తున్నాయని భావిస్తున్నారు.[39] ప్రసవ సమయంలో 1,00,000 మందిలో 42 మరణాలు సంభవిస్తున్నాయి. 15 - 49 సంవత్సరాల మధ్య వయసు కలిగిన కేప్ వెర్డియన్లలో హెచ్.ఐ.వి.- ఎయిడ్సు ప్రాబల్యం రేటు 0.8% ఉంటుంది.[40]
నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో తాజా గణాంకాలు (2017) ఆధారంగా, [39] కేప్ వెర్డే ప్రజల ఆయుఃప్రమాణం 76.2 సంవత్సరాలు వీరిలో పురుషుల ఆయుర్ధాయం 72.2 సంవత్సరాలు, స్త్రీల ఆయుర్ధాయం 80.2 సంవత్సరాలు. కేప్ వర్దే ద్వీపసమూహంలో ఆరు ఆస్పత్రులు ఉన్నాయి. రెండు సెంట్రల్ ఆసుపత్రులు (ఒకటి రాజధాని ప్రయా నగరంలో ఉంది, మిండోలో, సావో విసెంటేలో ఒకటి ఉంది). నాలుగు ప్రాంతీయ ఆసుపత్రులు (ఒకటి శాంటా కాతరినా, ఉత్తర సాన్టియాగో ప్రాంతంలో, ఒకటి శావో ఆంటోలో, ఒకటి ఫోగోలో, సాల్లో ఒకటి) ఉన్నాయి. అదనంగా 28 ఆరోగ్య కేంద్రాలు, 35 పారిశుధ్య కేంద్రాలు వివిధ రకాల క్లినిక్‌లు ఉన్నాయి.
ఆఫ్రికా దేశాల మద్య కేప్ వర్డే జనాభా ఆరోగ్యవంతమైనది. స్వాతంత్ర్యం లభించినప్పటి నుండి దేశ ఆరోగ్య సూచికలు బాగా అభివృద్ధి చెందాయి. 2007 లో "అతి తక్కువ అభివృద్ధి" దేశాల సమూహం నుండి " మధ్యమ అభివృద్ధి " చెందిన దేశాల వర్గంలోకి (ఒక దేశానికి ఇది రెండోసారి మాత్రమే ఉంది) చేరింది.[41]) ప్రస్తుతం దాని మానవ అభివృద్ధి సూచికలో ఇది ఇది ఆఫ్రికాలో 10 వ స్థానంలో ఉంది. కేప్ వర్డే ప్రజల ఆరోగ్యరక్షణ కొరకు జి.డి.పి.లో 7.1% వ్యయం చేస్తుంది.
కేప్ వెర్డిన్ విద్యా వ్యవస్థ పోర్చుగీసు వ్యవస్థకు సమానమైనప్పటికీ కొన్ని సంవత్సరాలుగా స్థానిక విశ్వవిద్యాలయాలు అధికంగా అమెరికన్ విద్యా వ్యవస్థను దత్తతు తీసుకున్నాయి; ఉదాహరణకు దేశంలో ఉన్న మొత్తం 10 విశ్వవిద్యాలయాలు 2010 కి ముందు 5 సంవత్సరాల బ్యాచులర్ పట్టా అందిస్తూ తరువాత అందుకు వ్యతిరేకంగా 4 సంవత్సరాల బ్యాచులర్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. దక్షిణాఫ్రికా తర్వాత కేప్ వర్డే ఆఫ్రికాలో రెండవ ఉత్తమ విద్యా వ్యవస్థగా ప్రత్యేకత సంతరించుకుంది. [ఆధారం చూపాలి]కేప్ వర్దెలో నిర్బంధ ప్రాథమిక పాఠశాల విధానం అమలులో ఉంది. 6 - 14 సంవత్సరాల వయస్సు మధ్య పిల్లలకు విద్య ఉచితంగా అందించబడుతుంది.[42]
2011 లో ప్రాథమిక పాఠశాల నికర నమోదు శాతం 85% ఉంది.[42][43] సుమారు 15 సంవత్సరాల లోపు వారిలో 90% అక్షరాస్యులు ఉన్నారు. సుమారు 25% మంది కళాశాల డిగ్రీ పూర్తిచేస్తున్నారు. ఈ కళాశాల పట్టభద్రులు గణనీయమైన సంఖ్యలో వివిధ విద్యా రంగాలలో డాక్టరేట్ డిగ్రీలను కలిగి ఉన్నారు. 90% పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఉపాధ్యాయులలో 98% మంది ఉపాధ్యాయుల శిక్షణలో పాల్గొన్నారు.[42] చాలామంది పిల్లలకు విద్య అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయి.[42] ఉదాహరణకు పాఠశాల వస్తువులు, భోజనాలు, పుస్తకాల కొరకు తగినంత వ్యయం చేయడం లేదు.[42]
2016 నాటికి ద్వీపసమూహం అంతటా 69 సెకండరీ పాఠశాలలు (19 ప్రైవేట్ సెకండరీ స్కూల్స్‌తో సహా) దేశంలోని కనీసం 10 విశ్వవిద్యాలయాలు శాంటియాగో, సావో విసెంటే రెండు ద్వీపాలపై ఆధారపడి ఉన్నాయి.
