13వ లోక్‌సభ (1999 అక్టోబరు10 – 2004 ఫిబ్రవరి 6) 1999 సాధారణ ఎన్నికల ద్వారా ఏర్పడినది. దీనిలో మెజారిటీ సాధించిన భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని నేషనల్ డెమోక్రెటిక్ అలయన్స్ మెజారిటీ సాధించి అటల్ బిహారీ వాజపేయి సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పరచింది.[1] ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని డెమోక్రటిక్ అలయన్స్ వర్గం 270 సీట్లు గెలుచుకుంది. ఈ సంఖ్య 12 వ లోక్‌సభ కంటే 16 ఎక్కువ. అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్డీఏ కూటమితో ఏర్పడిన ప్రభుత్వం తన పదవీకాలం వచ్చే 14 వ లోక్‌సభకు వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు పూర్తి చేసింది.

Thumb
Barack Obama at Parliament of India in న్యూ డిల్లీ addressing Joint session of both houses 2010

భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభకు చెందిన నలుగురు సిట్టింగ్ సభ్యులు 1999 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత 13 వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.[2]

ముఖ్యమైన సభ్యులు

  • స్పీకరు:
  • డిప్యూటీ స్పీకర్:
    • పి.ఎం.సయీద్ : 1999 అక్టోబరు 27 - 2004 జూన్ 2
  • సెక్రటరీ జనరల్:
    • జి.సి.మల్హోత్రా : 1999 జూలై 14 - 2005 జూలై 28

13వ లోక్‌సభ సభ్యులు

ఎన్నికలో గెలుపొందిన పార్టీల వివరాలు

మరింత సమాచారం క్రమ సంఖ్య, పార్టీ పేరు ...
క్రమ సంఖ్య పార్టీ పేరు సభ్యుల సంఖ్య
1 భారతీయ జనతా పార్టీ (BJP) 180
2 భారత జాతీయ కాంగ్రెస్ (INC) 114
3 సి.పి.ఐ (ఎం) 33
4 తెలుగుదేశం పార్టీ 29
5 సమాజ్ వాదీ పార్టీ (SP) 26
6 జనతాదళ్ (యునైటెడ్) (JD (U) ) 21
7 శివసేన 15
8 బహుజన్ సమాజ్ పార్టీ 14
9 ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) 12
10 ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) 10
11 బిజూ జనతాదళ్ (BJD) 10
12 ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 8
13 నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) 8
14 పట్టలి మక్కల్ కచ్చి (PMK) 8
15 రాష్ట్రీయ జనతాదళ్ 7
16 స్వతంత్రులు 6
17 ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (INLD) 5
18 సి.పి.ఐ 4
19 జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (J&KNC) 4
20 మారుమరల్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) 4
21 రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (RSP) 3
22 అఖిల భారతీయ లోక్ తాంత్రిక్ కాంగ్రెస్ (ABLTC) 2
23 ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ (AIFB) 2
24 ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) 2
25 రాష్ట్రీయ లోక్‌దళ్ 2
26 శిరోమణి అకాలీదళ్ (SAD) 2
27 ఎ.ఐ.ఎం.ఐ.ఎం 1
28 భరిప బహుజన మహాసంఘ (BBM) 1
29 సి.పి.ఐ (ఎం.ఎల్) 1
30 హిమాచల్ వికాస్ కాంగ్రెస్ (HVC) 1
31 జనతాదళ్ (ఎస్) 1
32 కేరళ కాంగ్రెస్ (ఎం) 1
33 ఎం.జి.ఆర్ అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (MADMK) 1
34 మణిపూర్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ (MSCP) 1
35 పీసంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా (PAWPI) 1
36 శిరోమణి అకాలీదళ్ (ఎం) 1
37 సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 1
38 సమాజ్‌వాదీ జనతా పార్టీ (ఆర్) (SJP (R) ) 1
మూసివేయి

మూలాలు

బాహ్య లంకెలు

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.