హుజూర్‌నగర్ మండలం

తెలంగాణ, సూర్యాపేట జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia

హుజూర్‌నగర్ మండలం

హుజూర్‌నగర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని, సూర్యాపేట జిల్లాకుచెందిన మండలం.[1] హుజూర్‌నగర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 35 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కోదాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మిర్యాలగూడ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 7 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 16.894100°N 79.872226°E /, రాష్ట్రం ...
హుజూర్‌నగర్ మండలం
  మండలం  
Thumb
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16.894100°N 79.872226°E / 16.894100; 79.872226
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సూర్యాపేట జిల్లా
మండల కేంద్రం హుజూర్‌నగర్
గ్రామాలు 7
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 60,426
 - పురుషులు 30,177
 - స్త్రీలు 30,249
అక్షరాస్యత (2011)
 - మొత్తం 61.90%
 - పురుషులు 72.91%
 - స్త్రీలు 50.50%
పిన్‌కోడ్ 508204
మూసివేయి

నల్గొండ జిల్లా నుండి మార్పు

Thumb
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

లోగడ హుజూర్‌నగర్ మండలం,నల్గొండ జిల్లా,మిర్యాలగూడ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా హుజూర్‌నగర్ మండలాన్ని (1+06) ఏడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా, కోదాడ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]

మండల జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 60,426 - పురుషులు 30,177 - స్త్రీలు 30,249

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. మాచవరం
  2. బూరుగడ్డ
  3. లింగగిరి
  4. అమరవరం
  5. లక్కవరం
  6. హుజూర్‌నగర్
  7. ఏపలసింగారం

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.