హన్స్‌రాజ్ భరద్వాజ్ (16 మే 1939 - 8 మార్చి 2020) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పని చేసి 2009 నుంచి 2014 వరకు కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశాడు.
హెచ్. ఆర్. భరద్వాజ్ | |||
పదవీ కాలం 25 జూన్ 2009 – 28 జూన్ 2014 | |||
ముందు | రామేశ్వర్ ఠాకూర్ | ||
---|---|---|---|
తరువాత | వాజుభాయ్ వాలా | ||
పదవీ కాలం 1 మార్చి 2012 – 9 మార్చి 2013 | |||
ముందు | ఎం.ఓ.హెచ్. ఫరూక్ | ||
తరువాత | నిఖిల్ కుమార్ | ||
27వ న్యాయ శాఖ మంత్రి | |||
పదవీ కాలం 22 మే 2004 – 28 మే 2009 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | అరుణ్ జైట్లీ | ||
తరువాత | వీరప్ప మొయిలీ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 16 మే 1939 గహ్రీ సంప్లా కిలోయి, పంజాబ్ , బ్రిటిష్ రాజ్ (ప్రస్తుత హర్యానా , భారతదేశం) | ||
మరణం | 2020 మార్చి 8 80)[1] న్యూఢిల్లీ , భారతదేశం | (వయసు||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
రాజకీయ జీవితం
హన్స్‌రాజ్ భరద్వాజ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1982లో మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికై 1984 డిసెంబర్ 31 నుండి నవంబర్ 1989 వరకు న్యాయ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు. ఆయన 1988లో రెండొవసారి రాజ్యసభకు తిరిగి ఎన్నికై 1991 జూలై 21 నుండి 1992 జూలై 2, 1992 వరకు ప్రణాళిక, కార్యక్రమ అమలు శాఖ మంత్రిగా, 1992 జూలై 3 నుండి మే 1996 వరకు సహాయ మంత్రిగా పని చేసి ఏప్రిల్ 1994 నుండి ఏప్రిల్ 2000 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశాడు.
హన్స్‌రాజ్ భరద్వాజ్ మే 2004 నుండి మే 2009 వరకు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పని చేసి మార్చి 20, 2006న రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యాడు. ఆయన 2009 నుండి 2014 వరకు కర్ణాటక గవర్నర్‌గా, 1 మార్చి 2012 నుండి 9 మార్చి 2013 వరకు కేరళ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు భాద్యతలు నిర్వహించాడు
మరణం
హన్స్‌రాజ్ భరద్వాజ్ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ ఢిల్లీలోని మాక్స్ హాస్పిటల్‌లో చికిత్య పొందుతూ గుండెపోటుతో 2020 మార్చి 8న మరణించాడు.[2]
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.