From Wikipedia, the free encyclopedia
సలీమా సుల్తాన్ బేగం (ఉర్దూ: سلیمہ سلطان) (23 ఫిబ్రవరి 1539 – 2 జనవరి 1613), బాబర్ మనవరాలు.[2] మొఘలు చక్రవర్తి అక్బరు నాల్గవ భార్య[3]బాబరు చక్రవర్తి మనుమరాలు.
సాలిమా సుల్తాను బేగం سلیمہ سلطان بیگم | |
---|---|
జననం | 23 February 1539 |
మరణం | 2 జనవరి 1613 73) Agra, Mughal Empire (modern day India) | (aged
Burial | Mandarkar Garden, Agra |
Spouse | Bairam Khan (m. 1557–1561) Akbar (m. 1561–1605 in Jalandhar)[1] |
House | Timurid (by birth) |
తండ్రి | Nuruddin Muhammad Mirza |
తల్లి | Gulrukh Begum |
మతం | Islam |
సలీమా అక్బరు అత్త (తండ్రి సోదరి) గుల్రుఖు బేగం, నూరుద్దీను ముహమ్మదు మీర్జా (కన్నౌజు రాజప్రతినిధి) కుమార్తె. ఆమె మామయ్య హుమయూను ఆమెను ముందుగా అక్బరు రీజెంటు బైరం ఖానుకు ఇచ్చి వివాహం చేసాడు. హుమయూను కొరకు బైరం చేసిన అధిగమించిన సేవలకు వధువును బహుమతిగా ఇచ్చి ఉండవచ్చు. ఈ జంట మధ్య సుమారు నలభై సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది.1557లో హుమయూను మరణం తరువాత మూడవ మొఘలు చక్రవర్తిగా సింహాసం అధిష్ఠించిన అక్బరు ఆమెను మూడవభార్యగా వివాహం చేసుకున్నాడు. ఏది ఏమయినప్పటికీ 1561 లో బైరం ఖాను ఆఫ్ఘన్ల బృందంచేత హత్య చేయబడినందున సంతానరహితమైన ఈ సంక్షిప్త దాంపత్యం కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. ఆయన మరణం తరువాత సలీమా తరువాత తన మొదటి బంధువు అక్బరును వివాహం చేసుకున్నది.
సలీమా అక్బరు సీనియరు ర్యాంకింగు భార్య, ఆమె భర్త అక్బరు మీద, ఆయన కుమారుడు జహంగీరు మీద చాలా ప్రభావం చూపింది. [4] ఆమె తన భర్త పాలనలో, ఆయన వారసుడు (జహంగీరు) పాలనలో మొఘలు రాజసభలో ప్రధాన రాజకీయ ప్రభావాన్ని చూపింది. అయినప్పటికీ చరిత్రలలో ఆమె పేరు ఒక పాఠకురాలిగా, కవిగా మఖ్ఫీ (مخفی, "హిడెన్ వన్") అనే మారుపేరుతో వ్రాసింది. జహంగీరు క్షమించమని అక్బరు వేడుకుంటుంది.
ఆమె ప్రారంభ మొఘలు చరిత్రలో నిలుస్తుంది. ఆమె పరిజ్ఞానం ఆమెకు "యుగం ఖాదీజా" (ఖాదీజా-ఉజ్-జమాని) బిరుదు ఇచ్చి గౌరవించింది.[5]
సలీమా సుల్తాను బేగం మొఘలు యువరాణి గుల్రూకు బేగం, నూరుద్దీను ముహమ్మదు మీర్జా(కన్నౌజు రాజప్రతినిధి) కుమార్తె.[6] ఆమె తండ్రి ప్రఖ్యాత నక్వష్బండి ఖ్వాజాసు వంశీకుడైన ఖ్వాజా హసను నక్వష్బండి మనవడు.[7] ఆయన ఎంతో గౌరవం పొందాడు. తైమురిదు సామ్రాజ్యానికి చెందిన సుల్తాను అబూ సాయిదు మీర్జా (అతని కుమారుడు సుల్తాను మహమూదు మీర్జా ద్వారా) సంబంధం కలిగి ఉన్నాడు.[8]
