Remove ads
హిమాచల్ ప్రదేశ్ లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
సోలన్ హిమాచల్ ప్రదేశ్ లోని పట్టణం, సోలన్ జిల్లా ముఖ్య పట్టణం. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని అతిపెద్ద మునిసిపల్ కౌన్సిల్. ఇది రాష్ట్ర రాజధాని సిమ్లాకు దక్షిణాన 45.5 కి.మీ. దూరంలో సముద్ర మట్టం నుండి 1550 మీటర్ల ఎత్తున ఉంది. [1] ఈ ప్రదేశానికి హిందూ దేవత షూలిని దేవి పేరు పెట్టారు. ప్రతి సంవత్సరం జూన్లో, దేవతకు ఉత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా సెంట్రల్ థోడో మైదానంలో 3 రోజుల జాతర జరుగుతుంది. సోలన్ పూర్వపు సంస్థానమైన బాఘాట్^కు రాజధాని. [2]
సోలన్
పుట్టగొడుగుల నగరం | |
---|---|
పట్టణం | |
Nickname: భారతదేశపు పుట్టగొడుగుల నగరం | |
Coordinates: 30.905°N 77.097°E | |
దేశం | India |
రాష్ట్రం | హిమాచల్ ప్రదేశ్ |
జిల్లా | సోలన్ |
Elevation | 1,550 మీ (5,090 అ.) |
జనాభా (2011) | |
• Total | 39,256 |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 173212 |
టెలిఫోన్ కోడ్ | 01792 |
Vehicle registration | HP- HP 14, HP 01S, HP 02S, HP 64, HP 59 |
ఇక్కడ పుట్టగొడుగులను విస్తారంగా పెంచడం వలన సోలన్ను "భారతదేశపు పుట్టగొడుగుల నగరం" అని పిలుస్తారు [3] మష్రూమ్ రీసెర్చ్ డైరెక్టరేట్ (DMR) కూడా ఇక్కడి చంబాఘాట్ లోనే ఉంది.
ఈ ప్రాంతంలో రామములగ కాయలు (టొమాటోలు) ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల సోలన్ ను "ఎర్ర బంగారపు పట్టణం" అని కూడా పిలుస్తారు. [1] నగరం, చండీగఢ్ సిమ్లా నగరాల మధ్య కాల్కా-సిమ్లా జాతీయ రహదారి -22 పై ఉంది. న్యారో గేజ్ కల్కా-సిమ్లా రైల్వే కూడా సోలన్ గుండా వెళుతుంది. పంజాబ్-హిమాచల్ సరిహద్దులో ఉన్న సోలన్, శివాలిక్ కొండలలో ఉంది.
సోలన్లో పురాతన దేవాలయాలు [4] మఠాలూ ఉన్నాయి. [5] దేశంలోని అత్యంత పురాతన సారాయి తయారీ కేంద్రాల్లో ఒకటి ఇక్కడ ఉంది. ఈ నగరంలో కొండపై 300 సంవత్సరాల పురాతన కోట కూడా ఉంది. షూలిని మాత ఆలయం, జటోలి శివాలయం ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలు. ఈ ప్రాంతంలోని అత్యంత ప్రసిద్ధ బౌద్ధ మఠాలలో ఒకటి యుండుంగ్ విహారం.
స్థానిక జానపద కథనాల ప్రకారం, పాండవులు తమ అరణ్యవాస సమయంలో సోలన్ ప్రాంతంలో నివసించారు. [6] 1815 లో బ్రిటిషు వారు గూర్ఖాలను ఓడించి, బాఘట్ రాజ్యాన్ని (ఇప్పుడు సోలన్) గెలుచుకున్నారు. సోలన్ నగరానికి సమీపంలో ఉన్న ఒక పర్వతం మీద ఇప్పటికీ గూర్ఖా కోట లేదా ఆర్కి కోట ఉంది. ఇది సోలన్ యొక్క చారిత్రిక పర్యాటక ఆకర్షణలలో ఒకటి. [7] ఈ పట్టణం బాగట్ సంస్థానానికి రాజధానిగా ఉంది. బాఘట్ అనే పదం బావు లేదా బహు నుండి వచ్చింది, దీని అర్థం "చాలా", ఘాట్ అంటే "కనుమ". ప్రారంభంలో బాఘాట్ సంస్థాన రాజధాని భూచాలి పరగణా లోని భోచ్ వద్ద ఉండేది. సోలన్లో కంటోన్మెంటును నిర్మించిన తరువాత, రాజధానిని ఇక్కడికి మార్చారు. 1902 లో ఇక్కడికి రైలు మార్గం వచ్చింది. [8] సోలన్ నగర పరిణామం ఈ క్రింది క్రమంలో జరిగింది.
