From Wikipedia, the free encyclopedia
సెయింట్ లూయిస్ (St. Louis) అమెరికా లోని మిస్సోరీ రాష్ట్రంలో ఉన్న స్వతంత్ర్య ప్రతి పత్తి కలిగిన నగరం. సెయింట్ లూయిస్ తూర్పుసరిహద్దులలో మిసిసీపీ నది ఉత్తర, దక్షిణ, పడమట సరిహద్దులలో సెయింట్ లూయిస్ కంట్రీ ఉన్నది . మిస్సోరీ రాష్ట్రంలోనే ఇది పెద్ద నగరపాలిత ప్రాంతం. ఫ్రెంచ్ రాజు నాల్గవ లూయిస్ గౌరవార్ధం నగరానికి ఈ పేరు వచ్చింది. సెయింట్ లూయిస్ ఫ్రెంచ్, జర్మన్ ఆధిక్యతకు పేరు పొందిన నగరం. 1904లో అమెరికా మొదటి సారిగా నిర్వహించిన ఒలింపిక్ పోటీలు ఇక్కడ జరిగాయి. అదే సంవత్సరంలో వరల్డ్ ఫేర్ (ప్రపంచ సంత) ఇక్కడ నిర్వహించారు. ఇవి సెయింట్ లూయిసెన్లు గర్వకారణంగా భావిస్తారు.21వ శతాబ్దంలో ఔషధ, బయోటెక్నాలజీ, ఇతర సైన్సు సంబంధిత పరిశోధనలో సెయింట్ లూయిస్ అభివృద్ధిని సాధించింది.
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
సెయింట్ లూయిస్ నగరానికి చాలా మారుపేర్లు ఉన్నాయి. 'గేట్ వే నగరం' (ముఖద్వార నగరం) . ఇది అమెరికా పడమటి తూర్పు భాగాల మధ్య భాగంలో ఉంది కనుక ఈ పేరు వచ్చింది. ' గేట్ వే టు ది వెస్ట్' ఇది తూర్పు ప్రాంతాలనుండి పశ్చిమ ప్రాంతానికి మిస్సోరీ నది మీదుగా వలస వెళ్ళే ప్రజల వలన వచ్చింది. 'ది మౌండ్ సిటీ' మౌండ్ అంటే కృత్రిమంగా ఏర్పరచిన కొండలు. ఒకప్పుడు నగర సరిహద్దులలో ఇవి ఎక్కువగా వున్నందున ఈ పేరు వచ్చింది. ప్రస్తుతం నగర అభివృద్ధిలో వాటిలో ఎక్కువ భాగం తొలగించబడ్డాయి. 'ది ల్యూ', 'సెయింట్ ల్యూ', 'తూర్పు పశ్చిమ నగరం', 'నదీ నగరం 'లేక 'ది 314' (సెయింట్ లూయిస్ సెంటర్ సంకేత సంఖ్య) ఇవి సెయింట్ లూయిస్‌ను ఇక్కడి ప్రజలు పిలుచుకొనే మారు పేర్లు. విమానాశ్రయ సంకేత నామం ఎస్‌టీ ఎల్ (STL).
ఫ్రెంచివారు ఇక్కడకు రాక పూర్వం 'మిసిసీపియన్ మౌండ్ బిల్డర్స్'నివసించిన ప్రాంతం ఇది. వారు నిర్మించిన మౌండ్స్ (కృత్రిమ కొండలు) అనేకం ప్రస్తుతం నిర్మూలించ బడినా నగరానికి 'మౌండ్ సిటీ'అనే సార్థక నామం మాత్రం మిగిలింది. ఈ నగరం స్థాపించిన శతాబ్దం గడచిన పిమ్మట యురోపియన్ల రాక ఆరంభం అయింది. 1673లో ఫ్రెంచి దేశస్థుల రాక ఆరంభం అయింది. 'లూయిస్ జోలియట్', 'జాక్యూస్ మార్క్వెట్టె' అనే ఇద్దరు ఫ్రెంచి యాత్రీకులు 1673 లో మిసిసీపీ నదీ మార్గం గుండా ప్రయాణించి ఇక్కడకు చేరుకున్నారు. 'లా సెల్లే' తరువాతి 5 సంవత్సరరాల కాలంలో ఈ మొత్తం కొడ్ ప్రాంతాన్ని ఫ్రెంచిదేశం కోసం సంపాదించాడు. అతడు 'లూయిస్ 14'రాజు జ్ఞాపకార్ధం ఆ ప్రదేశానికి' లూయిసియానా'గా నామకరణం చేశాడు. ఫ్రెంచ్ వాళ్ళు ఆ ప్రదేశాన్ని ఇల్లినోయిస్గా కూడా పిలుస్తూ వచ్చారు. ప్రస్తుతం సెయింట్ లూయిస్ ఉన్న ప్రాంతంలో 1699లో మిసిసీపీ నదీతీరంలో 'కహోకియా' (Cahokia) ప్రాంతంలో ఒప్పందం చేసుకొని దానిని అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. తరువాతి కాలంలో 1703 లో జరిగిన ఒప్పందంలో 'కాస్‌కాస్‌కియా' (Kaskaskia) నదీ దిగువభాగంలో జరిగిన ఒప్పందం తరువాత కాథలిక్ ప్రీస్టులు ప్రస్తుతం సెయింట్ లూయిస్ ప్రాంతంలో చిన్న మిషనరీని స్థాపించారు. తరువాతి కాలంలో దానిని మిసిసీపీ అవతలి తీరానికి మార్చారు.
