"క్రీస్తు శకం"కు నవీన రూపమే సామాన్య శకం. ఇంగ్లీషులో దీన్ని కామన్ ఎరా (Common Era) అని లేదా కరెంట్ ఎరా (Current Era) అనీ అంటారు. లాటిన్ భాషలో యానో డొమిని (Anno Domini -AD) ని కామన్ ఎరా (Common Era -CE) గాను, "క్రీస్తు పూర్వం" (Before Christ -BC) ను బిఫోర్ కామన్ ఎరా (Before Common Era -BCE) గానూ వాడుతున్నారు. వీటిని తెలుగులో సామాన్య శకం (సా.శ..), సామాన్య శక పూర్వం (సా.పూ. లేదా సా.శ..పూ.) గా వ్యవహరిస్తున్నారు. ఈ మార్పుకు, మతతటస్థత ప్రధాన కారణం. ఈ మార్పు, పేరులోనే తప్ప కాలగణనలో కాదు. ఉదాహరణకు క్రీ.పూ. 512, సా.శ..పూ. 512 గాను, సా.శ.. 1757, సా.శ.. 1757 గాను మారుతాయి.
చరిత్ర
ఇంగ్లీషులో "కామన్ ఎరా" అనే మాటను మొదటిగా 1708 లో వాడారు.[1] 19 వ శతాబ్ది మధ్యలో యూదు పండితులు దీన్ని విస్తృతంగా ఉపయోగించారు. 20 వ శతాబ్ది మలి భాగంలో CE, BCE అనే పదాలు సాంస్కృతికంగా తటస్థంగా ఉండే పదాలుగా విద్యా, పరిశోధనా రంగాల్లో ప్రాచుర్యం పొందాయి. కొందరు రచయితలు, ప్రచురణకర్తలు క్రైస్తవేతరుల మనోభావాలకు విలువ నిస్తూ "క్రీస్తు" అనే మాట లేకుండా ఉండేందుకు గాను ఈ పదాలను వాడారు.[2][3]
1856 లో చరిత్ర కారుడూ, యూదు రబ్బీ అయిన మోరిస్ జాకబ్ రఫాల్, తన పోస్ట్-బైబ్లికల్ హిస్టరీ ఆఫ్ జ్యూస్ పుస్తకంలో CE, BCE అనే సంక్షిప్త పదాలను వాడాడు.[4][lower-alpha 1] యూదులు కరెంట్ ఎరా అనే మాటను కూడా వాడారు.[6]
స్పందనలు
సమర్ధనగా
మాజీ ఐరాస సెక్రెటరీ జనరల్ కోఫీ అన్నన్ [7] ఇలా అన్నాడు:
క్రైస్తవ క్యాలెండరు క్రైస్తవులకు మాత్రమే ప్రత్యేకించినదేమీ కాదు. అన్ని మతాలకు చెందినవారు తమ సౌకర్యం కోసం దాన్నే వాడుతున్నారు. వివిధ మతాల , వివిధ సంస్కృతుల, వివిధ నాగరికతల మధ్య పరస్పర సంబంధం ఎంతలా ఉందంటే అందరూ పాటించే ఒకే కాలమానం ఉండడమనేది ఆవశ్యకమైంది. అందుచేత క్రిస్టియన్ ఎరా ఇప్పుడు కామన్ ఎరా అయిపోయింది.[8]
అడెనా బెర్కోవిట్జ నే లాయరు అమెరికా సుప్రీం కోర్టులో వాదించేటపుడు, BCE, CE లను వాడాడు. దాన్ని సమర్ధించుకుంటూ, "మనం నివసిస్తున్న ఈ బహుళ సంస్కృతుల సమాజంలో B.C.E., C.E. అనేవి అన్ని వర్గాల వారినీ అక్కున చేర్చుకుంటాయి" అని అన్నాడు.[9]
వ్యతిరేకంగా
అసలు BC/AD (క్రీ.పూ./సా.శ..) అనేవి క్రీస్తు జన్మకు సంబంధించి అమల్లోకి వచ్చినవైతే, వాటిలో "క్రీస్తు" అనే పేరు ఉన్నందుకు తీసెయ్యడమేంటని కొందరు క్రైస్తవులు బాధపడ్డారు.[10]
ఇవీ చూడండి
గమనికలు
- The term common era does not appear in this book; the term Christian era [lowercase] does appear a number of times. Nowhere in the book is the abbreviation explained or expanded directly.[5]
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.