సోలన్ పట్టణం 30.92°N 77.12°E నిర్దేశాంకాల వద్ద ఉంది. [9] [10] సముద్ర మట్టం నుండి దీని ఎత్తు 1502 మీటర్లు. 2280 మీటర్ల ఎత్తున ఉన్న కరోల్ పర్వతం అత్యంత ఎతైన ప్రదేశం. పాండవులు తమ 12 సంవత్సరాల అరణ్య వాసంలో ధ్యానం చేశారని నమ్ముతున్న పాండవ గుహ ఈ పర్వత శిఖరం వద్దనే ఉంది. శీతాకాలంలో అప్పుడప్పుడు సోలన్లో మంచు కురుస్తుంది. [11]
చైల్, డగ్షాహి, సబాతు, కందఘాట్, కసౌలి, రాజ్ఘర్, సలోగ్ర, చురీధార్ శిఖరం వంటి దగ్గరి లోని పర్యాటక ప్రదేశాలకు వెళ్ళేందుకు సోలన్ నుండే బయలుదేరుతారు
శీతోష్ణస్థితి డేటా - Solan (1981–2010, extremes 1999–2011) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 27.5 (81.5) |
29.2 (84.6) |
32.5 (90.5) |
35.8 (96.4) |
38.0 (100.4) |
39.0 (102.2) |
35.1 (95.2) |
33.0 (91.4) |
32.0 (89.6) |
31.5 (88.7) |
30.2 (86.4) |
27.0 (80.6) |
39.0 (102.2) |
సగటు అధిక °C (°F) | 18.4 (65.1) |
19.9 (67.8) |
23.8 (74.8) |
29.0 (84.2) |
31.6 (88.9) |
31.2 (88.2) |
28.9 (84.0) |
28.2 (82.8) |
28.0 (82.4) |
27.0 (80.6) |
23.8 (74.8) |
20.7 (69.3) |
25.9 (78.6) |
సగటు అల్ప °C (°F) | 2.5 (36.5) |
4.5 (40.1) |
8.3 (46.9) |
12.6 (54.7) |
16.2 (61.2) |
18.7 (65.7) |
20.2 (68.4) |
19.8 (67.6) |
16.9 (62.4) |
10.5 (50.9) |
5.9 (42.6) |
3.0 (37.4) |
11.6 (52.9) |
అత్యల్ప రికార్డు °C (°F) | −3.6 (25.5) |
−2.8 (27.0) |
1.0 (33.8) |
4.6 (40.3) |
8.5 (47.3) |
12.5 (54.5) |
16.0 (60.8) |
15.0 (59.0) |
10.5 (50.9) |
5.0 (41.0) |
1.0 (33.8) |
−2.5 (27.5) |
−3.6 (25.5) |
సగటు వర్షపాతం mm (inches) | 61.8 (2.43) |
69.9 (2.75) |
74.3 (2.93) |
46.0 (1.81) |
61.5 (2.42) |
118.0 (4.65) |
218.5 (8.60) |
218.9 (8.62) |
138.4 (5.45) |
22.3 (0.88) |
14.9 (0.59) |
47.6 (1.87) |
1,092.1 (43) |
సగటు వర్షపాతపు రోజులు | 3.4 | 4.3 | 4.7 | 3.3 | 4.7 | 6.7 | 11.9 | 10.8 | 5.7 | 1.6 | 1.0 | 2.1 | 60.2 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) | 52 | 49 | 45 | 38 | 37 | 52 | 73 | 78 | 70 | 52 | 49 | 51 | 54 |
Source: India Meteorological Department[12][13] |
సోలన్ లోను, చుట్టుపక్కలా అనేక ఆసక్తికర ప్రదేశాలున్నాయి. [14]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.