1763లో 'పియరే లాక్లేడే'అతని తమ్ముడు 'అగస్టే చౌట్యూ'కొంతమంది ఒప్పంద పనిమనుషులను తీసుకొని మిస్సోరీ నదిగుండా ప్రయాణిస్తూ నది దుగువ భాగానికి వచ్చి ఇక్కడ ట్రేడ్ పోస్ట్ (వ్యాపారకూడలి) స్థాపించాడు. తరువాత నవంబరులో కొంచం దిగువ భా గానికి ప్రయాణించి నది తీరంలో ఉన్న 40 అడుగుల ఎత్తైన రాళ్ళు ఉన్న ప్రదేశాన్ని చూసి అది చలికాలం కావడంతో తిరిగి ట్రేడ్ పోస్టుకు వచ్చారు. తరువాతి ఫిబ్రవరి కాలంలో 'చౌట్యూ'30 మంది మనుషులను పంపించి నిర్మాణాలను ప్రారభించి న్యూఆర్లాండ్‌ను అనుకరిస్తూ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభించారు. నదీ తీరాలలో జరిగిన అనేక ఒప్పందాల్తో అభివృద్ధి చెందిన నగరం కనుక ఇది నదీ నగరం. నగర ఆర్థికాభివృద్ధి నదితో ముడిపడి ఉంది.ఇక్కడి నదీతీరంలోని మెత్తని రాళ్ళు ఏటవాలుగా చెక్కి సరుకు ఎగుమతి, దిగుమతులకు అనుకూలంగా చేయడం వలన న్యూఆర్లిన్ నుండి సరుకులు ఉత్తర భాగానికి చేరవేయడానికి సెయింట్ లూయిస్ ప్రధాన కేంద్రం అయింది.
1763లో జరిగిన 'ట్రీటీ ఆఫ్ పారిస్'ఒప్పందం మిస్సోరీ తూర్పు తీర భాగాం బ్రిటన్‌కు చేరింది.కరోన్డ్‌లెట్, ఫ్లొరి సెంట్, పోర్టేజ్ డిసియోక్స్ ప్రాంతాలకు వెళ్ళారు.ప్రస్తుతం ఇవి సెయింట్ లూయిస్‌లో ఒక భాగం.1765 లో సెయింట్ లూయిస్ ఉప్పర్ లూసియానా రాజధాని అయింది.1766 నుండి 1788 వరకు
సెయింట్ లూయిస్ ప్రజలచే ఎన్నుకొనబడిన ఫ్రెంచ్ లెఫ్టెనెంట్ పాలనలో ఉంది.తరువాతి కాలంలో ఇది ఫ్రెంచ్ గవర్నర్ల పాలనలో ఉంది.1880 లో ఇది రహస్యంగా తిరిగి ఫ్రెంచ్ దేశానికి ఇవ్వబడింది.1803లో ప్రెసిడెంట్ థామస్ జఫర్సన్ ఆధ్వర్యంలో ఇది అమెరికాచే కోరబడింది. స్పైన్ నుండి అధికారం బదిలీ చేయడం ఒక ఉత్సవంలా చేసారు.1804 మార్చి8 న జరిగిన ఆ ఉత్సవాన్ని 'త్రీ ఫ్లాగ్స్ డే' (3 జండాల రోజు) గా అభివర్ణిస్తారు. అందుకు కారణం ముందుగా స్పెయిన్
జండాను దించి ఫ్రెంచ్ జండాను పైకెత్తారు. రెండు రోజుల తరువాత మార్చి 10వ తారీఖున ఫ్రెంచ్ జండాను దించి అమెరికా జండాను పైకెత్తారు. తర్వాతి కాలంలో ఫ్రెంచ్ దేశస్తులు అక్కడే ఉన్నారు.ఆ కారణంగా 1820 వరకూ ఫ్రెంచ్ వ్రాయనూ , చదవనూ తెలిసిన ప్రజలు అధికంగా ఉన్న నగరం సెయింట్ లూయిస్.1809 నవంబరు 9 న సెయింట్ లూయిస్ కార్పొరేషన్ గా మారింది.
1817 జూలై 27 సెయింట్ లూయిస్‌లో జెబులన్ మిస్టర్ పైక్ రాకతో స్టీమ్‌బోట్‌ల శకం ఆరంభం అయింది.నదీ వాణిజ్యం ఈ కారణంగా చెప్పుకోదగిన అభివృద్ధి చెందింది. స్టీమ్ బోట్లు నది పైభాగానికి కూడా సులువుగా పోవడంతో రవాణా బాగా అభివృద్ధి చెందసాగింది.సెయింట్ లూయిస్ నుండి ఉత్తర అమెరికా దూరతీరాలకు
సరుకు రవాణా చేయడానికి వీలుకలగడంతో సెయింట్ లూయిస్ అతి శీఘ్రగతిన అభివృద్ధి చెందింది.1830 నాటికి ఒకే సమయంలో సెయింట్ లూయిస్ రేవులో 150 స్టీమ్‌బోట్లు నిలవడం సాధారణం అయింది.1830 నాటికి అమెరికాలో సెయింట్ లూయిస్ పెద్దనగరాలలో ఒకటైంది.సెయింట్ లూయిస్ రేవు న్యూయార్క్ తరువాతి స్థానానికి చేరింది.