2015 లో కేప్ వెర్డన్ జనాభాలో 23% మంది మాధ్యమిక పాఠశాలలకు హాజరౌతున్నారు. పైచదువులు ముగించి విశ్వవిద్యాలయాలలో ప్రవేశించే వారిలో 9% మంది పురుషులు, 8% మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం కాలేజి విద్యార్థులలో 24% మందికి కాలేజీలతో సంబంధం ఉంది. . 2010లో ప్రభుత్వం మొత్తంగా జి.డి.పి.లో 5.6% వ్యయం చేస్తుంది.
2011 లో కేప్ వర్డే తన జిడిపిలో కేవలం 0.07% పరిశోధన, అభివృద్ధి కొరకు వ్యయం చేస్తుంది. ఇది పశ్చిమ ఆఫ్రికాలో అత్యల్పంగా భావించబడుతుంది. ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ విజ్ఞానశాస్త్రం, సంస్కృతి, పరిశోధన, విద్యా రంగాలను బలోపేతం చేయటానికి ప్రణాళికలు తయారు చేస్తుంది. అంతర్జాతీయ సహకార ఒప్పందాలతో చైతన్యం మీద దృష్టి పెట్టి ప్రణాళికలు సిద్ధం చేస్తాయి. ఈ వ్యూహంలో భాగంగా కేప్ వర్డే 2015 - 2020 మధ్య 200 000 మంది విద్యావేత్తలను సమీకరించటానికి ఐబెరో-అమెరికన్ అకాడమిక్ మొబిలిటీ కార్యక్రమంలో పాల్గొంటుంది.[44]
2011 లో కేప్ వర్డే 25 మంది పరిశోధకులున్నారని అంచనా. 10 లక్షల మందికి 51 మంది పరిశోధకుల నిష్పత్తిలో ఉన్నారు. 2013 లో ప్రపంచంలో సగటున లక్షమందికి 1,083 మంది ఉన్నారు. 2011 లో ప్రభుత్వ రంగంలో 25 మంది పరిశోధకులు పనిచేస్తున్నారు. వీరిలో ముగ్గురిలో ఒకరు మహిళలు (36%) ఉన్నారు. వైద్య లేదా వ్యవసాయ శాస్త్రాలలో ఏ పరిశోధన నిర్వహించబడలేదు. పరిశోధన, అభివృద్ధిలో పాల్గొన్న ఎనిమిది ఇంజనీర్లలో ఒక మహిళ ఉంది. ప్రకృతి శాస్త్రాలలో పనిచేస్తున్న ఐదు పరిశోధకులలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఆరుగురు సామాజిక శాస్త్రవేత్తలలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఐదుగురు మానవీయ శాస్త్ర పరిశోధకులలో ఇద్దరు మహిళలు ఉన్నారు.[44]
2015 లో ప్రభుత్వం సైబర్-ఐలాండ్ నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కంప్యూటర్ నిర్వహణ, బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాల సేవలను అభివృద్ధి చేస్తుంది. 2013 లో ఆమోదించబడిన ప్రయా టెక్నాలజీ పార్క్ ఈ దిశలో ఒక అడుగు ముందుకు వేసింది. దీనికి ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులు సమకూరుస్తుంది. ఇది 2018 నాటికి పనిచేస్తుందని భావిస్తున్నారు.[44]
కేప్ వర్డేలో ముఖ్యంగా మార్కెట్టు ప్రదేశాలు, పండుగలు, వేడుకలు వంటి సమూహాలలో దొంగతనం, బందిపోటు దొంగతనం సాధారణం అయింది.[45] వీధి బాలల ముఠాలు తరచుగా ఈ నేరాలకు పాల్పడుతున్నారు.[45] ప్రాయా, మిండే లలోని జనాభా కేంద్రాలలో హత్యానేరాలు కేంద్రీకృతమై ఉన్నాయి.[45]
కేప్ వర్డే సంస్కృతి ఐరోపా, ఆఫ్రికన్ మిశ్రమ అంశాలను కలిగి ఉంటుంది. ఒకటిగా నివసితున్న రెండు సంస్కృతుల మొత్తంగా కాక 15 వ శతాబ్దంలో ప్రారంభమైన మార్పిడి కారణంగా ఒక కొత్త సంస్కృతి ఏర్పడింది.
