From Wikipedia, the free encyclopedia
సీతారాంబాగ్ దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సీతారాంబాగ్ ప్రాంతంలో ఉన్న దేవాలయం.[1][2] రాజస్థాన్‌లోని లక్ష్మణ్‌గఢ్ ప్రాంతం గణేరివాలా కుటుంబానికి చెందిన పురాన్మల్ గనేరివాల్ అనే వ్యక్తి 1820లలో 25 ఎకరాల్లో ఆలయ నిర్మాణం ప్రారంభమై, 1832లో మూల విరాట్‌ను ప్రతిష్ఠింపజేయడం జరిగింది.[3] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
దేవాలయం చుట్టూ యూరోపియన్ వాస్తు శైలిలో నిర్మించిన ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయి. జైపూర్ పాలరాతితో చెక్కిన సీతాసమేత శ్రీరాముడు, లక్ష్మణ, హనుమ, భరత, శత్రుజ్ఞలు సహితంగా శ్రీరాముని పట్టాభిషేక ఘట్టాన్ని తలపించే విగ్రహాలు ఈ దేవాలయంలో ప్రతిష్టించబడ్డాయి. ఏడవ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ ఆలయ పునఃనిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాడు.[4][5]
గ్రైనేట్, సున్నం రాయిని ఉపయోగించి ఆలయాన్ని నిర్మించారు. దర్వాజాలు 20 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేయబడ్డాయి.
ఆ రోజుల్లో తెలంగాణా ప్రాంతంలో విద్యా సంస్థలు లేకపోవడం వల్ల సీతారాంబాగ్ ఆలయ ప్రాంగణంలో సంస్కృత పాఠశాలను ప్రారంభించి, ఉచిత విద్యను అందించారు. ఖండవల్లి నర్సింహశాస్త్రి వ్యాకరణ పండితులుగా పనిచేసిన ఈ పాఠశాలలో దాశరథి కృష్ణమాచార్య, దివాకర్ల వెంకటావధాని, రవ్వా శ్రీహరి, కె.కె. రంగానాథాచార్యులు, ఎస్.వి. విశ్వనాథశర్మ తదితరులు విద్యను అభ్యసించారు.[6]
శ్రీరామ నవమి సందర్భంగా ఎనిమిది రోజులపాటు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నవమిరోజు రాత్రి సమయంలో సీతారామ కళ్యాణం జరుగుతుంది.[7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.