1840 లో జర్మనీ, బొహిమియా, ఇటలీ, ఐర్లాండ్ నుండి ప్రజలు సెయింట్ లూయిస్‌కు వలస రావడం ప్రారంభించారు.ఈ నగరం పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో ఐరిష్‌లో సంభవించిన ఘోరమైన కరువు (పొటాటో ఫామైనె) కారణంగా బ్రతుకు తెరువు వెతుక్కుంటూ ఇక్కడ్కు వచ్చి చేరిన వారి తో నగరం శీఘ్ర గతిన అభివృద్ధి చెందసాగింది.1840 నుండి 1860 నాటికి నగర జనాభా 20 వేలనుండి 77,860 కి చేరింది.అదే సమయంలో ప్రయాణ వసతులలో వచ్చిన మార్పులు నగరానికి కొత్త నివాసితులను విస్తారంగా తీసుకు వచ్చింది.1843 నుండి సెయింట్ లూయిస్లో ఆమనీ బస్సులు తమ సర్వీసులను ఆరంభించాయి.
1859 లో మొదటి స్ట్రీట్ కార్ మార్గం వేశారు.
1846లో సెయింట్ లూయిస్ నగరం రెండు ఘోర ప్రకృతి విపత్తులను చవి చూసింది. నగరంలో కలరా వ్యాధి ప్రబలి నగర జనాభాలో 10% ప్రజలను బలి తీసుకుంది.
అదే సంవత్సరం జరిగిన అగ్ని ప్రమాదం అనేక స్టీమ్‌బోట్లను దగ్ధం చేయడమే కాక నగరంలోని చాలా భాగాన్ని బూడిదగా మార్చింది. ఈ ప్రమాదం రాజకీయంగా కూడా మార్పులను తీసుకు వచ్చింది. నగర పునర్నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభం అయింది. ప్రజావసరాలు అభివృద్ధి కాసాగాయి.అగ్ని ప్రమాదం కారణంగా ఇటుకలు, రాళ్ళు మొదలైనవి నిర్మాణంలో చోటు చేసుకున్నాయి.
19 శతాబ్దంలో మిసిసీపీ నది రెండవ కాలువ నిర్మాణం జరిగింది.'సివిల్ వార్' సమయంలో మిసిసీపీ వస్తు రవాణా వ్యాపారం యుద్ధం కారణంగా తగ్గుముఖం పట్టింది.యూనియన్ సైన్యం మిసిసీపీ పై వ్యాపారాన్ని అడ్డగించింది.యుద్ధం జ్జరిగినంత సమయం ఈ నిషేధం కొనసాగింది.మిస్సోరీ ఆఖరి వరకు యూనియన్ దళాలకు విశ్వాసంగా నిలబడింది.యుద్ధసమయంలో ఇక్కడ యుద్ధ నౌకల నిర్మాణం జరిగింది.తరువాతి కాలంలో 20 వ శతాబ్దం వరకు ఇక్కడ నౌకానిర్మాణం కొనసాగింది.1874లో మొట్టమొదటి రోడ్డు మార్గం, రైల్ మార్గం 'ఈడ్స్ బ్రిడ్జ్' (వంతెన) మిసిసీపీ నదిపై నిర్మించబడింది.
1876 ఆగస్టు 26న సెయింట్ లూయిస్ కంట్రీ నుండి విడివడి సెయింట్ లూయిస్ నగరం స్వతంత్ర నగరంగా అవతరించింది.19 నుండి 20 వ శతాబ్ధాల మధ్య నగరం విస్తరించడమే కాక ఆర్థికంగా బలం పుంజుకుంది .అనేకమంది ప్రముఖులకు , రచయితలకు, పారిశ్రామిక వేత్తలకు ఇది కేంద్రం అయింది.ఇక్కడ స్థాపించిన బాస్ ఎరా ఆటోమొబైల్ పరిశ్రమ స్థాపించబడి తక్కువ ధరకు వాహనాలను అందించి విజయం సాధించింది. అయితే ఆ కంపెనీ చాలారోజులు అదే పేరుతో కొనసాగలేదు.
సెయింట్ లూయిస్ లో మొదటి ఆకాశహర్మ్యం నిర్మించబడింది. చెస్ట్‌నట్ వీధిలో ఉన్న 10 అంతస్తుల ఈ భవనంలో ప్రస్తుతం మిస్సోరీ ప్రభుత్వ కార్యాలయం పనిచేస్తుంది.1892లో ఇది 'లూయిస్ సుల్లివన్'చే రూపకల్పన చేయబడింది.1893లో 'నికోలా టెస్లా' మొట్టమొదటి ఆకాశవాణి ప్రసంగం వినిపించాడు.
