సురేష్ కొండేటి
From Wikipedia, the free encyclopedia
సురేష్ కొండేటి తెలుగు సినిమా జర్నలిస్ట్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, నటుడు. ఆయన 2002లో ''సంతోషం'' సినీ వార పత్రికను స్థాపించాడు. సురేష్ కొండేటి మా ఎన్నికలు 2021లో ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా పోటీ చేశాడు.[1]
సురేష్ కొండేటి | |
---|---|
![]() | |
జననం | 6 అక్టోబర్ |
వృత్తి | జర్నలిస్ట్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1992 - ప్రస్తుతం |
జననం
సురేష్ కొండేటి అక్టోబర్ 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలం, వేడంగిపాలెం గ్రామంలో జన్మించాడు.[2][3][4]
వృత్తి జీవితం
సురేష్ కొండేటి వార్త దినపత్రికలో సినిమా జర్నలిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించి పలు వార్తా పత్రికల్లో పని చేశాడు. ఆయన 2002లో సంతోషం సినీ వార పత్రికను స్థాపించాడు.
సినీ జీవితం
సురేష్ కొండేటి 1992లో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఆయన 1995లో రాంబంటు సినిమాలో నటుడిగా, తరువాత మహేశ్వరీ ఫిలిమ్స్ పేరుతో డిస్ట్రిబ్యూషన్, ఎస్‌కె పిక్చర్ పేరుతో డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా వ్యవహరించాడు. ఆయన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (ఎఫ్.సి.ఎ) అధ్యక్షుడిగా ఉన్నాడు.[5]

- నిర్మాతగా
- ప్రేమిస్తే
- జర్నీ
- పిజ్జా [6]
- శంభో శంకర
- డా. సలీమ్
- లీసా
- మహేష్ (2013)
- ప్రేమించాలి (2014)
- మెట్రో (2017)
- జనతా హోటల్ (2018)
- లవ్ ఇన్ షాపింగ్ మాల్
- క్రేజీ
- ప్రేమలో పడితే
- రేణిగుంట
- రైడ్
- నటుడిగా
- రాంబంటు (1995)
- దేవినేని [7][8]
- మిస్టర్ ప్రెగ్నెంట్
- ఎర్రచీర - ది బిగినింగ్ (2024)
- దళారి
ఇవీ చూడండి
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.