Remove ads
From Wikipedia, the free encyclopedia
సొరకాయ లేదా అనప కాయ లేదా అనగ కాయ.
సొరకాయ | |
---|---|
Green calabash on the vine | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | కుకుర్బిటేల్స్ |
Family: | |
Genus: | |
Species: | లా. వల్గారిస్ |
Binomial name | |
లాజినేరియా వల్గారిస్ (Molina) Standl. | |
సొరకాయ - Lagenaria దీర్ఘకాలంగా సతాయిస్తున్న N.O. కుకుర్బిటేసి..
అనగ వేదకాలమునుండి ఈ దేశమున సాగుచేయబడుచున్న జాతి కూరగాయ!.
సొర కాయ అనుకూల పరిస్థితులలో మిక్కిలి విరివీగా ప్రాకు మోటుజాతి మలితీగలు రెండుగా చీలియుండును. పూవులు బీర పూవులకంటే కొంచెం పెద్దవి. మగ పూవులయందు పుష్పకోశము పొడవుగా ఉండును. ఆకర్షక పత్రములు క్రిందివరకు విడియుండును. తెలుపు, కింజల్కములు అన్నియూ జేరి యుండును. ఆడుపూవున దళవలయమును, పుష్పకోశమును నిడివియైన యండాశయముపై నమరియుండును.
ఇవి అన్ని నేలలయందు పెరుగును. మంచిగా దున్నిన తరువాత సిద్దము చేసిన నేలలో2.5 - 3.5 మీటర్ల గోతులు తీసి వీటిని పెంచవలెను. ఆ గోతులలో పసువుల ఎరువును వేయవలెను.
ఎండిన సొర కాయపై తొడుగును, సొర కాయ బుర్ర అని పిలుస్తారు, దీనిలో నీరు పోసుకొని పొలాలకు తీసుకొని వెళ్ళు అలవాటు ఉంది. అందులో నీరు చల్లగా ఉంటాయి. దీనిని మనము నాచురల్ వాటర్ బాటిల్, నాచురల్ మినీ కూలర్‌గా ఉపయోగించవచ్చు!
గుండ్రని సొర బుర్రలను వీణలుగా కూడా చేయుదురు.
దీనిలో పెద్దగా పోషక విలువలు లేవు, మరియూ ఇది ఆలశ్యముగా జీర్ణమగును. నీరు ఎక్కువ.
సొరకాయ లేదా అనప కాయ లేదా అనగ కాయ. ఆంగ్లములో Bottle gourd - (Lagenaria vulgaris N.O. Cucurbitaceae) అంటాము . అనప వేదకాలమునుండి ఈ దేశమున సాగుచేయబడుచున్న జాతి కూరగాయ!. విటమిన్ - సి, బి.కాంప్లెక్క్ష్, సొరకాయలో లభిస్తాయి . సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, సులువుగా జీర్ణమవుతుంది .డయూరెటిక్ గా పనిజేస్తుంది . ముత్రనాళాల జబ్బులకు ఇది మంచిది . పచ్చిసొరకాయ రసం దాహార్తిని అరికడుతుంది, అలసటను తగ్గిస్తుంది . భౌతిక స్వరూపము సొర కాయ అనుకూల పరిస్థితులలో మిక్కిలి విరివిరిగా ప్రాకు మోటుజాతి . మలితీగలు రెండుగా చీలియుండును. పూవులు బీర పూవులకంటే కొంచెం పెద్దవి. మగ పూవులయందు పుష్పకోశము పొడవుగా ఉండును. ఆకర్షక పత్రములు క్రిందివరకు విడియుండును. తెలుపు, కింజల్కములు అన్నియూ జేరి యుండును. ఆడు పూవున దళవలయమును, పుష్పకోశమును నిడివియైన యండాశయముపై అమరియుండును. సాగు చేయుపద్ధతి ఇవి అన్ని నేలలయందు పెరుగును. మంచిగా దున్నిన తరువాత సిద్దము చేసిన నేలలో2.5 - 3.5 మీటర్ల గోతులు తీసి వీటిని పెంచవలెను. ఆ గోతులలో పసువుల ఎరువును వేయవలెను. విశేషములు ఎండిన సొర కాయపై తొడుగును, సొర కాయ బుర్ర అని పిలుస్తారు, దీనిలో నీరు పోసుకొని పొలాలకు తీసుకొని వెళ్ళు అలవాటు ఉంది. అందులో నీరు చల్లగా ఉంటాయి. దీనిని మనము నాచురల్ వాటర్ బాటిల్, నాచురల్ మినీ కూలర్‌గా ఉపయోగించవచ్చు! గుండ్రని సొర బుర్రలను వీణలుగా కూడా చేయుదురు. పుట్తుక .. చరిత్ర : మానవజాతికి ఏనాడో పరిచయం అయిన అతి ప్రాచీన కూరగాయ సొరకాయ. ఇది పుట్టింది ఆఫ్రికాలో అని చెప్పినప్పటికీ,,, క్రీస్తుపూర్వము 11,000 - 13000 సంవత్సరాల మధ్య పెరూలో తొలిసారి సొరకాయ సాగు జరిగిందని పురాతత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు . పోషకాలు : 100 గ్రాముల పచ్చి సొరకాయలో ...
శక్తి : 12 కిలో కాలరీలు, ప్రోటీన్లు : 0.2 గ్రాములు, కార్బోహైడ్రేట్స్ : 2.5 గ్రాములు, ఫాట్స్ : 0.1 గ్రాములు, విటమిన్ ఎ : పుస్కలముగా, విటమిన్ సి : పుష్కలముగా . ఖనిజలవణాలు : పుష్కలముగా,
వంద గ్రాముల సొరకాయలో కేవలం పదిహేను కెలోరీలు మాత్రమే ఉంటాయి. అలాగే పిండి పదార్థాలు అతి తక్కువగా ఉండడం వల్ల మధుమేహం ఉన్నవారికి ఇది చాలా మంచి ఆహారం. వేసవికాలంలో సొరకాయలో నీటి శాతం ఎక్కువ కాబట్టి డీహైడ్రేషన్ అవకుండా సహాయపడుతుంది. సొరకాయ చెక్కుతో పీచుపదార్థం కూడా లభ్యమవుతుంది. సొరకాయ చెట్టు ఆకులనుంచి తీసిన రసంలో క్యాన్సర్ ను నియంత్రించే క్వెర్సెటిన్, ఆంత్రక్వినోన్ లాంటి ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి.[2]
1. సొరకాయ వడియాలు 2. సొరకాయ పులుసు 3. సొరయాక టమాటో కూర 4. సొరకాయ సాంబారు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.