సెయింట్ లూయిస్ తూర్పు తీరంలో 1892లో టొర్నాడో ఒక మైలు వెడల్పున నగరాన్ని ధ్వంసం చేసి నగరానికి విపరీతమైన నష్టం కలిగించింది.ఈ తుఫాను
ఇళ్ళు, ఆసుపత్రులు, పాఠశాలలు, సెలూన్స్ (మంగలి షాప్), పార్కులు, చర్చి లు, పారిశ్రామిక నిర్మాణాలు, రైలు మార్గాలు తీవ్రంగా ధ్వంసం అయినాయి. $2.9 మిలియన్ల డాలర్ల నష్టాన్ని కలిగించిన ఈ తుఫాను అమెరికా చరిత్ర్లో ఖరీదైన టొర్నాడో (సుడిగాలి).ఈ ప్రమాదంలో 255 మంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు.1927లో వచ్చిన టొర్నాడో (సుడిగాలి) లో చనిపోయినవారు 79 మంది , గాయ పడిన వా రు 550 మంది,1959లో వచ్చిన టొర్నాడోలో చనిపోయినవారు 21 గాయపడినవారు 345.
1916 లో ఎన్నికైన రాష్ట్ర సెనేటర్ 40 సంత్సరాల కాలం నిరంతరంగా విధులు నిర్వహించారు.రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నిభందనలు కొంచం సడలింపబడి నందువలన అమెరికఆఫ్రికనులను రక్షణరంగంలో పనిలో అనుమతించారు.ఈ విధంగా 16,000 మందికి జీవనోపాధి లభించింది.దక్షిణ ప్రాంతం నుండి శ్వేతజాతీయులను పనికోసం తీసుకురావడం తగ్గుముఖం పట్టింది.హక్కుల కోసం జరిగిన పోరాటం తరువాత భూమి హక్కు అందరికీ సమంగా లభించింది.
20 వశతాబ్దంలో నగరం పారిశ్రామికంగా అభివృద్ధిని సాధించింది.1950 నాటికి నగరంలోని జనసంఖ్య శిఖరాలను తాకింది.ప్రయాణ రద్దీని తగ్గించడానికి ఇంటర్‌స్టేట్ హైవే నిర్మాణం చేపట్టారు.
సెయింట్ లూయిస్ వైశాల్యం 62.2 చదరపు మైళ్ళు.61.9 చదరపు మైళ్ళు భూభాగం,4.2 చదరపు మైళ్ళు జలభాగాం.మిస్సోరీ దక్షిణతీరంలో మిసిసీపీ నదీతీరంలోెత్తైన ప్రదేశంలో నగర నిర్మాణం జరిగింది.అధిక భాగం వ్యవసాయ భూమి.భూమి మైద్దానాలతో, విశాలమైన చిన్నచిన్న కొండలతో ఉంటుంది.అధిక శాతం రాతినేలలతో అనేక గుహలతో నిండి ఉంటుంది.బొగ్గు, ఇటుకమట్టి మొదలైన గనులు ఉన్నాయి.ఇక్కడ ఉన్న లైమ్‌స్టోన్ ఇక్కడి నిర్మాణానికి ఎంతో ఊపకరించింది.
సెయింట్ లూయిస్ కెనడాదేశ శీతల గాలులు, నగరానికి సరిహద్దులలో ఉన్న రెండు నదుల కారణంగా ఆహ్లాదకారమైన తడి (హ్యూమిడిటీ) శాతం గాలులు ఉంటాయి.సంవత్సరంలో 48 రోజులపాటు హిమపాతం ఉంటుంది.వసంత కాలంలో ఈదురు గాలులు అధికం.సెయింట్ లూయిస్ 'టొర్నాడో 'లను ఎక్కువ మార్లు ఎదుర్కొంది.
నగరాన్ని స్థాపించడానికి ముందు ఇది అరణ్యాలతోనూ మైదానాలతోనూ ఈ ప్రదేశం నిండి ఉంది.ఈ ప్రదేశంలో ఓఖ్ మాపుల్, హికారీ వృక్షాలు అధికం.
ఈస్టర్న్ రెడ్ రెడ్‌బడ్, సర్వీస్ బెర్రీ, ఫ్లవరింఘ్ డాగ్‌వుడ్ చెట్లూ ఉన్నాయి.నగరంలో స్థానికంగా వృక్షాలను ఎక్కువగా నాటబడ్డాయి.ఆకురాలుకాలంలో సమీపంలో రక్షిత వనాలలో కలరింగ్ (రంగు రంగుల ఆకులతో ఉండే వృక్షాలు) ప్రత్యేక ఆకర్షణ.
ఇక్కడ తూర్పుదేశాల ఉడుత, తెల్ల తోక జింక, కాట్టన్ టైల్ (పత్తి తోక) కుందేలు మొదలైనవి విస్తారంగా ఉండేవి.కెనడా గూస్ (బాతు, మల్లార్డ్ డక్ (బాతు), నీటి పక్షులు అధికంగా ఉన్నాయి.గడ్డలు, పిచ్చుకలు కూడా అధికం .
లేడీ బగ్, దోమలు, ఈగలు సహజంగా అన్ని ప్రాంతాలలో ఉంటాయి ఈ కారణంగా కిటికీలకు తెరలను వేసి ఉంచుతారు.తేనెటీగలు, వృక్షఆధారిత కీటకాలు అధికం.
సెయింట్ లూయిస్ 79 నగర ప్రాంతాలుగా విభజింపబడ్డాయి.ఇవి అధికారపూర్వ విభజన కాకున్నా ఇక్కడి అసోసేషన్లకు ఆర్థిక పరమైన గ్రాంటులేకాక వాటిని అభివృద్ధి పరచడంలో సంపూర్ణ అధికారాలూ ఉన్నాయి.అంతే కాక ఈ నగర ప్రాంతాల సాఘిక, రాజకీయ పలుకుబడి బలమైనది.కొన్నిఅవెన్యూలలో 1904లో జరిగిన ప్రపంచ వస్తుప్రదర్శన (వరల్డ్ ఫెయిర్) సందర్భంలో కట్టిన ఆకర్షణీయమైన సంప్రదాయక రాసౌధల నిర్మాణశైలిలో నిర్మించిన భవనాలు ఉన్నాయి.మగిలినవి శ్రామికులకోసం నిర్మించిన చిన్న చిన్న భవనాలు.ఇవి సంప్రదాయక సమూహాలను ఇప్పటికీ ఆకర్షిస్తున్నాయి.
వాటిలో సపరిచితమైన, కళాత్మమైన ప్రజలు ఎక్కువగా సంద్ర్శించే ప్రాంతాలు డౌన్‌టౌన్, మిడ్‌టౌన్, బెంటన్ పార్క్, కరోండ్‌లెట్, మధ్య పడమటి ప్రాంతం, క్లేటన్/టామ్ (డాగ్‌టౌన్), డచ్‌టౌన్ సౌత్, ఫారెస్ట్ పార్క్ సౌత్‌ఈస్ట్, గ్రాండ్ సెంటర్, ది హిల్, లాఫెట్టే స్క్వైర్, లాసెల్లే పార్క్, ఓల్డ్ నార్త్ లూయిస్, కాంప్టన్ హైట్స్, హెన్రీ షా జ్ఞాపకార్ధం నామాంతరం చెందిన 'షా', సౌత్ హాప్టన్, సౌత్ ఈస్ట్ గార్డెన్, మాడ్రి గ్రాస్ ఫెశ్టివల్కు వేదిక అయిన సౌ లార్డ్, టవర్ గ్రోవ్ ఈస్ట్, టవ్ర్ గ్రోవ్ సౌత్, అనేక పెద్ద మాన్‌షన్ (పురుషుల వసతి గృహం) లు ఉన్నహార్టెన్స్, హోల్య్ హిల్స్, సెయింట్ లూయిస్ హిల్ల్స్, వైడౌన్/స్కిన్‌కర్.
2006-2007 లో నగరప్రాంతలలో సాధించిన అభివృద్ధికి గుర్తింపుగా 'వరల్డ్ లీడర్ షిప్ అవార్డ్ 'అందుకుంది.ఈ అవార్డ్ అందుకున్న తరువాత నగరవాసుల జీవన ప్రమాణంలో సాధించిన అభివృద్ధికి సెయింట్ లూయిస్ అంతర్జాతీయ గుర్తింపుని పొందింది.
సెయింట్ లూయిస్ నగరంలో అనేక మ్యూజియములు ఉన్నాయి.నగరంలోని ప్రీమియర్ పార్క్‌లో సెయింట్ లూయిస్ ఆర్ట్ మ్యూజియం ఉంది.ఫారెస్ట్ పార్క్,1904 లో ఇక్కడ నిర్వహించిన అంతర్జాతీయ వస్తుప్రదర్శన సందర్భంగా గృహాల వరసలు ఆధునిక, ప్రాచీన కళారీతుల చిత్రాలతో ఇప్పటికీ సందర్శకులను ఆకర్షించడం విశేషం.వీటిలో అంతర్జాతీయ ప్రఖ్యాతి చెందిన రెమ్‌బ్రెన్ట్, వాన్‌గోఘ్, పిసారో, పికాసో చిత్రాలూ చోటు చేసుకోవడం విశేషం. సెయింట్ లూయిస్ 'ఫారెస్ట్ పార్క్' న్యూయార్క్ లో ఉన్న 'సెంట్రల్ పార్క్' కంటే పెద్దది.ఇక్కడి సిటీ మ్యూజియంలో పలు ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి.కృత్రిమ గుహలు, ఆట స్థలాలు మొదలై వాటితో నూతన కళాకారుల కూటమికి అనువైన ప్రదేశంగా ఇది ఉపయోగ పడుతుంది.గ్రాండ్ సెంటర్ లో ప్రిత్జకర్ ప్రైజ్ (బహుమతి) ని పొందిన నిర్మాణ రూపశిల్పి 'టడాయో ఆండో'రూపకల్పనలో నిర్మించిన అంతర్జాతీయ ఖ్యాతి చెందిన 'పల్ట్జర్ ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్' భవనంలో ఉన్న కళల శిక్షణాలయం, సెయింట్ లూయిస్ డౌన్‌టౌన్‌లో ఉన్న ప్రఖ్యాత బాలల సాహిత్య రచయిత జ్ఞాపకార్ధం మ్యూజియంగా మార్చబడిన 'యూజెనే ఫీల్డ్'నివసించిన ఇల్లు, ఈ ఇంటిని రచయిత జ్ఞాపకచిహ్నంగా మార్చారు.'మిస్సోరీ హిస్టరీ మ్యూజియం'వస్తు ప్రదర్శన మాత్రమే కాక ఇతర చారిత్రక ప్రదర్శనలను నిర్వహిస్తారు.'వరల్డ్ ఫెయిర్', క్లర్క్ నౌకా యాత్ర, లూయిసియానా కొనుగోలు లాంటి చారిత్రక విషయాలకు సంబంధించిన ప్రదర్శనలు జరుగుతుంటాయి. స్థానికులచే ఫాక్స్ ది ఫాక్స్ దియేటర్ అని అభిమాంగా పిలవబడే ఈ దియేటర్, ఆధినిక హోటల్స్, ఆకర్షణీయమైన సరికొత్త షాపు (అంగడి) లతో 'సెయింట్ లూయిస్ యూనియన్ స్టేషను, కూడా పర్యాటక ఆకర్షణలలో ఒకటి.
