Remove ads
From Wikipedia, the free encyclopedia
సిరలు (Veins) శరీరంనుండి గుండెకు చెడు రక్తాన్ని తీసుకొని పోయే నాళాలు. ప్రస్తుత వైద్యవిధానంలో మనం చేస్తున్న రకరకాలైన పరీక్షలకు అవసరమైన రక్తం సిరలనుండే తీస్తారు. వివిధరకాలైన ద్రవాల్ని, మందుల్ని, అత్యవసర పరిస్థితుల్లో ఆహారాన్ని ఇదేవిధంగా మనశరీరంలోనికి పంపుతారు. ఈ సిరలు చర్మం క్రిందుగా బయటికి పొంగి స్పష్టంగా కనిపించడమే దీనికి కారణము. దీనికి ముఖ్యంగా చేతులకు సంబంధించిన సిరల్ని వాడతారు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
Vein | |
---|---|
The main veins in the human body | |
లాటిన్ | vena |
హృదయము నుంచి రక్తము వివిధ అవయవాల కణజాలమునకు ధమనుల ద్వారా అందించబడుతుంది. ధమనులు సూక్ష్మ ధమనులుగా శాఖలు చెంది కణజాలములో రక్తకేశనాళికలుగా ( capillaries ) చీలికలవుతాయి. కేశనాళికలలోని రక్తము నుంచి ప్రాణవాయువు, పోషక పదార్థములు కణజాలమునకు చేరి, కణజాలము నుంచి బొగ్గుపులుసు వాయువు, వ్యర్థ పదార్థములు రక్తములోనికి ప్రవేశిస్తాయి. సూక్ష్మ రక్తనాళికలు కలయికచే సిరలు ఏర్పడుతాయి. సిరల పాయలు కలిసి పెద్ద సిరలు ఏర్పడి తుదకు ఊర్ధ్వబృహత్సిర ( పూర్వ మహాసిర / superior venacava ), అధోబృహత్సిరల ( పర మహాసిర / inferior venacava ) ద్వారా రక్తమును హృదయపు కుడి కర్ణికకు తిరిగి చేరుస్తాయి.
గుండె ఎడమ జఠరికలో ( left ventricle ) రక్తపీడనము అత్యధికముగా ఉండి ధమనులు, సిరలు చివరకు కుడి కర్ణికకు ( Right atrium ) వచ్చేసరికి ఆ పీడనము క్రమముగా తగ్గుతుంది. ఎడమ జఠరిక ముకుళించుకున్నప్పుడు ధమనులలో పీడనము పెరిగి అలలుగా రక్తము ముందుకు ప్రవహిస్తుంది. పీడన వ్యత్యాసము వలన రక్తము సిరలలోనికి ఆపై కుడి కర్ణికకు చేరుతుంది. వికసించుకున్నపుడు కుడికర్ణికలో పీడనము బాగా తగ్గుతుంది. అందువలన కుడికర్ణిక బృహత్సిరలనుంచి రక్తమును గ్రహించగలుతుంది.
సిరల గోడలలో మూడు పొరలు ఉంటాయి. బయట పొరలో ( tunica externa ) పీచుకణజాలము ( collagen ), సాగుకణజాలము ( elastin ) ఉంటాయి. మధ్యపొరలో ( tunica media ) మృదుకండరములు ఉంటాయి. లోపొరలో ( tunica intima ) పూతకణములు మూలాధారపు పొరను ( basement membrane) అంటిపెట్టుకొని ఉంటాయి. సిరల బయటపొర, మధ్య పొరల మందము ధమనుల పొరల మందము కంటె బాగా తక్కువ.
కాళ్ళు, చేతులలోని సిరలను ఈ విధముగా విభజించవచ్చును.
ఇవి చర్మము క్రింద, కండర ఆచ్ఛాదమునకు ( deep fascia ) పైన ఉంటాయి.అందుచే ఇవి కంటికి కనిపిస్తాయి.
ఇవి కండర ఆచ్ఛాదమునకు ( deep fascia ) లోపల ఉంటాయి. ఇవి మన కళ్ళకు కనిపించవు.
ఇవి బాహ్యసిరలను, నిమ్నసిరలతో కలుపుతాయి. ఇవి కండర ఆచ్ఛాదమును చొచ్చుకొని లోపలకు ప్రవేశిస్తాయి. సాధారణ స్థితులలో రక్తము బాహ్యసిరలనుంచి నిమ్నసిరలలోనికి ఛిద్ర సిరల ద్వారా ప్రవహిస్తుంది. సిరలలో ఉండే ద్విపత్రకవాటములు తిరోగమన ప్రవాహమును నిరోధిస్తాయి.
సిరావ్యవస్థను మూడు భాగాలుగా విభజించవచ్చు.
దీనిలో మూడు మహాసిరలు ఉంటాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.