ఐరోపా జాతి, సాంస్కృతిక ఆధిపత్యాన్ని ప్రశ్నించిన ప్రముఖులు, ఐరోపియన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జాతీయ విముక్తి కొరకు సుదీర్ఘ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.[8]
కేప్ వెర్డన్ సాంఘిక, సాంస్కృతిక విధానాలు గ్రామీణ పోర్చుగల్ విధానాలను పోలి ఉంటాయి.[8] సాంఘిక అనుసంధానాలకు, వినోదాలకు ఫుట్‌బాల్ క్రీడలు చర్చి కార్యకలాపాలు సాధారణ వనరులుగా ఉన్నాయి.[8] స్నేహితులు ఒకరితో ఒకరు కలుసుకునే ప్రకా (పట్టణం కూడలి) చుట్టూ సంప్రదాయంగా నడవడం కేప్ వెర్డే పట్టణాలలో క్రమంగా అభ్యాసంగా మారింది.[8]
విద్యుత్తు ఉన్న పట్టణాలలో మూడు టెలివిజన్ ఛానెళ్ళు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 2005 న పోర్చుగీసు ఆధారిత ఆ.టి.ఐ విడుదల చేసిన ఆఋ.టి.ఐ కాబో వెర్డ, ప్రభుత్వానికి స్వంతమైన ఆర్.టి.సి. - టి.సి.వి ఉన్నాయి. విదేశీ యాజమాన్య మూడు సంస్థలలో రికార్డ్ క్యాబో వర్డును బ్రెజిలియన్ ఆధారిత రెడే రికార్డు విడుదల చేసింది.[8] కేప్ వర్దే ఇప్పుడు టి.వి. సి.పి.ఎల్.పి.ని అందుకుని కొన్ని కార్యక్రమాలు ప్రసారం చేసింది. 2016 లో ఈ నెట్వర్కు మొదటిసారి ప్రసారం చేయబడింది. బ్రెజిల్‌కు స్వంతమైన రికార్డుకు స్వంతమైన బూమ్ టి.వి, డ్యాప్ కాబో వెర్డే కేప్టెడియా ప్రసారం చేయబడుతున్నాయి.[46] కేప్ వెర్డేలో ఇతర ప్రీమియం ఛానళ్ళు శాటిలైటు నెట్వర్కులో ప్రసారమవుతున్నాయి. ఈ ప్రసారాలు హోటళ్ళు, విల్లాల్లో సాధారణంగా సందర్శినకు అందించబడుతుంటాయి. అయితే ఈ చానెళ్ళ లభ్యత పరిమితంగా ఉంటుంది. వాటిలో ఒకటి ఆర్.డి.పి. ఆఫ్రికా. ఇది పోర్చుగీసు రేడియో స్టేషను ఆర్.డి.పి. ఆఫ్రికన్ వెర్షను.
2017 ఆరంభంలో కేప్ వెర్డను జనాభాలో 19% మందికి క్రియాశీల సెల్యులారు ఫోన్లు ఉన్నాయి. 70% ప్రజలకు ఇంటర్నెట్టు అందుబాటులో ఉంది. 11% ల్యాండు లైను టెలిఫోను సౌకర్యం అందుబాటులో ఉంది. జనాభాలో 2% మందికి స్థానిక కేబులు టీవీ సభ్యత్వం ఉంది. దేశవ్యాప్తంగా 2003 లో కేప్ వర్డెకు 71,700 ల్యాండు లైను టెలిఫోన్లు, 53,300 సెల్యులారు ఫోన్లు ఉన్నాయి.