కారణమైనవి.
నగరంలో ప్రభుత్వపర్యవేక్షణలో 105 పార్కులు ఉన్నాయి.అవి సమీప ప్రజలకు కూడలి ప్రదేశాలుగానూ,పుల్లలకు ఆటస్థలాలుగానూ,సమ్మర్ కసర్ట్(సంగీత కార్యక్రమాలకు)వేదికలుగానూ,టెన్నిసు, బేస్ బాలు శిక్షణా కేంద్రాలుగానూ ఉపకరిస్తున్నాయి.
ఇందులో అనేక ప్రత్యేక ఆకర్షణలూ చోటుచేసుకున్నాయి.వాటిలో కొన్ని.
1803 నుండి 1890 మధ్య దేశం పడమటి దిశగా విస్తరించడాన్ని గుర్తుచేస్తూ ఉంది.పార్క మధ్య భాగంలో ఉన్న స్టైన్ లెస్ స్టీల్ ఆర్చ్ ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపు.965 అక్టోబర్ 28 పూర్తి చేయబడిన ఈ నిర్మాణం ప్రఖ్యాత భవనిర్మాణ నిపుణుడు ఎయిరో సారినెన్ రూపకల్పన చేసారు.అమెరికాలోని మానవనిర్మాణాలలో ఇది ఎత్తైన జ్ఞాపక చిహ్నం.ఆర్చ్ దిగువ భాగంలో ఉన్న వెస్ట్‌వార్డ్ ఎక్స్‌పెన్‌షన్ లో విస్తారమైన కళాచిహ్నాలతో వేలాది 19 వ శతాబ్దం నుండి ఇక్కడ నివసించి స్థిరపడిన దేశం పడమటి భాగాలలో ప్రముఖుల వివరాలు భద్రపరచబడ్డాయి.సమీపంలో ఉన్న పాత కోర్ట్ భవనం 1839 నుండి ఉన్న నగరంలోని పురాతన భవనాలలో ఒకటి.సెయింట్ లూయిస్ సంత, జూలై 4 సంబరాలు ఈ పార్కులో చోటుచేసుకోవడం విశేషం.
ఈ సంగీతబృందం ప్రపంచంలోనే ప్రధాన సంగీత పురస్కారంగా గుర్తింపు పొందిన గ్రామీ అవార్డుకు 56 మార్లు ప్రతిపాదించబడి ఆరుమార్లు పురస్కారాన్ని అందుకుంది.
కేంద్రమై సెయింట్ లూయిస్‌లో ప్రాముఖ్యత కలిగిన దియేటర్లలో ఒకటిగా పేరుతెచ్చుకుంది.
సెయింట్ లూయిస్ కేమ్పస్ సమీపంలో తన కొత్త కార్యాలయాం కట్టడానికి సన్నాహాలు చేస్తుంది.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నివాసగృహాలకు ఏర్పడిన కొరత కారణాంగా ప్రజలు నగరానికి వెలుపలి ప్రాంతాలలో నివాసాలు ఏర్పరచుకొని తరలి వెళ్ళసాగారు. ముఖ్యంగా శ్వేతజాతీయులు నగరం వెలుపలి ప్రాంతాలకు ఎక్కువగా తరలి వెళ్ళారు.ఈ కారణంగా నగర జనాభా 1950 నుండి 2000 నాటికి సగభాగం అయింది.
1980లో8,56,796 గా ఉన్న జనసంఖ్య 2000 నాటికి 348,189 గా క్షీణించింది.అయినప్పటికీ ప్రస్తుతం నగర జనాభా క్రమంగా అభివృద్ధి కాసాగింది.
