తెలంగాణ, సిద్దిపేట జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
హుస్నాబాద్ మండలం,తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] ఇది సమీప పట్టణమైన కరీంనగర్ నుండి 40 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం హుస్నాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది. ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. హుస్నాబాద్, ఈ మండలానికి కేంద్రం.
హుస్నాబాద్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18.131331°N 79.206018°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సిద్దిపేట జిల్లా |
మండల కేంద్రం | హుస్నాబాద్ |
గ్రామాలు | 11 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 118 km² (45.6 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 42,696 |
- పురుషులు | 21,441 |
- స్త్రీలు | 21,255 |
పిన్కోడ్ | 505467 |
2011 భారత జనగణన గణాంకాల మండల జనాభా ప్రకారం- మొత్తం 78,793 - పురుషులు 39,593 - స్త్రీలు 39,200. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 118 చ.కి.మీ. కాగా, జనాభా 42,696. జనాభాలో పురుషులు 21,441 కాగా, స్త్రీల సంఖ్య 21,255. మండలంలో 10,886 గృహాలున్నాయి.[3]
లోగడ హుస్నాబాద్ గ్రామం / మండలం కరీంనగర్ జిల్లా,కరీంనగర్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా హుస్నాబాద్ మండలాన్ని (1+10) పదకొండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లా,కొత్తగా ఏర్పడిన హుస్నాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.