From Wikipedia, the free encyclopedia
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, వనపర్తి శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1]
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి | |||
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి | |||
పదవీ కాలం 19 ఫిబ్రవరి 2019 - 03 డిసెంబర్ 2023 | |||
నియోజకవర్గం | వనపర్తి శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1958 అక్టోబర్ 4 పాన్‌గల్ | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | సింగిరెడ్డి వాసంతి | ||
సంతానం | డాక్టర్ ప్రత్యూష, అమృత వర్షిణి, తేజస్విని | ||
నివాసం | వనపర్తి | ||
మతం | హిందూ మతము |
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 1958 అక్టోబర్ 04 వ తేదీన తారకమ్మ, రాంరెడ్డి దంపతులకు జన్మించాడు.ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ ఎల్ బీ పూర్తి చేశాడు. అనంతరం లాయర్ గా ప్రాక్టీస్ చేశాడు.
సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలుగుదేశంపార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాదీబోర్డు చైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2001లో రాష్ట్ర సాధన కోసం స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.[2] మహబూబ్‌నగర్ లో దశాబ్దకాలం పాటు ఒంటిచేత్తో టీఆర్ఎస్ను నడిపించాడు. ఉమ్మడి పాలమూరు జిల్లా బతుకుచిత్రాన్ని తెలంగాణ ఉద్యమంలో బట్టబయలు చేసిన నాయకుడిగా నిరంజన్ రెడ్డి గుర్తింపు పొందాడు. 2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 4291 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
2014లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి గా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు బాధ్యతలు అప్పగించాడు. తెలంగాణ ఉద్యమంలో పాలమూరు సమస్యలపై స్పష్టమయిన అవగాహన ఉన్న నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 25 టీఎంసీలు ఉన్న నీటి కేటాయింపును 40 టీఎంసీలకు పెంపుదల చేయించి జీఓ విడుదలయ్యేలా కృషిచేశారు. 11 నెలలలో ఖిల్లాఘణపురం కాలువను, 40 రోజులలో పెద్దమందడి కాలువను తవ్వించి సాగునీరు తీసుకువచ్చారు. వనపర్తి నియోజకవర్గంలో 70 వేల ఎకరాలకు సాగునీరు అందించిన తరువాతనే ఎన్నికలలో నామినేషన్ వేస్తానని ప్రకటించి ఇచ్చినమాట నిలబెట్టకుని ఎన్నికలలో పోటీకి నిలబడ్డారు. గత నాలుగేళ్లుగా కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా ఖిల్లాఘణపురం, పెద్దమందడి, వనపర్తి , గోపాల్ పేట, రేవల్లి మండలాలు, భీమా ద్వారా వనపర్తిలో కొంతభాగం, శ్రీరంగాపురం మండలాలు సస్యశ్యామలం అవుతున్నాయంటే దానికి కారణం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
2018 ముందస్తు ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి గా నిరంజన్ రెడ్డి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి పై 51,783 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.[3][4]
2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో వ్యవసాయ, సహకార, ఆహార & పౌర సరఫరా శాఖల మంత్రిగా ఉన్నాడు.[5][6][7][8] ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వనపర్తి నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి[9] 25320 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[10]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.