సలీమా తల్లి గుల్రూకు బేగం మొదటి మొఘలు చక్రవర్తి బాబరు కుమార్తె. గులుఖు బేగం తల్లి గుర్తింపు వివాదాస్పదమైంది. కొన్ని వనరులలో ఆమె తల్లి పేరు సలీహా సుల్తాను బేగం అని పేర్కొనబడింది. అయితే ఈ పేరు బాబరు స్వయంగా రాసిన బాబర్నామాలో లేదా గుల్బాదను బేగం రాసిన హుమయూను-నామాలో ప్రస్తావించబడలేదు. అందువల్ల అలాంటి స్త్రీ ఉనికి ప్రశ్నార్థకంగా ఉంది. ఆమె దిల్దారు బేగం కుమార్తె అయి ఉండవచ్చు. ఆమె నిజానికి సలీహా సుల్తాను బేగం అయి ఉండవచ్చు.[9][10]
గుల్రూఖు రెండవ మొఘలు చక్రవర్తి హుమాయును సోదరి. ఆమె దిల్దారు కుమార్తె అయితే హుమాయును తమ్ముడు హిందాలు మీర్జా పూర్తి సోదరి.[11]సలీమా అక్బరు చక్రవర్తి దూరపు బంధువు, మీర్జా హిందాలు, అక్బరు మొదటి భార్య, ముఖ్య భార్య అయిన చక్రవర్తిని రుకయ్య సుల్తాన్ బేగం మొదటి బంధువు.[12][13] అందంతో ప్రఖ్యాతి గాంచిన గుల్రూకు బేగం సామ్రాజ్య గృహంలో సాధించిన విజయాలకు ప్రసిద్ది చెందింది.[11] తన కుమార్తెకు జన్మనిచ్చిన నాలుగు నెలల తర్వాత మరణించారు.[14]
సలీమా ఎంతో విద్యావంతురాలైన, నిష్ణాతురాలైన మహిళ[15][16] చాలా ప్రతిభావంతురాలు,[17][18] మేధోపరమైన మహిళగా వ్యూహాత్మకమైన మహిళగా పేరుగాంచింది.[4] పర్షియా భాషలో ప్రావీణ్యం,[19] ఆమె మఖ్ఫీ (مخفی, "హిడెన్ వన్") అనే మారుపేరుతో ఒక గొప్ప రచయిత, ఆమె కాలంలో ఆమె ప్రఖ్యాత కవి. ప్రతిభావంతులైన కవయిత్రిగా ప్రిన్సెస్ జెబ్-అన్-నిస్సా తరువాత ఆమె ముని మనవరాలుగా సమాన ప్రతిభావంతులైన గొప్ప-మనవరాలుగా ఖ్యాతిగాచింది.[20] సలీమా కూడా పుస్తకాల పట్ల మక్కువ చూపుతూ పుస్తకాలు చదవడానికి చాలా ఇష్టపడింది.[21] ఆమె తన స్వంతంగా గొప్ప గ్రంధాలయం నిర్వహించడమే కాక, అక్బరు గ్రంధాలయాన్ని కూడా స్వేచ్ఛగా ఉపయోగించుకుంది. మాసిర్ అల్-ఉమారా రచయిత అబ్దుసు హేయి తన ప్రసిద్ధ ద్విపదలలో ఒకదాన్ని ఉటంకించారు:
నా అభిరుచిలో నేను నీ తాళాన్ని 'జీవితపు దారం' అని పిలిచాను'
నేను అడవిలో ఉన్నాను, అలాంటి వ్యక్తీకరణను పలికాను[22]
అక్బరు రాజసభా చరిత్రకారుడు, బడాయుని తన ముంతాఖాబ్-ఉట్-తవారిఖ్ పుస్తకంలో, సలీమా పుస్తకాల మీద ప్రేమను గురించిన ఒక భాగాన్ని ఇచ్చాడు.[21] ఈ గ్రంథం ఇలా నడుస్తుంది: "లైబ్రరీ నుండి అదృశ్యమైన ఖిరాదు-అఫ్జా పుస్తకం, సలీమా సుల్తాను బేగం అధ్యయనం గురించి చక్రవర్తి (అక్బరు) నాకు గుర్తుచేసి నా భత్యం ఆగిపోవాలని ఒక ఉత్తర్వు జారీ చేయబడింది. వారు నా పుస్తకాన్ని డిమాండు చేయాలి. " అబూలు ఫజలు చక్రవర్తి ముందు తన నిరాకరణ వ్యక్తపరచలేదు. సలీమా కోరుకున్న పుస్తకంతో ఆయన ఏమి చేశాడనే ఇబ్బందికరమైన సందేహాన్ని ఆయన తొలగించలేదని ఆయన జతచేస్తాడు.[23]
18 సంవత్సరాల వయస్సులో సలీమా బేగం 1557 డిసెంబరు 7 న పంజాబు లోని జలంధరులో చాలా పాత బైరం ఖాను (ఆయన యాభై ఏళ్ళ వయసులో) 18 సంవత్సరాల సలీమా బేగంను వివాహం చేసుకున్నాడు.[18][1] బైరం ఖాను మొఘలు సైన్యం కమాండరు-ఇన్-చీఫుగా మొఘలు రాజ్యసభలో ప్రవేశించిన శక్తివంతమైన రాజనీతిజ్ఞుడు. ఆ సమయంలో అక్బరు రాజప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. భారతదేశం జయించిన వెంటనే (అక్బరు పాలనలో ఇది సాధించబడింది) సలీమా మామ హుమాయును తన మేనకోడలిని తనతో వివాహం చేస్తానని బైరం ఖానుకు వాగ్దానం చేశాడు. హుమయూను కొరకు బైరం చేసిన అధిగమించిన సేవలకు వధువును బహుమతిగా ఇచ్చి ఉండవచ్చు. ఈ వివాహం మొఘలు ప్రభువులలో ఆయన ప్రతిష్టను పెంచింది. ఎందుకంటే ఆయనను సామ్రాజ్య కుటుంబంలో సభ్యునిగా చేసింది.[24]
ఈ వివాహం సభలో గొప్ప ఆసక్తిని రేకెత్తించిందని చెబుతారు. ఇది అలీ షుక్రు బేగు నుండి వచ్చిన రెండు వంశప్రవాహాలను ఏకం చేసింది. అనగా బైరం ఖాను వైపు నుండి బ్లాక్‌షీప్ తుర్కోమన్లు, సలీమా వైపు నుండి తైమూరు సలీమా తన తల్లితండ్రులు, బాబరు చక్రవర్తి ద్వారా ఆమె ముత్తాతలలో ఒకరైన మహమూదు ద్వారా తైమురిదు.[25]సలీమా బైరం రెండవ భార్య అయింది.[26] మొదటి భార్య జమాలు ఖాను కుమార్తె (మేవతు), ఆమె కుమారుడే అబ్దులు రహీం.[27] స్వల్పకాలిక భైరంఖాను, సలీమా బేగంల దాంపత్యంలో వారిరువురికి సంతానం కలుగలేదు[4]
1561 లో ఆయన మరణానికి కొంతకాలం ముందు, బైరం ఖాను సామ్రాజ్యంలో తన ప్రతిష్టాత్మక స్థానాన్ని కోల్పోయాడు. ఎందుకంటే ఆయనను నాశనం చేయాలనుకునే కుట్రదారులు ఆయనచేత అక్బరు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించారు. భైరం ఖాను తిరుగుబాటును అక్బరు రెండుసార్లు అణిచివేసాడు. భైరం ఖాను అక్బరుకు లొంగిపోయాడు. ఆయన తిరుగుబాటులకు శిక్షగా, బైరం ఖాను తన హక్కులన్నింటినీ తొలగించాడు. అక్బరు ఆయనకు మూడు అవకాశాలు ఇచ్చాడు: కల్పి, చందేరి సర్కార్లర్లో ఒక అందమైన జాగీర్, చక్రవర్తి రహస్య సలహాదారు పదవి, మక్కా ప్రయాణం. బైరం ఖాను చివరి మక్కాయాత్రను ఎంపికను చేసుకున్నాడు.[27]
మక్కాకు వెళుతున్న సమయంలో బైరం ఖాను గుజరాతు లోని పటానులో 1561 జనవరి 31 న ముబారకు ఖాను అనే వ్యక్తి నేతృత్వంలోని ఆఫ్ఘన్ల బృందం దాడి చేసింది. ఆయన తండ్రి 1555 లో మచ్చివారా యుద్ధంలో బైరంకు వ్యతిరేకంగా పోరాడుతూ చంపబడ్డాడు.[28][29] బైరం ఖాను శిబిరం కూడా దోపిడీకి గురైంది. కొత్తగా వితంతువు అయిన సలీమా బేగం ఆమె సవతి కుమారుడు అబ్దులు రహీం (నాలుగేళ్ల వయసు) తో కలిసి అహ్మదాబాదు చేరుకున్నది. తన మాజీ గురువు, సంరక్షకుడి మరణం గురించి విచారకరమైన వార్త విన్న అక్బరు దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆయన ఆదేశాల ప్రకారం, సలీమా, అబ్దులు రహీంలను మొఘలు రాజ్యసభకు గొప్ప గౌరవమర్యాదలతో తీసుకువచ్చారు. అక్బరు తన బంధువు సలీమా సుల్తాను బేగం సామర్ధ్యాలను బాగా ఆకట్టుకున్నాయి. తరువాత ఆయన 1561 మే 15 న ఆమెను వివాహం చేసుకున్నాడు.[21][28] ఆమె ఆయన కంటే మూడున్నర సంవత్సరాలు పెద్దది. ఆయన నాల్గవ భార్య అయ్యింది.[3] ఇస్లాం చట్టం లేదా షరియా ప్రకారం ఆమె అక్బరు చివరి చట్టబద్దమైన భార్య అని దీని అర్థం. ఇది ఒక ముస్లిం పురుషుడికి నలుగురు భార్యలను కలిగి ఉండటానికి అనుమతిస్తుంది.[30]
