1542

From Wikipedia, the free encyclopedia

1542 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1539 1540 1541 - 1542 - 1543 1544 1545
దశాబ్దాలు: 1520 1530లు - 1540లు - 1550లు 1560లు
శతాబ్దాలు: 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం

సంఘటనలు

  • ఫిబ్రవరి 13: ఇంగ్లాండ్‌కు చెందిన హెన్రీ VIII ఐదవ భార్య కేథరీన్ హోవార్డ్ ను వ్యభిచార నేరానికి గాను ఉరితీసారు.
  • ఫిబ్రవరి 14: స్థానిక తెగల నుండి ఎదురైన గట్టి వ్యతిరేకత కారణంగా మూడు విఫల ప్రయత్నాల తరువాత స్పెయిన్ దేశస్థులు మెక్సికోలోని గ్వాడాలజారాను స్థాపించారు.
  • మార్చి 8: పవిత్ర రోమన్ చక్రవర్తి చార్లెస్ V తో చేసే యుద్ధంలో ఒట్టోమన్ల మద్దతు వాగ్దానం తీసుకుని ఫ్రెంచ్ రాయబారి ఆంటోయిన్ ఎస్కాలిన్ డెస్ ఐమార్స్ కాన్స్టాంటినోపుల్ నుండి తిరిగి వస్తాడు.
  • మార్చి: రెనిన్ ప్యాలెస్ తిరుగుబాటు : మింగ్ రాజవంశం ప్యాలెస్ మహిళల బృందం జియాజింగ్ చక్రవర్తిని హత్య చేయడంలో విఫలమైంది. చక్రవర్తి వారిని నెమ్మదిగా ముక్కలు చేయడం ద్వారా చంపించాడు.
  • మే 19: ఆధునిక మధ్య బర్మాలో ప్రోమ్ రాజ్యాన్ని, టాంగూ రాజవంశం జయించింది.
  • సెప్టెంబర్ 28: పోర్చుగీస్ అన్వేషకుడు జువాన్ రోడ్రిగెజ్ కాబ్రిల్లో ప్రస్తుత శాన్ డియాగో బేలో అడుగుపెట్టాడు. అతడు దానికి "శాన్ మిగ్యూల్" అని పేరు పెట్టాడు; ఇది తరువాత శాన్ డియాగో నగరంగా మారుతుంది.
  • అక్టోబర్ 7: కాలిఫోర్నియాలోని శాంటా కాటాలినా ద్వీపంలో అడుగు పెట్టిన మొదటి యూరోపియన్‌గా కాబ్రిల్లో నిలిచాడు.
  • పశ్చిమ దేశాలతో జపాన్ యొక్క మొట్టమొదటి పరిచయం సంభవించింది. ఒక పోర్చుగీస్ ఓడ, చైనాకు వెళ్ళే దారిలో దారితప్పి జపాను చేరినపుడూ, ఫెర్నావో మెండిస్ పింటో, ఫ్రాన్సిస్కో జైమోటో ఆంటోనియో మోటా జపాను భూమిపై అడుగుపెట్టారు. (కొన్ని వర్గాలు 1543 చెబుతున్నాయి).

జననాలు

Thumb
హర్కాబాయి

మరణాలు

పురస్కారాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.