సూళ్ళూరుపేట లేదా సూళ్లూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా పట్టణం.[2] ఇది ఇక్కడ నుండి నెల్లూరు 100 కిలోమీటర్ల దూరంలోనూ చెన్నై 83 కి.మీ.ల దూరంలోనూ ఉన్నాయి. ఈ పట్టణానికి సమీపంలోని శ్రీహరికోటలో, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఉంది.ఇది మునిసిపల్ టౌన్.ఇది పురపాలక సంఘం కాకముందు జనగణన పట్టణంగా ఉండేది.

త్వరిత వాస్తవాలు సూళ్లూరుపేట, దేశం ...
పట్టణం
Thumb
Coordinates: 13.7°N 80°E / 13.7; 80
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి జిల్లా
మండలంసూళ్ళూరుపేట మండలం
విస్తీర్ణం
  మొత్తం16.04 కి.మీ2 (6.19 చ. మై)
జనాభా
 (2011)[1]
  మొత్తం27,504
  జనసాంద్రత1,700/కి.మీ2 (4,400/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి1123
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)524121 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata
మూసివేయి

పేరు వ్యుత్పత్తి

ఇక్కడ చెంగాలమ్మ గుడికి ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పెద్ద కర్రకు మేకని కట్టి మూడు సార్లు గాలిలో తిప్పుతారు. సుళ్ళు తిరుగుతున్న నీటిలో దొరికిన దానికి గుర్తుగా ఇలా తిప్పటం జరుగుతుంది. కావున ఈ పట్టణానికి సూళ్లూరు, సూళ్లూరుపేట అనే పేరు్లు వచ్చాయి.

Thumb
సూళ్ళూరుపేట రైల్వేస్టేషన్ రోడ్

జనాభా గణాంకాలు

2011 జనాభా లెక్కల ప్రకారం సూళ్లూరుపేట పట్టణం పరిధిలో మొత్తం 6,870 కుటుంబాలు నివసిస్తున్నాయి. సూళ్లూరుపేట పట్టణ మొత్తం జనాభా 27,504 అందులో పురుషులు 12,955 మందికాగా, స్త్రీలు 14,549 మంది ఉన్నారు. సూళ్లూరు పట్టణ సగటు లింగ నిష్పత్తి 1,123. పట్టణంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2612, ఇది మొత్తం జనాభాలో 9%.గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 1330 మంది మగ పిల్లలు ఉండగా, 1282 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 964, ఇది సగటు లింగ నిష్పత్తి (1,123) కంటే తక్కువ. అక్షరాస్యత రేటు 83.6%. దీనిని అవిభాజ్య శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 68.9% అక్షరాస్యతతో పోలిస్తే సూళ్లూరుపేట పట్టణం అధిక అక్షరాస్యతను కలిగి ఉంది.పురుషుల అక్షరాస్యత రేటు 88.87%, స్త్రీల అక్షరాస్యత రేటు 79.05%.[3]

రవాణా సౌకర్యాలు

జాతీయ రహదారి 16 పై, చెన్నై - కోల్‌కాతా రైలు మార్గంపై ఈ పట్టణం ఉంది.

పరిపాలన

సూళ్లూరుపేట పట్టణ పరిపాలనను సూళ్లూరుపేట పురపాలక సంఘం నిర్వహిస్తుంది

విద్యా సౌకర్యాలు

వి.ఎస్.ఎస్.చి.ప్రభుత్వ డిగ్రీ కళాశాల.