2004 లో ఏడు రేడియో స్టేషన్లు ఉన్నాయి; 6 ప్రైవేటు, ఒకటి ప్రభుత్వానికి స్వంతమైనది. కపూర్నేడేన్ న్యూస్ ఏజెన్సీ మాధ్యమాన్ని నిర్వహిస్తుంది. స్థానిక రేడియో స్టేషన్లలో రేడియో ప్రయ (కేప్ వెర్డేలో మొదటి రేడియో స్టేషన్), ప్రైయా ఎఫ్.ఎం (దేశంలో మొట్టమొదటి ఎఫ్.ఎం స్టేషను), రాడియో బార్లవెంటో, రేడియో క్లబ్ డూ మిడిలో, రేడియో మొరాబిజా (మిండెలో) ఉన్నాయి.[ఆధారం చూపాలి]
కేప్ వెర్డియన్ ప్రజలు సంగీతం వారికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. మిండిలో కార్నివాల్ వంటి సంబరాలలో సంగీతం బాగా వ్యక్తీకరించబడుతుంది. కేప్ వర్దే సంగీతాన్ని ఆఫ్రికన్, పోర్చుగీసు, బ్రెజిలియన్ సంగీతం ప్రభావితం చేస్తుంది.[47] విషాదంతో కలగలిపిన కేప్ వర్డియన్ క్రియోలు గేయం మోర్నా కేప్ వర్డే తత్వ సహిత జాతీయసంగీతం ప్రత్యేకత సంతరించుకుంది. మోర్నా తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన సంగీత శైలిలో కోలడైరా, తరువాత ఫౌననా, బాటుక్ సంగీతం ప్రాధాన్యత వహిస్తున్నాయి. పాదరక్షలు ధరించకుండా సంగీతప్రదర్శనలు ఇచ్చే సెసారియా ఎవోరా " బేర్ ఫూట్ డైవా "గా గాయనిగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. సెసరియా ఎవోరా అంతర్జాతీయ గుర్తింపు పోర్చుగలు పూర్వీకత కలిగిన ఇతర కేప్ వర్డియన్ కళాకారులకు సంగీత మార్కెట్టులో స్థానం కల్పించింది. దీనికి ఉదాహరణలు గాయకులు సారా తవారెస్, లురా, మేయ్రా ఆండ్రేడ్ ఉన్నారు.
కేప్ వర్డే వరకు సంప్రదాయ సంగీతం మరొక గొప్ప కళాకారిణిగా తన గౌరవార్ధం, Praia నగరంలో కల్చర్ Ildo లోబో హౌస్ అంటారు మధ్యలో 2004 లో ది హౌస్ ఆఫ్ కల్చర్ మరణించిన ఆంటోనియో విన్సెంట్ లోపెసు ట్రావడింహా, ఈడో లోబోగా సుపరిచితం అయింది.
కేప్ వర్డెయన్ తల్లిదండ్రులకు పుట్టిన ప్రసిద్ధ కళాకారులు అంతర్జాతీయ సంగీత ప్రపంచంలో తమను తాము ఉత్తమమైనవారుగా చాటుకున్నారు. వీరిలో జాజ్ పియానిస్ట్ హోరేస్ సిల్వర్, డ్యూక్ ఎలింగ్టన్ సాక్సోఫోన్, వాద్యకారుడు పాల్ గొంసల్వేస్, టోఫిలో చంట్రే, పాల్ పెన, తవారెస్ సోదరులు, గాయకుడు ల్యూరా ఉన్నారు.
కేప్ వర్డే నృత్యాలలో " మొర్నా ", కొలడియారా, జూక్, బటుక్యూ, కాబొ జుక్ ప్రాధానమైనవి.
కేప్ వెర్డియన్ సాహిత్యం లూస్ఫోన్ ఆఫ్రికాలో అత్యంత సుసంపన్న సాహిత్యాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. పాలినో వియీరా, మాన్యువల్ డి నోవాస్, సెర్గియో ఫ్రుస్ని, యుగెనియో తవారెస్, బి. లేజా వంటి ప్రసిద్ధ కవులు ఉన్నారు. కేప్ వర్డేలో బాల్తాసర్ లోపెస్ డా సిల్వా, ఆంటోనియో ఔరీలియో గోకాల్వేవ్స్, మాన్యువల్ లోప్స్, ఓర్లాండ అమరిల్స్, హెన్రిక్ టీసిఇరా డే సొస, అర్మేనియో వియరా, కావవెర్డియాను డంబారా, డాక్టర్ అజాగువా, జర్మన్ అల్మెడా మొదలైన ప్రసిద్ధ రచయితలు ఉన్నారు.
2015 లో కార్నివల్, సావొ వింసెంటో " టచిండాస్ " అనే పేరుతో చిత్రీకరించబడిన డాక్యుమెంటరీ చిత్రం 12 వ ఆఫ్రికా మూవీ అకాడమీ అవార్డుకు నమినేటు చేయబడింది.
కేప్ వర్దే ఆహారంలో అధికంగా చేపలు, మొక్కజొన్న, బియ్యం (ప్రధాన ఆహారం) ప్రాధాన్యత వహిస్తున్నాయి. కూరగాయలు బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, టొమాటోలు, మనియోక్, క్యాబేజీ, కాలే, ఎండిన బీన్సు సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటాయి. అరటి, బొప్పాయి వంటి పండ్లు ఏడాది పొడవునా లభిస్తాయి. అయితే మామిడి, అవకాడొల వంటివి సీజనలో ఉంటాయి.[8]
కేప్ వర్డెలో లభించే ఒక ప్రసిద్ధ వంటకం కాచూపా. ఇది మొక్కజొన్న (హోమినీ), బీన్సు, చేప లేదా మాంసం చేర్చి నెమ్మదిగా వండబడుతుంది. చేపలు లేదా మాంసం చేర్చి వేయించిన పేస్ట్రీ షెల్ పాస్టెల్. సాధారణ ఆకలిని అధికం చేయడానికి ఇది తింటుంటారు.[8]
కేప్ వెర్డే జాతీయ బాస్కెట్ బాల్ జట్టు అత్యంత విజయవంతమైన క్రీడా జట్టు గుర్తించబడుతుంది. ఇది 2007 లో ఎఫ్.ఐ.బి.ఎ. చివరి ఆటలో ఈజిప్టును ఓడించిన తరువాత ఆఫ్రికా ఛాంపియన్షిప్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. స్పెయిన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్ తరపున ఆడిన వాల్టెర్ తవారెస్ దేశంలో అత్యంత ప్రసిద్ధ ఆటగాడుగా గుర్తించబడుతున్నాడు.
కేప్ వర్డే వేవ్ సెయిలింగుకు (విండ్ సర్ఫింగ్ రకం) కైట్‌బోర్డింగ్ ప్రసిద్ధి చెందింది. 2009 పి.డబల్యూ, ఎ. వేవ్ వరల్డ్ చాంపియన్, హవాయి క్రీడాకారుడు జోషి ఆంగులో ద్వీపసమూహాన్ని విండ్సర్ఫింగ్ గమ్యంగా మార్చడానికి చాలా అధికంగా కృషి చేసాడు. కేప్ వర్డే ఇప్పుడు ఆయన దత్తత తీసుకున్న దేశం అయింది. స్థానిక కైట్సర్ఫెరు మిటూ మోంటెరో 2008 కైట్ సర్ఫింగ్ వరల్డ్ చాంపియన్ అయ్యాడు.
కేప్ వెర్డే జాతీయ ఫుట్‌బాల్ జట్టును టబారోస్ అజుయిస్ (బ్లూ షార్క్స్) లేదా క్రియోలస్ (క్రియోల్స్) గా పిలుస్తారు. ఇది ఫెడెరాకావో కాబోవర్డియాన డీ ఫూట్బోలు చేత నియంత్రించబడుతుంది. ఈ జట్టు 2013 - 2015 సంవత్సరాల్లో రెండు ఆఫ్రికా కప్ ఆఫ్ నేషంసులో ఆడింది.[48]
కేప్ వర్డే 1996 నుండి ప్రతి సమ్మర్ ఒలంపిక్సులో పోటీ చేసింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.