గర్భాశయంలోని సర్విక్స్ భాగంలో ఏర్పడ్డ క్యాన్సర్ From Wikipedia, the free encyclopedia
సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్ అనేది గర్భాశయంలోని సర్విక్స్ భాగంలో ఏర్పడ్డ కా.[2] సర్విక్స్ అంటే గర్భాశయ దిగువ భాగం. ఇది గర్భాశయాన్ని, యోనితో అనుసంధానించుతుంది.
సర్విక్స్ గర్భాశయ కాన్సర్ | |
---|---|
ఇతర పేర్లు | సర్వైకల్ కాన్సర్ |
సర్వైకల్ కాన్సర్ కనిపించే ప్రదేశము, సాధారణ కణాలు ఇంకా కాన్సర్ కణాలు | |
ఉచ్చారణ |
|
ప్రత్యేకత | గర్భకోశ వ్యాధులు, ఆంకాలజీ |
లక్షణాలు | లక్షణాలు కనిపించవు. తరువాత, అసాధారణ యోని రక్తస్రావం, కటి నొప్పి, లైంగిక సంపర్కం సమయంలో నొప్పి కొన్నిసార్లు ప్రేగు, మూత్రాశయం పనితీరుతో సమస్యలు ఉండవచ్చు |
సాధారణ ప్రారంభం | 10 నుండి 20 సంవత్సరాల మధ్య |
రకాలు | 90% పొలుసుల కణ క్యాన్సర్ , 10% అడెనో క్యార్సినోమా, కొంతవరకు ఇతర రకాలు |
కారణాలు | మానవ పాపిల్లోమావైరస్ సంక్రమణ |
ప్రమాద కారకములు | ధూమపానం, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, గర్భ నియంత్రణ మాత్రలు, చిన్న వయస్సులోనే లైంగిక సంబంధం ప్రారంభించడం, చాలా మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉండటం |
రోగనిర్ధారణ పద్ధతి | గర్భాశయ పరీక్ష, బయాప్సీ, మెడికల్ ఇమేజింగ్ |
నివారణ | పాప్ పరీక్ష, ఎసిటిక్ ఆమ్లాన్నీ ఉపయోగించి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ |
చికిత్స | శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ |
రోగ నిరూపణ | 68%లో 5 సంవత్సరాల మనుగడ, అమెరికా లో 46% |
తరుచుదనము | 570,000 new cases (2018) |
మరణాలు | 311,000 (2018) |
దీనికి కారణం శరీర ఇతర భాగాలపై దాడి చేయగల లేదా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉన్న కణాల అసాధారణ పెరుగుదల .[3] సాధారణంగా ప్రారంభంలో, ఎటువంటి లక్షణాలు కనిపించవు..[2] తరువాత, అసాధారణ యోని రక్తస్రావం, కటి నొప్పి, లైంగిక సంపర్కం సమయంలో నొప్పి కొన్నిసార్లు ప్రేగు, మూత్రాశయం పనితీరుతో సమస్యలు ఉండవచ్చు.[2] సంభోగం తర్వాత రక్తస్రావం తీవ్రంగా ఉండకపోవచ్చు కానీ ఇది గర్భాశయ క్యాన్సర్ ఉనికిని కూడా సూచించవచ్చు.
90% పైగా సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్ కేసులకు మానవ పాపిల్లోమావైరస్ సంక్రమణ (HPV) కారణమవుతుంది.[4][5] అయితే, HPV సంక్రమణలు ఉన్న అంత మందికి గర్భాశయ క్యాన్సర్ అభివృద్ధి చెందదు.[6] ఇతర ప్రమాద కారకాలలో ధూమపానం, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, గర్భ నియంత్రణ మాత్రలు, చిన్న వయస్సులోనే లైంగిక సంబంధం ప్రారంభించడం, చాలా మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉండటం వంటివి ఉన్నాయి, కానీ ఇవి ఎక్కువ ముఖ్యమైనవి కావు.[7][8]
సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్ సాధారణంగా 10 నుండి 20 సంవత్సరాల కాలం ముండు నుంచి జరుగుతున్న మార్పుల నుండి అభివృద్ధి చెందుతుంది.[6] ఈ క్యాన్సర్ కేసులలో సుమారు 90% పొలుసుల కణ క్యాన్సర్ (squamous cell carcinomas), 10% అడెనోక్యార్సినోమా, కొంతవరకు ఇతర రకాలు.[7]
రోగనిర్ధారణ సాధారణంగా గర్భాశయ పరీక్ష, తరువాత బయాప్సీ ద్వారా జరుగుతుంది. క్యాన్సర్ వ్యాపించిందో లేదో తెలుసుకోవడానికి మెడికల్ ఇమేజింగ్ చేస్తారు.[8] హెచ్.పి.వి. (HPV) టీకాలు అధిక-ప్రమాదకర వైరస్ల కుటుంబానికి చెందిన రెండు నుండి ఏడు వైరస్ల వరకు రక్షిస్తాయి. 90% సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్లను నివారించవచ్చు.[9][10][11] అయితే క్యాన్సర్ ప్రమాదం ఎప్పటికీ ఉన్నందున, మార్గదర్శకాలు సాధారణంగా పాప్ పరీక్షలను కొనసాగించాలని సిఫార్సు చేస్తాయి.[9] ఇతర నివారణ పద్ధతులు ఏమంటే లైంగిక భాగస్వాములను తక్కువ కలిగి ఉండటం, కండోమ్‌ల వాడకం.[12] పాప్ పరీక్ష లేదా ఎసిటిక్ ఆమ్లాన్నీ ఉపయోగించి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ముందస్తు మార్పులను గుర్తించగలదు, ఇది చికిత్స చేసినప్పుడు, క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించగలదు.[13] చికిత్సలో శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ కలపి ఉండవచ్చు.[8] అమెరికాలో ఐదేళ్ల మనుగడ రేటు 68%. [14] అయితే, క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తించారన్న దానిపై ఈ ఫలితాలు ఆధారపడి ఉంటుంది .[7]
ప్రపంచవ్యాప్తంగా, క్యాన్సర్‌కు ఈ సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్ నాల్గవ అత్యంత సాధారణ కారణం . మహిళల్లో క్యాన్సర్ మరణాలకి నాల్గవ కారణం కూడా.[6] 2012 లో, సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్ కేసులు 528,000 , ఇంకా 266,000 మరణాలు సంభవించాయి.[6] ఇది మొత్తం క్యాన్సర్ మరణాలలో సుమారు 8%.[15] అభివృద్ధి చెందుతున్న దేశాలలో సుమారు 70% సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్లు, 90% మరణాలు సంభవిస్తున్నాయి.[6][16] తక్కువ ఆదాయ దేశాలలో, క్యాన్సర్ మరణానికి ఇది అత్యంత సాధారణ కారణాలలో ఒకటి .[13] అభివృద్ధి చెందిన దేశాలలో, సర్విక్స్ గర్భాశయ పరీక్ష కార్యక్రమాల విస్తృత వినియోగం సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్ రేట్లను బాగా తగ్గించింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.