From Wikipedia, the free encyclopedia
సొర చేప (ఆంగ్లం: Shark) ప్రమాదకరమైన చేప జాతికి చెందిన జంతువు. ఇవి సెలకీమార్ఫా (Selachimorpha) సూపర్ క్రమానికి చెందిన పూర్తిగా మృదులాస్థి చేపలు. ఇవి ఐదు నుండి ఏడు మొప్ప రంధ్రాలతో శ్వాసిస్తాయి. సొర చేపలకు రక్షణ కోసం చర్మం మీద డెంటికల్స్ ఉంటాయి. వీటి దవడలకు చాలా వరుసలలో పదునైన దంతాలుంటాయి.[1] సొర చేపలు వివిధ పరిమాణాలలో ఉంటాయి. మరుగుజ్జు సొర (Dwarf lanternshark : Etmopterus perryi) లోతైన సముద్రాలలో నివసించే సొర జాతి చేపలు సుమారు 17 సెం.మీ. పొడవు మాత్రమే ఉంటే; తిమింగళపు సొర (Whale shark) చేపలు 12 మీటర్లు పొడవుంటాయి.
అందరికీ తెలిసిన బుల్ సొర (Carcharhinus leucas) చేపలలో చాలా జాతులుంటాయి. ఇవి సముద్రాలలోను, మంచి నీటిలోను, నదీ డెల్టా ప్రాంతాలలోను నివసిస్తాయి.[2]
Seamless Wikipedia browsing. On steroids.