సుద్దాల దేవయ్య
From Wikipedia, the free encyclopedia
సుద్దాల దేవయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో కరీంనగర్ జిల్లా నేరెళ్ల శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు.
సుద్దాల దేవయ్య | |||
![]() | |||
ఎమ్మెల్యే | |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | సాన మారుతీ | ||
---|---|---|---|
తరువాత | బొడిగె శోభ | ||
నియోజకవర్గం | చొప్పదండి నియోజకవర్గం | ||
ఎమ్మెల్యే | |||
పదవీ కాలం 1994 – 2004 | |||
ముందు | పాటి రాజం | ||
తరువాత | కాసిపేట లింగయ్య | ||
నియోజకవర్గం | నేరెళ్ల | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | అంతర్గాం, జగిత్యాల మండలం, జగిత్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం | 8 డిసెంబరు 1955||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ[1] | ||
ఇతర రాజకీయ పార్టీలు | ![]() ![]() | ||
తల్లిదండ్రులు | పోచమ్మ, వెంకటి | ||
జీవిత భాగస్వామి | లతా | ||
సంతానం | గౌతంకృష్ణ, లక్ష్మీ జ్యోత్స్న, స్వప్న, కల్పన | ||
నివాసం | బల్వంతపూర్, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా |
రాజకీయ జీవితం
సుద్దాల దేవయ్య తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, అంతర్గాం గ్రామా సర్పంచ్‌గా[3], 1982లో తెలుగుదేశం పార్టీలో చేరి 1987లో కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పనిచేసి 1994, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేరెళ్ల శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయాంలో రాష్ట్ర సహకార శాఖ, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన 2004లో ఓడిపోయి, 2009లో చొప్పదండి నియోజకవర్గం నుండి పోటీ చేసి ముదుసరి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
అధికారిక పదవులు
- 1981 - అంతర్గాం సర్పంచ్
- 1987 - కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్
- 1994 - నేరెళ్ల ఎమ్మెల్యే
- 1995 - రాష్ట్ర సహకార శాఖ మంత్రి
- 1999 - నేరెళ్ల ఎమ్మెల్యే
- 2001 - రాష్ట్ర సహకార శాఖ మంత్రి
- 2006 - ఎల్లరెడ్డిపేట జెడ్పీటీసీ
- 2009 - చొప్పదండి ఎమ్మెల్యే[4]
పార్టీ పదవులు
- 1982 - తెలుగుదేశం పార్టీలో చేరిక
- 1985 - టీడీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి
- 1997 - కరీంనగర్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు
- 2004 - టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి
- 2014 మార్చిలో టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిక
- 2019 సెప్టెంబరు 15 - భారతీయ జనతా పార్టీలో చేరిక
ఎన్నికల్లో పోటీ
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.