సాంస్కృతిక శాఖ

From Wikipedia, the free encyclopedia

సాంస్కృతిక శాఖ

సాంస్కృతిక శాఖ (Department of Culture) ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోని యువజన పురోగతి, పర్యాటన, సంస్కృతి శాఖ లోవిభాగము. ఇది తెలుగు సంస్కృతి వైభవాన్ని దశ దిశలా చాటాలని, తెలుగు కళల ఔన్నత్యాన్ని నేటి తరానికి, రేపటి తరానికి ప్రదర్శించాలని, తెలుగు కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేయాలన్న ఉద్దేశంతో 1981 సంవత్సరంలో స్థాపించబడింది. 2010 లో ఆంధ్ర ప్రదేశ్అధికార భాషా సంఘమును దీనిలో విలీనం చేశారు, అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉన్నత విద్యా శాఖ నుండి దీని పరిధిలోకి మార్చబడింది.

Thumb
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

అనుబంధ సంస్థలు

పథకాలు

  • 10,000 మంది వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాయం
  • 12 ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల నిర్వహణ, విద్యాబోధన
  • రాష్ట్రంలోని 45,000 మంది కళాకారులకు గుర్తింపు కార్డులు
  • తెలుగు సాంస్కృతిక వికాసానికి స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయం
  • జానపద, గిరిజన కళా ప్రదర్శనలకు ప్రాధాన్యం
  • రవీంద్ర భారతి, లలిత కళా తోరణం నిర్వహణ.
  • రాష్ట్రమంతటా సాంస్కృతిక, చారిత్రాత్మక ఉత్సవాల నిర్వహణ
  • కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక కేంద్రాల ద్వారా సాంస్కృతిక సమన్వయం
  • అంతర్ రాష్ట్ర సాంస్కృతిక బృందాలు ఆహ్వానం, మన కళా బృందాలను ఇతర రాష్ట్రాలకు పంపించడం.
  • కళల పట్ల అవగాహన కలిగించే కళాపరిచయ కార్యక్రమాల నిర్వహణ.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.