Remove ads
From Wikipedia, the free encyclopedia
సహజ నిరోధకత్వం (Innate immunity): పరిణామక్రమంలో జీవులలో మొదటగా ఏర్పడ్డ రక్షణ వ్యవస్థ (1st line of defence)
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
పుట్టుకతోనే ఏర్పడి సూక్ష్మజీవుల ప్రవేశాన్ని నిరోధించే స్వయంసిద్ధమైన వ్యాధినిరోధక వ్యవస్థ. వ్యక్తులలో జీవిత కాలం కొనసాగుతుంది. వంశపారంపర్యంగా జీవులకు సంక్రమిస్తుంది కూడా హానికారక సూక్ష్మజీవుల తాకిడికి వెనువెంటనే స్పందించి వ్యక్తపరిచే మొట్టమొదటి స్వాభావిక చర్య. ఈ చర్యలన్నీ కొన్నిగంటల వ్యవధిలోనే జరుగుతాయి. అనగా తక్షణం జరిగే చర్యలు. ఈ వ్యవస్థలో జ్ఞాపకశక్తి లోపించిఉంటుంది (absence of memory).
స్వాభావిక చర్యలన్నీ నిర్దిష్ట మైనవి కావు (non-specific). అందువలన బాక్టీరియా, వైరస్, ఫంగై, ప్రోటోజోవా వంటి అన్నిరకాల సూక్ష్మజీవుల ప్రవేశాన్నినిరోధిస్తుంది (3).
2011లో Bruce A.Beutler, Jules A. Hoffmann అను శాస్త్రజ్ఞుల 'స్వాభావిక నిరోధకత్వం యొక్క క్రియా శీలత' (concerning the activation of active immunity) ను గురించిన పరిశోధనలకు గాను వారికి నోబెల్ బహుమతి రావడం జరిగింది (4).
ఈ నిరోధకత్వం అనేక అవరోధాల సహాయంతో సూక్ష్మజీవుల ప్రవేశాన్ని నిరోధిస్తుంది. ఈ అవరోధాలను వరుసగా భౌతిక (physical), రసాయనిక (chemical), జీవసంబంధ (biological), కణసంబంధ అవరోధాలుగా (cellular) పరిగణిస్తారు (3).
ఈ వ్యవస్థలో పాల్గొనే కణాలు ముఖ్యంగా న్యూట్రోఫిల్స్ (neutrophils), మోనోసైట్లు (monocytes), సహజ కిల్లర్ కణాలు (natural killer cells), బేసోఫిల్స్ (basophils), మాస్ట్ కణాలు (mast cells) అసంక్రామ్య వ్యవస్థలో భాగమైన 'కాంప్లిమెంట్ ప్రోటీన్స్ ' (complement proteins) కూడా స్వాభావిక చర్యలలో పాల్గొంటాయి (5).
ఈ ప్రోటీన్ లు వ్యాధిజనకాలను 'లైసిస్' (lysis) ప్రక్రియకు గురిచేసి నాశనం కావించటం కాని, లేదా మాక్రోఫేజ్ ల సహాయంతో కణ భక్షణంకానీ జరుపుతాయి (6).స్వాభావిక చర్యలలో మాక్రోఫేజ్ లు అతి కీలక పాత్ర వహిస్తాయి. ఇవి బాక్టీరియాల ఉనికిని గుర్తించి, సైటోకైన్ లనబడు ప్రోటీనుల సహాయంతో వాటిని కణభక్షణానికి గురిచేస్తాయి (7).
చిన్న పిల్లలలో కూడా ఈ స్వాభావిక అసంక్రామ్య చర్యలు చాలా చక్కగా నిర్వర్తింపబడుతాయి (8).
స్వాభావిక నిరోధకత్వం యొక్క ముఖ్య విధి:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.