Remove ads

సింహరాశి వారి గుణగణాలు

ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖజీవితానికి దూరము చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్ఠకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్ధులుగా పేరు గడీస్తారు. వంశప్రతిష్ఠ, కులగౌరవాలకు ప్రాధానయత ఇస్తారు. ఇతర కుల, మత, వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారము రాదు. కఠిన మైన స్వభాము కలవారన్న ముద్ర పడుతుండి. సన్ని హితులు, సేవకా వర్గము వీరి చేత కొంత ఆలస్యముగా అయినా పని చేయించుకోగలుగుతారు. వీరిని భయ పెట్తి లొంగదీసు కోవడము దాదాపు అసాధ్యము. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మక పోయినా లక్ష్యపెట్టరు. వీరి అంచనా నూటికి తొంభై పాళ్ళు నిజము ఔతాయి. వైఫల్యము చెందిన పది శాతం గుర్తించ తగిన నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్తసంబంధీకులు, స్త్రీల వలన అధికముగా నష్టపోతారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము, అల్పులను ఆశ్రయించుట తప్పక పోవచ్చు. రాజకీయ రంగములో ప్రారంభములోనే ఊన్నత స్థితి సాధిస్తారు. సాధారన స్థితిలో ఉన్నప్పుడు ఉన్నతవర్గాల వారికి దూరము ఔతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరము చేస్తారు. శిరోవేదన, పాఋశ్య వాయువు, కీళ్ళ నొప్పులు వేధిస్తాయి. సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయముగా వ్యవహరిస్తారు. ఉద్యోగుల పత్ల వారి విధుల పత్ల వీరికి ఉన్న స్పష్ట మైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. పైన అధికారములో ఉన్న వారు వీరి ధనముతో ప్రోత్సాహముతోనే ఇతరులను బలవంతులను చేసి చివరకు వీరికె పోటీగా నిలుపుతారు. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురౌతాయి. స్వంత వారు వదిలి వేసిన బాధ్యతలన్ని వీరి తల మీద పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తరువాత స్వమ్త వాళ్ళ వలన సమస్యలు ఎదురౌతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగి పోతారు. రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యొగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మరచి పోలేని సహాయాలు చేస్తారు. వ్యతిరేకముగా ఆలోచించనంత కాలము మేలు గుర్తుంటుంది. కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యహారాలు లాభిస్తాయి. ప్రయోజనము లేని శ్రమకు దూరముగా ఉండాలి. వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరనలో పెట్టదము కష్టము అని గుర్తించ వలసి ఉంటుంది. శివార్చన, ఆంజనేయార్చన మేలు చేస్తుంది.

Remove ads

గ్యాలరీ

సింహరాశి జ్యోతిష విషయాలు

సింహ రాశి రాశి చక్రంలో అయిదవ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఇది పురుష రాశి, విషమ రాశి, స్థిర రాశి, అగ్ని తత్వ రాశి, అశుభ రాశి, పురుష రాసి అని వ్యవహరిస్తారు. జాతి క్షత్రియ జాతి, శబ్దం అధికము, ప్రదేశము నిర్జల ప్రదేశములు, జీవులు పశువులు, వర్ణము పాండు వర్ణం ధూమ్ర వర్ణం, దిక్కు తూర్పు, పరిమాణం దీర్ఘం, ప్రకృతి పిత్త ప్రకృతి, సంతానం అల్పం, కాల పురుషుని అంగం గుండె, సమయము దినం, జీవులు పశువులు. కొండలు, నిర్జన ప్రదేశములు, ఏడారులు, కొండలు, నీటి ఎద్దడి కలిగిన అడవులు ఈ రాశి ప్రభావిత ప్రాంతములు. ఈ రాశి పొడుగు రాశి.

ఇత్ర వనరులు

Remove ads

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads