సాయిపల్లవి

నటి From Wikipedia, the free encyclopedia

సాయిపల్లవి

సినీ నటి.[4][6] తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించింది.[7]

త్వరిత వాస్తవాలు సాయిపల్లవి, జననం ...
సాయిపల్లవి
Thumb
జననం (1992-05-09) 1992 మే 9 (age 32)[1][2] [3]
కోటగిరి, తమిళనాడు[4]
విద్యవైద్య విద్య
విద్యాసంస్థటిబిలిసి స్టేట్ మెడికల్ కళాశాల, జార్జియా
వృత్తినటి
తల్లిదండ్రులు
  • సెంతామరై కన్నన్ (తండ్రి)
  • రాధామణి (తల్లి)
బంధువులుపూజా క‌న్న‌న్ (కవల సోదరి)[5]
మూసివేయి

నేపథ్యం

సాయిపల్లవి ది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామం. బడుగ గిరిజన కుటుంబంలో జన్మించారు తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. ఈమె మంచి నర్తకి కూడా. తండ్రి సెంతామరై కస్టమ్స్ అధికారి. ఈమె, చెల్లెలు పూజ కన్నన్‌ కవల పిల్లలు. అక్కడికి దగ్గర్లోని కోయంబత్తూరులో పాఠశాల విద్యనభ్యసించింది. తల్లి ప్రభావంతో ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. ఈమె ఎనిమిదో తరగతిలో ఉండగా ఆమె నాట్యం చూసిన ఓ దర్శకుడు ధూం ధాం అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు. తర్వాత మీరా జాస్మిన్ క్లాస్ మేట్ గా కస్తూరి మాన్ అనే మరో సినిమాలో నటించింది.

ఈటీవీలో ఢీ లాంటి కొన్ని డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది. తండ్రి ఈమె ముందు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో జార్జియా లో వైద్యవిద్య నభ్యసించడానికి పంపించాడు.

సినిమా

వైద్యవిద్య నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెను ప్రేమమ్ చిత్రంలో నటించమని అడిగాడు. అలా ఈమె సినీ రంగ ప్రవేశం జరిగింది. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయిక భానుమతి పాత్ర పోషించింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. తర్వాత నాని సరసన ఎం. సి. ఏ చిత్రంలో నటించింది.[8]

మీడియాలో

విజయ్ దళపతి జి.ఓ.ఎ.టి చిత్రంలో విజయ్ నటనను సాయి పల్లవి ప్రశంసించింది.[9]

నటించిన చిత్రాలు

మరింత సమాచారం సంవత్సరం, సినిమా ...
సంవత్సరం సినిమా పాత్ర భాషా ఇతర విషయాలు మూలాలు
2005కస్తూరి మాన్కాలేజీ అమ్మాయితమిళ్గుర్తింపు లేని పాత్ర[10]
2008ధామ్ ధూమ్శెంబా బంధువు[11] తమిళ్ గుర్తింపు లేని పాత్ర
2015ప్రేమమ్మలర్మలయాళం [12]
2016కాళిఅంజలి మలయాళం [13]
2017ఫిదాభానుమతితెలుగు [14]
మిడిల్ క్లాస్ అబ్బాయిపల్లవి "చిన్ని" తెలుగు [15]
2018దియాతులసితమిళ్ద్విభాషాచిత్రం[16]
కణంతెలుగు
పడి పడి లేచే మనసువైశాలి చెరుకూరి తెలుగు[17]
మారి 2ఆనంది మారియప్పన్తమిళ్[18]
2019 అథిరన్నిత్యమలయాళంతెలుగులో అనుకోని అతిథి[19]
ఎన్.జి.కెగీత కుమారితమిళ్, తెలుగు[20]
2020పావ కధైగల్సుమతి తమిళ్ఆంథోలోజి ఫిలిం ; సెగ్మెంట్ ఓర్ ఇరవు[21]
2021 లవ్ స్టోరీ మౌనిక రాణి తెలుగు [22]
శ్యామ్‌ సింగరాయ్‌రోజి (మైత్రేయి) తెలుగు[23][24]
2022 విరాట పర్వం వెన్నెల తెలుగు[25]
గార్గి గార్గి తెలుగు, తమిళం, కన్నడ[26]
2024 అమరన్ తమిళం & తెలుగు
2025 తండేల్ తెలుగు
మూసివేయి

అవార్డులు , నామినేషన్లు

మరింత సమాచారం సంవత్సరం, అవార్డు ...
సంవత్సరం అవార్డు వర్గం సినిమా ఫలితం మూలాలు
2015 ఆసియా విజన్ అవార్డులు నటనలో కొత్త సంచలనం - స్త్రీ ప్రేమమ్ గెలుపు [27]
ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రత్యేక జ్యూరీ అవార్డు గెలుపు [28]
63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ మహిళా అరంగేట్రం - మలయాళం గెలుపు [29]
5వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ మహిళా అరంగేట్రం - మలయాళం గెలుపు [30]
వనిత ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ నూతన నటి - నటి గెలుపు [31]
2017 ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ అత్యంత ప్రజాదరణ పొందిన నటి కలి గెలుపు [32]
64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటి - మలయాళం ప్రతిపాదించబడింది [33]
6వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ నటి - మలయాళం ప్రతిపాదించబడింది [34]
CPC సినీ అవార్డులు ఉత్తమ నటి గెలుపు [35]
2018 65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటి - తెలుగు ఫిదా గెలుపు [36]
7వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ నటి - తెలుగు ప్రతిపాదించబడింది [37]
2019 66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటి - తమిళం మారి 2 ప్రతిపాదించబడింది [38]
2021 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సహాయ పాత్రలో ఉత్తమ నటి పావ కదైగల్ ప్రతిపాదించబడింది [39]
మూసివేయి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.