From Wikipedia, the free encyclopedia
సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2010 నుండి 2023 మే 1 వరకు తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా పని చేశాడు.[3][4]
సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ ساید امین ال حسن جافری | |||
తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ | |||
పదవీ కాలం 2022 జనవరి 12 – 2022 మార్చి 14 | |||
నియోజకవర్గం | స్థానిక సంస్థల కోటా | ||
---|---|---|---|
తెలంగాణ శాసన మండలి సభ్యుడు | |||
పదవీ కాలం 2010 – 2023 మే 1 | |||
తరువాత | మీర్జా రహమత్ బేగ్ | ||
నియోజకవర్గం | స్థానిక సంస్థల కోటా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | |||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇట్టేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) | ||
తల్లిదండ్రులు | సయ్యద్ అహ్మద్ హుస్సేన్ జాఫ్రీ[1] | ||
జీవిత భాగస్వామి | రషేదా సుల్తానా[2] | ||
నివాసం | ఐ.ఎస్. సదన్, సంతోష్ నగర్, హైదరాబాద్ | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా యూనివర్సిటీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వృత్తి | జర్నలిస్ట్ |
సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ 25 జనవరి 1955లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లో సయ్యద్ అహ్మద్ హుస్సేన్ జాఫ్రీ, మెహీరున్నీసా బేగం దంపతులకు జన్మించాడు. ఆయన 1977లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి జర్నలిజం పూర్తి చేశాడు.
సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ రాజకీయాల్లోకి రాకముందు న్యూస్ టైం, డెక్కన్ క్రానికల్, ఈనాడు, బీబీసీ, రిటర్స్, రెడిఫ్.కామ్ లో జర్నలిస్ట్ గా పని చేశాడు.ఆయన 2010లో (ఎంఐఎం) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2010లో తొలిసారి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. జాఫ్రీ 2011 నుండి 2014 వరకు రెండోసారి, 2014 నుండి 2017 వరకు మూడోసారి, 2017లో స్థానిక సంస్థల కోటాలో నాల్గొవసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[5][6] ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఉన్నాడు.[7][8] అమీనుల్ హసన్ జాఫ్రీ 12 జనవరి 2022న తెలంగాణ శాసనమండలి ఛైర్మన్గా నియమితుడయ్యాడు.[9][10]
Seamless Wikipedia browsing. On steroids.