From Wikipedia, the free encyclopedia
ఫ్లైట్ లెఫ్టినెంట్ హరిత కౌర్ డియోల్ (1972 - డిసెంబరు 25 1996) భారతీయ వాయుసేనలో పైలట్. ఆమె వాయుసేనలోని మొట్టమొదటి మహిళా పైలట్. ఆమె తన ఇరవై రెండవ ఏట 1994 సెప్టెంబరు 2 న మొదటిసారిగా Avro HS-748 విమానాన్ని నడిపింది.[1][2][3][4]
ఆమె చండీఘర్ లోని ఒక సిక్కు కుటుంబానికి చెందినవారు.[1] 1993 లో ఎయిర్ ఫోర్స్ లో మొదటి ఏడుగురు మహిళా కాడెట్స్లో ఒకరిగా, షార్ట్ సర్వీసు కమిషన్ ఆఫీసరుగా ఎంపికైంది. రవాణా పైలట్ గా భారతదేశంలో మహిళా శిక్షణలలో క్లిష్టమైనది.[5] ప్రాథమిక శిక్షణ అనంతరం హైదరాబాదు దగ్గరలో దుండిగల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీలోను, యెలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషను వద్ద ఎయిర్ లిఫ్టింగ్ ఫోర్స్ లోనూ శిక్షణ పొందారు.[6]
ఆమె 1996 డిసెంబరు 25 న నెల్లూరు వద్ద విమాన ప్రమాదంలో మరణించారు.[5] ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో గల బుక్కపురం గ్రామం వద్ద జరిగిన విమాన ప్రమాదంలో ఆమెతో పాటు 24 మంది ఎయిర్ ఫోర్స్ కు చెందిన వ్యక్తులు మరణించారు.[7][8]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.