2000 జనాభా లెక్కలననుసరించి నగర జనసంఖ్య 3,48,189.నివాసిత గృహాలు 1,47,076, నగరంలో నివసిస్తున్న కుటుంబాల సంఖ్య 76,920.ఒక చదరపు మైలు జన సాంద్రత 5,622.9.ఒక చదరపు మైలు నివాస గృహాల సాంద్రత 2,847.9.నగరంలోని నివాస గృహ సమూహాలు 176, అమెరికన్ ఆఫ్రికన్లు 354.51.20%, శ్వేతజాతీయులు 43.85%, ఆసియన్లు 1.89%, స్థానిక అమెరికన్లు 0.27%, పసిఫిక్ ఐలాండర్లు 0.03%'ఇతర సంప్రదాయుకులు 0.08%, మిశ్రిత జాతీయులు 1.88%.హిస్పానికులు లేక లాటిన్లు 2.02%.నగర ఉత్తర భాగంలో అమెరికన్ ఆఫ్రికన్లు అధికం.దక్షిణ ప్రాంతంలో యురోపియన్ అమెరికన్లు అధికం.1990 నుండి 35,000 - 45,000 బోస్నియన్లు ఇక్కాడకు వలస వచ్చి స్థిరపడ్డారని అంచనా.
నగరంలో నివసిస్తున్న 147,076 కుటుంబాలలో 18 వయసు పిల్లలు నివసిస్తున్న కుటుంబాలు 25.4%, వివాహం చేసుకొని ఒకటిగా జీవిస్తున్న జంటలు 26.2%, స్త్రీలు మాత్రమే ఒంటరిగా నిర్వహిస్తున్న కుటుంబాలు 21.3%.కుటుంబాలు కాకున్నా ఒకటిగా నివసిస్తున్నా వారు47.7%.40.3% ఏకాంత వాసులు.65 వయసు పైబడి ఓంటరిగా నివసిస్తున్నవారు 12.9%.సరాసరి గృహ సభ్యులు 2.30.సరాసరి కుటుంబ సభ్యులు 3.9.
జనాభాలో యువత 18 వ్యసు లోపు వారు 25.7%,18 నుండి 24 వయసు వారు 10.6%,25 నుండి 44 వయసు వారు 30.9%,45 నుండి 64 వయసు వారు 19.1%,65 వయసు పైబడిన వారు13.7%.సరాసరి వివాహ వయసు 34.ప్రతి 100 మంది స్త్రీలకు పురుషులు 88.6.18 వయసున్న ప్రతి 100 మంది స్త్రీలకు 84.2 పురుషులు.
గృహ సరాసరి ఆదాయం $29,156, సరాసరి కుటుంబ ఆదాయం $32,585, పురుషుల సరాసరి ఆదాయం $31,106, స్త్రీల సరాసరి ఆదాయం $26,987,
తసరి ఆదాయం $18,108.
సెయింట్ లూయిస్ ప్రభుత్వం మేయర్-కౌన్సిల్ పద్ధతి ప్రభుత్వం.బోర్డ్‌ఆఫ్ ఆల్డర్‌మెన్, మేయరులు నగర పాలన భాత్యతలు నిర్వహిస్తారు.28 వార్డ్ మెంబర్స్ కలసి ఒక బోర్డ్ మెంబర్ని ఎన్నుకుంటారు.నగర మంతటి నుండి ఎన్నుకొనబడిన స్వతంత్ర అధికారుల సహాయంతో మేయ్‌ర్‌చే మరికొన్ని విశేష బాధ్యతలు
నిర్వహించ బడతాయి.నిధి, ఆర్థిక వ్యహారాలు, పన్ను వసూలు మొదలైన బాధ్యతలు వీటిలో చేరుతాయి.ఆల్డర్‌మెన్ వాడుల మంచి చెడ్డలు చూస్తుంటాడు.
అమెరికా ప్రెసిదెంట్ ఎన్నిక తరువాత మేయర్ ఎన్నిక మార్చిలోనూ, జనరల్ ఎన్నికలు ఏప్రిల్ లోనూ జరుగుతాయి.సెయింట్ లూయిస్ మునిసిపల్ ఎన్నికలలో
డెమాక్రట్లదే పై చేయి.1949 నుండి ఇక్కడ రిపబ్లికన్ మేయర్‌గా ఎన్నుకొన బడలేదు.28 ఆల్డర్మెన్ లలో 27 సభ్యులు డెమాక్క్రటిక్సే.
సెయింట్ లూయిస్ నగరంలో నేరాలు అత్యధికం.అమెరికాలో అత్యధికంగా నేరాలు జరిగే నగరాలలో మొదటి 10 స్థానాలలో సెయింట్ లూయిస్‌కూ స్థానం ఉంది. 2005 ఎఫ్‌బిఐ (FBI) లెక్కలను అనుసరించి సెయింట్ లూయిస్ నేరాలస్థాయి మూడవ స్థానంలో ఉన్నట్లు ప్రకటించింది.2005 లో సెయింట్ లూయిస్ జరిగిన హత్యలు 25 వేలు. అత్యంత ప్రమాదకర నగరంగా మొదటి స్థానం ఉన్న సెయింట్ లూయిస్ మూడవ స్థానానికి వచ్చింది .2006లో నేరాలు పెరగంతో నగరం మరలా రెండవ స్థానానికి చేరుకుని అత్యంత అమెరికాలోనే ప్రమాదకర నగరంగా గుర్తించ బడింది.2007 నాటికి 15.6% నేరాలు తగ్గటంతో సెయింట్ లూయిస్ నేరాల స్థాయి 35 సంవత్సరాల తక్కువ స్థాయికి చేరుకుంది.కానీ కుటుంబ హత్యలు (హోమీ సైడ్)7 నుండి 138 కి చేరింది.ఈ వివరాలు సెయింట్ లూయిస్ నగరం ఎక్కువ నేరాలు జరుగుతున్న ప్రదేశంగా చెప్తున్నాయి.నేరలను ఇలా వివరించి స్థాయిని నిర్ణయించడాన్ని ఎఫ్‌బిఐ (FBI, నేరపరిశోదక సంస్థల మధ్య వివాదాస్పదమైంది.నగరాల మధ్య నేరాల స్థాయి నిర్ణయించడం కష్టమని వారి అభిప్రాయం.
నగరంలో ప్రయాణ వసతుల్లో ప్రధానమైంది ఆటోమొబైల్స్.ఈ కారణంగా నగరంలో అనేక ఇంటర్‌స్టేట్ ఫ్రీవే (రహదార్లు) లు ఉన్నాయి.అవి వరసగా ఐ-70, ఐ-55, ఐ-44, ఐ-64, ఐ-225, ఐ-170 మరియుఐ -270.అవే కాక రాష్ట్ర ప్రభుత్వ, కౌంటీ (సామంత రాజ్యం) రోడ్డు మార్గాలు ఉన్నాయి.2006 వరకు చాలా అద్వానంగా ఉన్నాయని పేరుపొందిన సెయింట్ లూయిస్ రోడ్డుమార్గాలు 2008 నాటికి అభివృద్ధి దశకు వచ్చాయి.2006-2007ల మధ్య కొన్ని సెయింట్ లూయిస్ రోడ్డుమార్గాలు పునర్నించబడ్డాయి.
సెయింట్ లూయిస్‌కు స్వంతమైన 'లాబర్ట్ సెయింట్ లూయిస్ ఇంటర్ నేషనల్ విమానాశ్రయం' సెయింట్ లూయిస్ కౌంటీ వాయవ్యంలో ఉంది.అమెరికన్ ఎయిర్‌లైన్స్, సౌత్‌వెస్ట్ ఎయిర్ లైన్స్ సర్వీసులు అధికంగా ఈ విమానాశ్రయం నుండి నిర్వహిస్తుంటారు.2003 నుండి 'అమెరికన్ ఎయిర్‌లన్స్"టి.డబ్ల్యూ.ఎ' ని కోరడం వలన విమాన సర్వీసుల సంఖ్య గుర్తింప తగినంత తగ్గుముఖం పట్టాయి. 'అమెరికన్ ఎయిర్ లైన్'కు 'లాబర్ట్ సెయింట్ లూయిస్ ఇంటర్ నేషనల్ విమానాశ్రయం' అంతర్జాతీయం కేంద్రంగా నాల్గస్థానంలో ఉన్న విమానాశ్రయం.2007 నుండి విమాన సర్వీసులు పునరుద్దరింప బడటం వలనెస్.టి.ఎల్ తిరిగి ముఖ్యత్వం సంపాదించుకుంది.ప్రస్తుతం ఇక్కడినుండి దేశీయంగా 90 నగరాలకు అనేక అంతర్జాతీయ గమ్యాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి.సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్, గ్రేట్ లేక్స్ ఎయిర్ లైన్స్ ఇక్కడినుండి ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి.
బై-స్టేట్ డెవలప్మెంట్ ఏజన్సీ చే నడపబడే 'మెట్రోలింక్' బస్సులు, లైట్- రైల్ ట్రైన్లు సెయింట్ లూయిసియన్లకు సేవలందిస్తున్నాయి.'మెట్రోలింక్ ' బస్సులను రెండు మార్గాలలో సర్వీసులను నడుపుతుంది.లాంబర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంనుండి సెయింట్ లూయిస్ డౌన్ టౌన్ వరకు, సెంట్రల్, సెయింట్ లూయిస్ వెలుపలి ప్రాంతంలో ఉన్న చ్లేటన్, మిస్సోరీ, ఇల్లినోయిస్ వరకు ఈ సర్వీసులు ఉంటాయి.'మాడిసన్ కౌంటీ ట్రాన్స్‌సిస్ట్' మాడిసన్ నుండి సెయింట్ లూయిస్ డౌన్ టౌన్ వరకూ సర్వీసులు నడుపుతుంటారు.
యూనియన్ స్టేషనుకు ఈశాన్యంలో ఉన్న'సెయింట్ లూయిస్ అమ్‌ట్రాక్ స్టేషను 'నుండి అమ్‌ట్రాక్ నుండి చికాగో, కసాస్ సిటీ, టెక్సాస్ వరకు రైల్ సర్వీసులు నడుస్తుంటాయి.అమ్‌ట్రాక్ సర్వీసులు ఇల్లినోయిస్ లోని కిర్క్ వుడ్, ఆల్టన్ వరకు రైల్ సర్వీసులను నడుపుతుంటాయి.రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఇక్కడ స్ట్రీట్ కార్లు నడుపుతుండే వారు.1966 నుండి ఈ సర్వీసులు ఆపివేయబడ్డాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.