ధనవంతురాలైన ప్రతిభావంతురాలైన సలీమా (రుకయ్య సుల్తాను బేగం తరువాత) అక్బరు ఏకైక భార్య, ఆమె చాలా గొప్ప వంశానికి చెందినది. ఆమె తల్లి వైపు వంశం తైమురిదు కావడంతో తల్లి వరుసలో బాబరు చక్రవర్తి మనవరాలు. సలీమా అక్బరు సీనియరు ర్యాంకింగు భార్యలలో ఒకరు.[11] రుకైయా సుల్తాను బేగం తరువాత ఆయన మొదటి భార్య, ప్రధాన భార్యగా ఉంది.[13] సలీమా తన వివాహజీవితం అంతా సంతానం లేకుండా ఉండిపోయింది. అయినప్పటికీ కొన్ని వనరులు ఆమెను అక్బరు కుమారుడు సుల్తాను మురాదు మీర్జా తల్లిగా తప్పుగా గుర్తించాయి.[31] మురాదు తన తమ్ముడు డానియలు మీర్జా మాదిరిగానే రాజమర్యాదలు స్త్రీ కుమారుడని జహంగీర్నామా పేర్కొంది.[32]
విస్తృతమైన పాఠకురాలిగా ఆమె చక్రవర్తితో వ్యవహారాల స్థితిగతుల గురించి చర్చించిన వివరాలు పేర్కొనబడ్డాయి. మొఘలు సభలో సలీమా చాలా ముఖ్యమైన మహిళలలో ఒకరు. 1575 లో సలీమా తన అత్త గుల్బాదను బేగం, అనేక ఇతర తైమురిదు మహిళలతో కలిసి హజు తీర్థయాత్ర చేయడానికి మక్కాకు వెళ్ళింది. యాత్రికులతో కలిసి యాత్రనిర్వహించిన అక్బరు ఏకైక భార్య ఆమె.[33] అబూలు ఫజలు అభ్యర్ధనల కారణంగా మాత్రమే అక్బరు వారితో ప్రయాణించడానికి నిరాకరించాడు.[34] అక్బరు ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి మహిళా పార్టీ 1575 అక్టోబరు 15 న ఫతేపూరు సిక్రీని విడిచిపెట్టి సముద్రంలో ప్రయాణించడానికి ఒక సంవత్సరం సమయం తీసుకున్న తరువాత 1576 అక్టోబరు 17 న మక్కాకు బయలుదేరింది. వారు మూడున్నర సంవత్సరాలు యాత్రలో గడిపి అరేబియాలో అర్ధ సంవత్సరం గడిపి, హజు యాత్రను నాలుగుసార్లు చేసి 1582 మార్చిలో ఆగ్రాకు తిరిగి వచ్చింది.[35]
సలీమా బేగంకు అక్బరు ఆమె సవతి కుమారుడు సలీం [4]మీద సలీమా చాలా ప్రభావం చూపింది. తండ్రి-కొడుకు సంబంధిత పాలనలలో మొఘలు రాజ్యసభలో ప్రధాన రాజకీయ ప్రభావాన్ని చూపింది. 1600 ల ప్రారంభంలో తండ్రి-కొడుకు సంబంధంలో విబేధాలు ఏర్పడినప్పుడు చివరికి సలీం ప్రవేశానికి మార్గం సుగమం చేయడానికి సహాయపడినప్పుడు అక్బరు సలీంల మధ్య ఒక ఒప్పందం మీద చర్చలో, చివరికి మొఘలు సింహాసనం అధిష్ఠించే వరకు ఆమె కీలక పాత్ర పోషించింది (ఆమె బంధువు, సహ భార్య రుకయ్యా సుల్తాను బేగం).[36] 1601 లో అలహాబాదులో స్వతంత్ర న్యాయస్థానం ఏర్పాటు చేయడం ద్వారా ఆయన తండ్రి జీవించి ఉన్నప్పుడు "సలీం షా" అనే సామ్రాజ్య బిరుదును స్వీకరించి సలీం అక్బరు మీద తిరుగుబాటు చేశాడు.[16] ఆయన అక్బరు నమ్మకమైన సలహాదారు, సన్నిహితుడు అయిన అబూలు ఫజలు హత్యను కూడా ప్లాన్ చేసి అమలు చేశాడు.[37]