దర్శనీయ ప్రదేశాలు

Thumb
సూళ్ళూరుపేటచెంగాళమ్మ గుడి

చెంగాళమ్మ గుడి

ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన చెంగాళమ్మ గుడి ఉంది. తలపై నాగపడగ కలిగి ఎనిమిది చేతులతో ఉండే అమ్మవారు బహుళ ప్రసిద్ధి కలిగిన అమ్మవారు. స్థల పురాణం ప్రకారం కొన్ని వేల ఏళ్ళ పూర్వం ఈ ఊరిని శుభగిరి అని పిలిచేవారు. ఊరికి పశ్చిమంగా కాళంగి నది ప్రవహిస్తుండేది. కొందరు పశువుల కాపరులు ఈత కొరకు దిగగా అందులో ఒకడు సుళ్ళు తిగుతున్న నీటి ప్రవాహం లోనికి లాక్కుని పోతుండగా అసరాగా చేతులకు తగిలిన రాతిని పట్టుకోగా అది అతడిని ఆ సుళ్ళ ప్రవాహం నుండి బయట పడవేయగా అతడు తనతో పాటుగా ఆ రాతిని తీసుకొచ్చి మిగిలిన వారికి చూపి జరిగినది వారికి చెప్పాడు. చీకటి పడటంతో వాళ్ళు పొడవుగా ఉన్న ఆ శిలను అక్కడే పడుకోబెట్టి వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం వచ్చి చూడగా పడుకోబెట్టిన రాయి దక్షిణాభిముఖంగా నిలబెట్టి ఉండటం, అది ఒక స్త్రీమూర్తి విగ్రహం అని మహిషాసురమర్ధనిలా ఉండటం గమనించారు. దానిని ఊరి పొరిమేరలలోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించగా ఎంతకూ కదలకపోవటం, ఆ రాత్రి ఊరి పెద్దకు కలలో కనిపించి తనను కదల్చవద్దని చెప్పడంతో అక్కడే ఒకపాక వేసి పూజలు చేయడం మొదలెట్టారు. కొంతకాలానికి గుడి నిర్మించిన తరువాత తలుపులు పెట్టేందుకు ప్రయత్నించగా అప్పుడు కలలో కనబడి నా దర్శనానికి ఏ సమయంలో వచ్చినా ఇబ్బంది కలుగకూడదు కనుక తలుపులు పెట్టవద్దని హెచ్చరించినదట. మరునాడు చూడగా తలుపులు చేయడానికి తెచ్చిన చెక్కలపై మొక్కలు మొలిచి కనిపించాయట. అప్పటి నుండి ఆ మొక్కలు ఆ ఆవరణలోనే పెరిగి పెద్దవై ప్రస్తుతం చెంగాళమ్మ వృక్షంగా పిలవడం జరుగుతున్నది. ఈ చెట్టును సంతానం కోరి దర్శించుకొనేవారు అధికం.

ఆలయ ప్రత్యేకత: షార్ ప్రతి ప్రయోగానికి ముందు ప్రతి రాకెట్ చిన్న నమూనాను ఈ ఆలయంలో పూజించడం ఆనవాయితీగా వస్తున్నది. దీనికి ఇస్రో ఛైర్మన్ హాజరవడం జరుగుతుంది.

సుళ్ళు ఉత్సవం: సుళ్ళూరుపేటకు ఈ పేరు రావడంలో చెంగాళమ్మ గుడి పాత్ర ఉంది. అది ఎలాగంటే చెంగాలమ్మ గుడికి ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పెద్ద కర్రకు మేకని కట్టి మూడు సార్లు గాలిలో తిప్పుతారు. సుళ్ళు తిరుగుతున్న నీటిలో దొరికిన దానికి గుర్తుగా ఇలా తిప్పటం జరుగుతుంది. ఇలా తిప్పడాన్ని "సుళ్ళు ఉత్సవం" అంటారు, అలాగ ఈ ఊరికి సూళ్ళురుపేట అని పేరు వచ్చింది.

ఇతరాలు

ఇతర విశేషాలు

చెన్నైకు మెరుగైన రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలు ఉన్నందున దీనిని కొన్నిసార్లు చెన్నై చుట్టుపక్కల వున్న ప్రాంతంగా పరిగణిస్తారు. ఇక్కడ ఉద్యోగపరంగా చాలామంది తమిళులు నివాసం ఉంటున్నారు. అధికశాతం జనాభాకు తమిళం తెలుసు.

గ్రామ ప్రముఖులు

ఇవీ చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.