ఈ పరిస్థితి చాలా క్లిష్టంగా మారి అక్బరు ఎంతగానో రెచ్చగొట్టింది. సలీం కోసం అభ్యర్ధించడానికి ఎవరూ సాహసించలేదు. చివరికి సలీమా సుల్తాను బేగం, రుకయ్య సుల్తాను బేగం అక్బరు వద్ద సలీం కొరకు క్షమాపణ కోరారు. అక్బర్ వారి కోరికలను మంజూరు చేశాడు, సలీం తనను చక్రవర్తి ముందు హాజరుపర్చడానికి అనుమతించాడు. క్షమాపణ వార్తలను యువరాజుకు తెలియజేయడానికి అక్బరు సలీమాను (ఆమె సవతి కొడుకు మీద గొప్ప ప్రభావాన్ని చూపాడు) అలహాబాదుకు పంపాడు. ఆమె ఫతే లష్కరు అనే ఏనుగు ప్రత్యేక గుర్రం, గౌరవ వస్త్రంతో వెళ్ళింది. సలీం ఆమెను హృదయపూర్వకంగా స్వీకరించి, ఆమెతో ఆగ్రాకు తిరిగి వెళ్ళడానికి అంగీకరించాడు. చివరకు 1603 లో తన సవతి తల్లులు, అతని అమ్మమ్మ హమీదా బాను బేగం ప్రయత్నాల ద్వారా యువరాజు క్షమించబడ్డాడు.[16]
జహంగీరు పాలనలో శక్తివంతమైన ఖాన్-ఇ-అజాం, మీర్జా అజీజు కోకాకు క్షమాపణను విజయవంతంగా పొందడం ద్వారా సలీమా, రుకైయా సుల్తాను బేగం మళ్లీ తమ రాజకీయ ప్రభావాన్ని ప్రదర్శించారు. తత్ఫలితంగా అజీజు కోకా (అక్బరు పెంపుడు సోదరుడు) దశాబ్దాలుగా అంతఃపురంలో గొప్ప అభిమానపాత్రుడుగా ఉన్నాడు. ఆయన కుమార్తెలలో ఒకరు జహంగీరు పెద్ద కుమారుడు ఖుస్రావు మీర్జాను వివాహం చేసుకున్నారు. 1606 లో ఖుస్రావు తన తండ్రి మీద తిరుగుబాటు చేసినప్పుడు. అజీజు కోకా మొదటి నుంచీ ఈ ప్లాటులో ఉన్నట్లు కనుగొనబడింది. సలీమా సుల్తాను బేగం తెర వెనుక నుండి అరుస్తూ ఉండకపోతే అజీజు కోకాకు మరణశిక్ష తప్పేది కాదు.
మెజెస్టి, మీర్జా అజీజు కోకాకు తమ మద్దతును ప్రతిజ్ఞ చేసే ఉద్దేశ్యంతో మహిళలందరూ మహిళల అంతఃపురంలో సమావేశమయ్యారు. మీరు ఇక్కడకు వస్తే మంచిది - కాకపోతే వారు మీ వద్దకు వస్తారు![38]
జహంగీరు నిర్బంధంగా అంతఃపురానికి వెళ్ళాడు. ఆయన సవతి తల్లుల ఒత్తిడి కారణంగా ఆయన చివరకు అతనికి క్షమాపణ చెప్పాడు.[39]
అనారోగ్యం కారణంగా సలీమా 1613 లో మరణించింది. ఆమె సవతి కుమారుడు జహంగీరు, ఆమె పుట్టుక సంతతికి సంబంధించిన వివరాలను అందించాడు; ఆమె వివాహాలు 1613 లో ఆమె మరణించేటప్పుడు ఆమెకు 60 సంవత్సరాలు అని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆదేశాల మేరకు ఆమె మృతదేహాన్ని ఆగ్రాలోని మందార్కరు గార్డెనులో (ఆమె స్వయంగా ఆరంభించిన) ఉంచారు.[40]
జహంగీరు సలీమాను ఉన్నతమైన సహజ లక్షణాలకు ప్రశంసించాడు. "ఆమె అన్ని మంచి లక్షణాలతో అలంకరించబడింది. మహిళలలో ఈ నైపుణ్యం, సామర్థ్యం చాలా అరుదుగా కనబడుతుంది."[2] ఆమె తనను తాను మనోహరంగా, ఒక ముద్రగా సృష్టించి జీవితాన్ని పండించిన మహిళ.[40]
Seamless Wikipedia browsing. On steroids.